Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఫేస్ బుక్ లో మీరు తోపు కావలనుకుంటున్నారా? - How To Become More Popular On Facebook - MegaMind

సహజంగా అందరికీ సోషల్ మీడియాలో పాపులర్ కావాలీ, మన ఇమేజ్ ని పెంచుకోవాలి అనే కుతూహలం ఉంటుంది. కానీ అందరూ సోషల్ మీడియాలో పాపులర్...

సహజంగా అందరికీ సోషల్ మీడియాలో పాపులర్ కావాలీ, మన ఇమేజ్ ని పెంచుకోవాలి అనే కుతూహలం ఉంటుంది. కానీ అందరూ సోషల్ మీడియాలో పాపులర్ కాలేరు, కానీ కొంతమంది చాలా తక్కువ కాలంలో ఎక్కడనుండో ఊడిపడ్డట్లు ఒక్కసారిగా ఫ్యామస్ అయిపోతుంటారు, అలాకాకుండా నిదానంగా మనం కూడా ఎంచుకున్న దారిలో కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నప్పటికీ పాపులర్ అవ్వడం చాలా తేలిక. అయితే ఈ వ్యాసం లో ఫేస్ బుక్ లో పాపులర్ ఎలానో తెలుసుకుందాం!.

స్నేహితులు & అభిమానులు: సహజంగా ఫేస్ బుక్ లో మనకున్న ఫ్రెండ్స్ వలన మనం చాలా ఈజీగా తేలికగా పాపులర్అ వ్వొచ్చు వీళ్ళే మనకు ముఖ్యం. మరి మీరంటారు మాకు పదివేల ఫాలోవర్స్, 5000 ఫ్రెండ్స్ లిమిట్ దాటిపోయారు కానీ లైక్స్ కేవలం  20 మాత్రమే వస్తున్నాయి అసలు శేర్ లు అయితే పదిలోపే ఉంటున్నాయి కాబట్టి మీరు చెప్పింది కరెక్ట్ కాదు అనవచ్చు, కానీ మనం పాపులర్ అవ్వాలంటే కేవలం దానికి  మన ఫ్రెండ్స్ నే ముఖ్యం ఎలాగో చివర్లో చెబుతాను.

మన పోస్ట్ ఎలా ఉండాలి: మనం ఎంచుకున్న  పోస్ట్లు చాలా ముఖ్యపాత్రను పోషిస్తాయి, మనం పెట్టే పోస్ట్లు సూటిగా సుత్తిలెకుండా కట్టె కొట్టె తెచ్చే అనే పద్దతిలో సరళంగా, భావాత్మకంగా ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ఆకట్టుకునే విధంగా పోస్ట్ ని ప్రజెంట్ చేయగలగాలి, ఉదా: తిరుమల తిరుపతి భూముల వేలం గురించి స్పష్టంగా పెట్టడం వలన సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్ బుక్ ద్వారా గొప్ప విజయం సాధించాము మొన్నటికి మొన్న చాలామంది ఈ పోస్ట్ లను పెట్టడం వలన పాపులర్ అయ్యారు.

మన పోస్ట్ కి సంభందించిన చిత్రాలు: మనం పెట్టే పోస్ట్ లకు సంభందించి ఇమెజ్ లు చాలా ముఖ్యపాత్రని పోషిస్తాయి, ఇమేజ్ లు మన పోస్ట్ కి ప్రాణంలాంటిది మంచి చిత్రాలను గూగుల్ నుండి డౌన్ లోడ్ చేసుకుని కాస్త మెరుగులు అద్ది పెడితే పాపులర్ అవ్వకుండా ఉండే అవకాశమే లేదు, ఉదా: వలస కార్మికుల పోటోలు పెట్టి పోస్ట్ లు చెయడం వలన ప్రభుత్వాలు దిగివచ్చి శ్రామిక రైళ్ళను ఏర్పాటు  చేశాయి, అలాగే నిన్నటికి నిన్న కేరళలో కొంతమంది కమ్మినిస్ట్ స్వభావం కలిగిన కొంతమంది ఆకతాయిలు కడుపుతో ఉన్న ఏనుగుని పైనాపిల్ ఆశ చూపి టపాకయలు పెల్చి ఆ ఎనుగుని చంపివేశారు ఈ విషయం మీద అనెకమంది కొన్ని చిత్రాలు ఫేస్ బుక్ లో అప్లోడ్ చేశారు అవి ఎంతటి కర్కశస్వభావం కలిగి ఉన్న వాళ్ళైనా స్పందించక ఉండలేకపోయారు, హృదయం ద్రవించె చిత్రాలను క్రియేట్ చేశారు దేశం అంతా ఆ ఏనుగులను కాపాడాలని ఒక భావోద్వేగానికి గురయ్యి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కాబట్టి మనం పాపులర్ అవ్వాలంటే మంచి ఇమేజ్ లను తయారుచేసుకోవాలి.

తాజాదనం & సృజనాత్మకత: సోషల్ మీడియా ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ లో తాజాదనం కలిగి ఉండాలి ఆ పోస్ట్ ఎప్పుడో గడిచిన గతం గురించి కాకుండా ప్రస్తుత పరిస్తితులు ఆరోజును ఉన్న సమస్యలు, లేదా మంచి విషయాలు సామాన్యులకు చేరే విధంగా మనం ప్రతిరోజూ ఫ్రెష్ గా ఆలోచన చేస్తూ పోస్ట్ లు పెట్టాలి, అలాగే మన పోస్ట్ లో క్రియేటివిటీ ఉండాలీ అందరితో పాటే మనమూ కాకుండా మనం కొంచెం ప్రత్యేకంగా ఆలోచిస్తూ కొత్తగా అనిపించే విధంగా ఈజీగా అర్దమయ్యే విధంగా మనకంటూ కొంతమంది ప్రత్యేక అభిమానుల్ని ఏర్పరుచుకోవాలి వాళ్ళె మనల్ని పాపులర్ చేస్తారు అలాగే మనల్ని ఆదరిస్తారు. కాబట్టి తాజాదనం సృజనాత్మకత కలిగి ఉండాలి.

మనం పోస్ట్ పెట్టే సమయం: ఫేస్ బుక్ లో మనం పెట్టే పోస్ట్ పలానా సమయంలో పెడితే ఈ పోస్ట్ వైరల్ అవుతుంది, ఈ టైం లో పెట్టండి, ఆ టైం లో పెట్టండి అంటుంటారు, కాని అది పట్టించుకోకండి కాస్త కామన్సెన్స్ ఉపయోగించి మీరే మీ స్నేహితులు ఎక్కువమంది ఏ సమయంలో అందరూ ఫేస్బుక్ చూస్తారో కొంచెం ఆలోచించి మీకున్న సమయాన్ని బట్టి పోస్ట్ చేయండి దీనికి పలానా సమయం అంటూ ఏమీ లేదు అందరూ చెప్పినట్లు. కానీ సాయంత్రం 7 గంటల తరువాత పోస్ట్ లకి కాస్త అనువైన సమయం మనం కూడా అప్పుడె ఆఫీసు నుండి వచ్చి రిలాక్స్ అవ్వడం కోసం ఫేస్ బుక్ ఓపెన్ చేస్తాము కనుక.

ఫేస్ బుక్ గ్రూపులు: మనకు ఫెస్ బుక్ ఫ్రెండ్స్, అభిమానులు ఎలాగో ఫేస్ బుక్ గ్రూప్స్ కూడా అలాగే మనం పెట్టిన  పోస్ట్ ని కొన్ని గ్ర్రుప్స్ లో కూడా శేర్ చేసె అవకాశం మనకు అభిరుచి ఉన్న గ్ర్రుప్ లలో జాయిన్ అయ్యి వాటికి సంబందించిన గ్ర్రుప్ లలో మన పోస్ట్ శేర్ చేయడం వలన కాస్త ఎక్కువ రీచ్ ఉండి మనం పాపులర్ అయ్యే అవకాశం ఉంది అంటుంటారు కానీ ఇదీ వాస్తవం కాదు, కొంత వరకు ఉపయోగపడవచ్చు అంతే అయితే 
ముఖ్యంగా మన ఈ పోస్ట్ లో మొదటగా చెప్పుకున్న ఫ్రెండ్స్ అలాగే మిత్రుల వలనే మనం ఈజీగా ఫ్యామస్ అవ్వొచ్చు, అదెలానో చూద్దాం  మనం అందరం కెమిస్ట్రీ ఎంతోకొంత చదివే ఉంటాం, చర్య కు ప్రతి చర్య, ఉత్ప్రేరకాలు ఇలాంటివి అలాగే ఫేస్ బుక్ టెక్నాలజీ లో కోడ్  కి ప్రతిదానికి కూడా అల్గారిథం ఉంటుంది, ఆ అల్గారితం ఎలా ఉంటుంది అంటె మనం స్పందిస్తే అదీ స్పందిస్తుందీ కనుక మన ఫ్రెండ్స్ లిస్ట్ లో గా ఉన్న వాళ్లందరికీ రోజూ మీ వంతుగా లైక్, కామెంట్ లు ప్రతి ఫ్రెండ్ కి ఒక వారం రోజులు సమయం పెట్తుకునీ రోజూ వారి పోస్ట్ లకు లైక్ లు కామెంట్లు చేస్తూ ఉండండి, అప్పుదు అల్గారిథం మిమ్మల్ని వాళ్ళని ఎంగెజ్ చేస్తూ రోజూ మీ పోస్ట్ లు వాళ్ళకు వాళ్ళ పోస్ట్ మీకూ వచ్చే విధంగా అల్గారిదం పనిచేస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న ఫ్రెండ్స్ కి కామెంట్ల రూపంలో లైక్ ల రూపంలో స్పందించండి మీరు ఇలా కొన్ని రోజులు చేయడం వలన మీకంటూ ఒక గుర్తింపు వచ్చి మీరే ఫేస్ బుక్ లో తోపులవ్వొచ్చు ఇదే అసలు రహస్యం, ఈ మా వ్యాసం నచ్చినట్లయితే ఇదే ఫేస్ బుక్ లో శేర్ చేయండి మీరూ పాపులర్ అవ్వండి మమ్మల్ని పాపులర్ చేయండి జై హింద్. - మీ రాజశేఖర్ నన్నపనేని.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments