Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఫేస్ బుక్ లో ఉన్న చెత్తను ఎలా తొలగించాలి - how to remove fake facebook friends from your list - megamind

ఫేస్ బుక్ లో ఉన్న చెత్తను ఎలా తొలగించాలి?:   మనమంతా ఉదయం లేచిన దగ్గర నుండి పదుకునే వరకు మన చేతిల్ఫ్ ఫోన్ దానిలో ఫేస్ బుక్ లేని...



ఫేస్ బుక్ లో ఉన్న చెత్తను ఎలా తొలగించాలి?: మనమంతా ఉదయం లేచిన దగ్గర నుండి పదుకునే వరకు మన చేతిల్ఫ్ ఫోన్ దానిలో ఫేస్ బుక్ లేని ఫోన్ ఉండదు, ప్రస్తుతం అది మన జీవితంలో భాగంగా మారిపోయింది. అనేకమంది నన్ను ఆడిగిన ప్రశ్నలకు సమాదానంగా ఈ వ్యాసం వ్రాయడం జరుగుతుంది.

ఆ ప్రశ్నలు ఎంటంటే సర్ మాకు 5 వేల మిత్రులు దాటిపోయారు, 20 వేల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు కాని చూడబోతే పోస్ట్ పెడితే 20 లైక్స్ రావడం లేదు, 10 మంది కూడా శేర్ చెయడం లేదు, అసలు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఎందుకు మాకు లైక్స్ రావడం లేదు, మా పోస్ట్ లు ఒకప్పుడు బాగా వైరల్ అయ్యేవి ఇప్పుడు కావడం లేదు, మా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న మాకు లైక్ లు కామెంట్లు శేర్ లు చేయని వాళ్ళని ఎలా గుర్తించాలి, రిమూవ్ చేయాలి ఇలా అనేక ప్రశ్నలు నాకు వాట్సాప్ ద్వారా మెస్సెంజెర్ ద్వారా నన్ను ఆడగటం జరిగింది, వాటికి సమాదానంగా ఈ ముఖ్యమైన కొన్ని విషయాలు గమనించి, కొంత సమయం కేటాయించండి మళ్ళీ మీ పోస్ట్ లు వైరల్ అవుతాయి.


మొట్ట మొదట ఒక రెండు గంటల సమయం ఫేస్ బుక్ కి కేటాయించండి, నేను చెప్పిన విధంగా ప్రయత్నం చేయండి.

  • మీ ఫ్రెండ్స్ లిస్ట్ లోకి వెళ్ళి ప్రొఫైల్ పిక్ లేని వాళ్ళందరిని అన్ ఫ్రెండ్ చేయండి.
  • అలాగే సొంత పేరు లేకుండా వేరే పేర్లతో ఉన్న వాళ్ళందరినీ అన్ ఫ్రెండ్ చేయండి.
  • పిచ్చి పిచ్చి ప్రొఫైల్ పిక్ కలిగిన వాళ్ళను కూడా అన్ ఫ్రెండ్ చేయండి.
  • మీకు బాగా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్ లోకి వెళ్ళి మ్యుటువల్ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న మీకు తెలియని మ్యుటువల్ ఫ్రెండ్ ని అన్ ఫ్రెండ్ చేయండి.
  • చివరగా మన క్లాస్ మేట్స్, మిత్రులు, బందువులు కాకుండా మనకు తెలిసి మన వాల్ ని చూస్తూ కూడా లైక్ చెయని వాళ్ళని అన్ ఫ్రెండ్ చేయండి. ఇలా మన ఫ్రెండ్స్ లిస్ట్ అంతా క్లియర్ అయ్యాక.


ముఖ్యంగా ఒక వారం పాటు మనకు వీలుండి ఫేస్ బుక్ లో లాగిన్ అయిన ప్రతిసారి కూడా మనకు తెలిసిన మిత్రులందరి వాల్ మీదకు వెళ్ళి రోజూ మూదు నాలుగు పోస్ట్ లకు లైక్ లు, కామెంట్లు చేయండి ఇక అప్పుడు మొదలవుతుంది మీ వాల్ ఎంగెజ్ అయ్యి ఏక్టివ్ అవుతుంది.

సహజంగా మానవ నైజం ఏమిటంటే మనం స్పందిస్తే తప్ప ఎదుటి వాళ్ళు స్పందించరు కొంతమంది మనం స్పందించక పోయినా వాళ్ళు మనకు ప్రతిసారి స్పందిస్తూ ఉంటారు. కాబట్టి మనం స్పందించే గుణాన్ని మొదట కలిగి ఉంటే మన వాళ్ ఎంగెజ్ అయ్యి రోజూ మరల మన ఏక్టివ్ అవుతుంది.

ఇక మనం ఫేస్ బుక్ లో వెంట వెంటనే పోస్ట్ లు పెట్టకుండా ప్రతి పోస్ట్ కి కనీసం అర్దగంట నిడివి తో పోస్ట్ చేయండం వలన మన ఫ్రెండ్స్ ఎదో ఒక సమయంలో స్పందించి మనకు లైక్ లు, కామెంట్ లు చేసే స్వభావం కలిగి ఉంటారు. అప్పుడు మీకు మీ వాల్ కి ట్రాఫిక్ పెరుగుతుంది.

ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఫేస్ బుక్ కు కంటిన్యుటీ ముఖ్యం నేను వారానికి ఒక పొస్ట్ పెడతా ఎవరికీ లైక్ కొట్టను అంటే మీరు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పాపులర్ ఎప్పటికీ కాలేరు. కొంతమంది మనల్ని చూస్తూ ఉంటూ లైక్ లు కామెంట్లు కూడా చేయరు అయినప్పటికీ అవతలి వారు బాగా పాపులర్ అయిన వ్యక్తి కనుక అతని వాల్ మీద మనం రెగ్యులర్ గా కామెంట్లు చేస్తూ ఉండాలీ.

ఇదండీ కాబట్టి నిజంగా మీ వాల్ లో ఉన్న చెత్తను తీసేసి మీకు కావలసిన వారందరికీ స్పందిస్తూ మిమ్మల్ని మీరు సమజానికి పరిచయం చేసుకుంటే ఒక్కసారిగా వేలాది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ లు వస్తాయి వాటిలో పైన చెప్పిన గుణాలు కలిగి ఉంటే మిత్రునిగా చేసుకోండి లేదంటే వదిలేయండి, ఇక అభిమానులుగా ఉన్న వాళ్ళకు కూడా ఇదే పని చేయండి, ఇలా నేను చెప్పిన వాటిని ఒక వారం పాటు గనుక చేస్తే మీ చెత్త పోయి ఒక మంచి ఫేస్ బుక్ సామాజిక ప్రచార కార్యకర్తగా ఎదగగలుగుతారు. నేను చెప్పిన ఈ విషయాలు నచ్చినట్లయితే అందరికీ శేర్ చేసి నాకు మద్దతు తెలుపండి, అలాగే ఇంకా జత పరచాల్సిన పాయింట్స్ ఉంటే కామెంట్లు చేయండి. మీ రాజశేఖర్ నన్నపనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment