మేము పాటలు పాడక ఏడవాలా? అని ఉపాధ్యాయుడినే ప్రశ్నించిన విద్యార్థి ఎవరో తెలుసా? - megamind - short stories in telugu

0

అది ఒక పాఠశాల, పిల్లలంతా తరగతి గదిలో కూర్చొని ఉన్నారు. పీరియడుకి గంట కొట్టారు. కాని ఉపాధ్యాయుడు తరగతికి రాలేదు. పిల్లలంతా చాలా సేపు ఎదురుచూశారు. కానీ ప్రయోజనం లేదు. ఉపాధ్యాయుల ఆఫీసు గదిలో కూర్చొని తోటివారితో బాతాభానీ కొడుతున్నాడు. ఆ మాటలలో అతడు క్లాసు సంగతే మరచిపోయాడు. పిల్లల్లో ఓర్పు నశించింది. క్లాసులో ఎలుగెత్తి పాటలు పాడు సాగారు.

ఆ పాటలు ఆఫీసులో ఉన్న ఉపాధ్యాయుడికి వినిపించాయి. మాటలు ఆపి హడావుడిగా క్లాసుకు వచ్చాడు. గోల చేస్తున్న పిల్లలను చివాట్లు వేశాడు. అందులో ఒక పిల్లవాడు పైకి లేచాడు. అతడి ముఖంలో ధైర్యం, పట్టుదల గోచరిస్తున్నాయి. అయ్యా! మీరు క్లాసు సంగతి మరచి మాటల్లో పడ్డారు. మేము పాటలు పాడక ఏడవాలా? అని అన్నాడు. ఆ జవాబు ఉపాధ్యాయుడికి కోపం తారాస్థాయిని అందుకున్నది. నిప్పులు కురిపిస్తూ ఆ కుర్రవాడిని బయటికి గెంటివేశాడు.

ఆ అబ్బాయి తడబడలేదు. ఏడువలేదు. ఒక్కసారి తరగతి అంతా పరికించి చూశాడు. తన దారిని తాను వెళ్లాడు. అంతే! క్లాసులో పిల్లలంతా ఆ అబ్బాయిని అనుసరించారు. ఉపాధ్యాయుడు ఆశ్చర్యం నుండి తీరుకొనేలోపునే గది అంతా ఖాళీ అయింది. మరునాడు కూడా విద్యార్థులెవరూ క్లాసుకు రాలేదు. ఈ సంగతి హెడ్మాష్టరుగారికి తెలిసింది. ఆయన విద్యార్థులు అందరినీ పిలిపించాడు ఈ వరుస ఏమి బాగుండలేదు. మాష్టరుగారికి క్షమాపణ చెప్పుకోండి! అన్నారు.

మన కుర్రవాడు ఉన్నాడే! అతడు నిర్భయంగా య్యా! ఈ తీర్పు సరి అయింది కాదు.. మొదటి తప్పు ఉపాధ్యాయుడిది. ఆయనను మీరు సమర్థిస్తున్నారు.. అంటూ క్రితం రోజు జరిగిన సంఘటనను వివరంగా చెప్పాడు ఆ అబ్బాయి, హెడ్మాష్టరుకు ఆ వాదన చక్కగా నచ్చింది. కుర్రవాళ్లను క్లాసుకు వెళ్లమన్నాడు. వాళ్లంతా సంతోషంగా వెళ్లారు. అలా ధైర్యంగా మాట్లాడిన అబ్బాయే! వల్లభభాయి పటేల్ ఆయనను ఉక్కు మనిషి అని అన్నారు. సర్దార్! అని గౌరవంగా పిలిచారు.


ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top