నాకు గుర్రపు స్వారీ అసలు తెలియ దండీ! అని ఐ సి ఎస్ పట్టా తీసుకోని దేశభక్తుడెవరో తెలుసా? - megamindsindia short stories in telugu

megaminds
0

ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించే రోజులు. వారు ఐ.సి.ఎస్ (ఇండియన్ సివిల్ సర్వీసు) అనే ఉన్నత పరీక్షను నిర్వహించేవారు. దానిలో కృతార్థులైన వాళ్లకు జిల్లా కలెక్టరు.. ప్రభుత్వ కార్యదర్శి లాంటి పెద్ద పదవులు లభించేవి.

పరీక్ష ఆ రోజుల్లో ఇంగ్లండ్ లో జరిగేవి. ఆ పరీక్షకు చదవడానికి భారతీయ యువకులు లండన్ వెళ్ళే వారు, 1884లో ఒక బాలుడు విద్యనంతా అక్కడే అభ్యసించటానికి లండన్ చేరుకున్నాడు. బాగా చదివి పరీక్షలన్నీ ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. తండ్రి కోర్కె మేరకు ఐ.సి.ఎస్ కు కూడా చదివాడు. మంచి మార్కులతో ఉత్తీర్ణుడైనాడు.

కాని అతడికి ఆంగ్లేయుల క్రింద పనిచేయాలని లేదు. అందుకని ఒక యుక్తి పన్నాడు. ఐ.సి.ఎస్.కు గుర్రపుస్వారీ కూడా ఒక పరీక్ష కాని దానిని ఆ యువకుడు నేర్చుకోలేదు. నాకు గుర్రపు స్వారీ అసలు తెలియ దండీ! అని గట్టిగా పరీక్షాధికారులకు చెప్పాడు. వారు ఎట్లాగయినా నేర్చుకొమ్మని బలవంతం చేశారు. కాని పరీక్ష తప్పించుకోవటానికి అతడు గుర్రపుస్వారీ నేర్చుకోలేదు. భారతదేశం వెళ్లి నేర్చుకొని వచ్చి పరీక్ష ఇవ్వమని అధికారులు చెబుదామనుకున్నారు.

ఆ యువకుడు అప్పటికే భారతదేశంలోని ఆంగ్ల పాలనను విమర్శించి ఉన్నాడు. అందుకని అతడికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. దానితో ఐ.సి.ఎస్ డిగ్రీ రాకుండా పోయింది. తల్లిదండ్రులు ఎంతో విచారించారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే పీడ వదలినందుకు ఆ యువకుడు సంతోషించాడు. అతడికి అధికార పదవి నుండి విముక్తి లభించింది. భారతదేశం వచ్చి కొన్నాళ్లు ఉపాధ్యాయుడిగా గడిపాడు. స్వాతంత్ర సమరంలో కొన్నాళ్లు పాల్గొన్నాడు. దానిని వదిలిపెట్టాడు. పాండిచ్చేరి వెళ్ళి అక్కడ ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. ఆధ్యాత్మిక సాధనలో అగ్రశ్రేణిగా నిలిచాడు. ఆంగ్లంలో ఎన్నో గ్రంథాలు వ్రాశాడు. ఆయనే అరవింద మహర్షి.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top