సైమన్ కమిషన్ సిపాయిలకు ఎదురుగా నిలబడి నన్ను కాల్చండి అన్నదెవరో తెలుసా? - MegaMinds - Short Stories in Telugu

0

అది 1928వ సంవత్సరం ఫిబ్రవరి నెల మద్రాసు పట్టణమంతా ప్రజా సమూహాలతో కోలాహలంగా ఉన్నది. దానికి కారణం సైమన్ కమిషన్ రాక ప్రజల చేతుల్లో నల్ల జెండాలు సైమన్వెళ్ళిపో అని నినాదాలు వ్రాసిన ట్టముక్కలు. మన దేశంలో సంస్కరణలు చేయాలని అప్పుడు పరిపాలిస్తున్న ఆంగ్ల ప్రభుత్వం యోచించింది. అందుకే సైమన్ కమిషన్ ను పంపించింది. కానీ భారతీయులు ఆ కమిషన్కు నిరసన తెలియచేశారు. అట్లాంటి నిరసన ఆ కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు క్కడు జరుగుచున్నది.

ఆంగ్ల ప్రభుత్వంవారు పోలీసు బందోబస్తు విరివిగా చేశారు. ఎక్కడబడితే అక్కడ తుపాకులను పట్టుకున్న సైనికుల ను నిలిపారు. అయినా ప్రజలు అధైర్య పడలేదు. శాంతియుతంగా ఉరేగింపు జరుపుతున్నారు. పారిస్ కార్నర్ అనే చోట తుపాకీ మ్రోగింది. ఎవరో గుండు దెబ్బ తగిలి నేల కొరిగారు. ప్రజలంతా హా! హా! కారాలు చేశారు. భయపడ్డారు. అంతలో ఒక వ్యక్తి గుంపులో నుండి చ్చాడు. సైనికులను దాటుకుంటూ గుండు దెబ్బతగిలిన వ్యక్తి వైపు కదిలాడు.

వ్యక్తిని సిపాయి ఆపాడు. మీరు బలవంతంగా చనిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లదలిస్తే మిమ్మల్ని కాల్చవలసి వస్తుంది! జాగ్రత్త సిపాయి హెచ్చరించాడు. తుపాకి బారు పెట్టాడు. జనంలో నుండి వచ్చిన వ్యక్తి తొణకలేదు బెణకలేదు. వెసుకంజ వేయలేదు. ధైర్యం గా ఇదిగో నా గుండె సిద్ధంగా ఉన్నాను. కాల్చండి అని గర్జిస్తూ తన ఎదురు రొమ్ము చూపించాడు. ఆ గుంపులో నుండి ఎవరో. నీకు ధైర్యం ఉంటే కాల్చు మేమంతా సిద్ధంగా ఉన్నాం ఆయన ఎవరో నీకు తెలియదనుకుంటాను. అని అరిచాడు.

దాని తో ప్రజలకు పట్టపగ్గాలు లేకపోయాయి. ఆవేశం పెరిగింది. ఉత్సాహంతో ఆంధ్రకేసరి జై అనే నినాదాలు చేశారు. సిపాయిలకు ఏం చేయాలో తోచలేదు. తుపాకులు క్రిందకు దించారు. ఆ వ్యక్తి ధైర్యం గా గుండు దెబ్బకు పడిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లాడు. తన సానుభూతిని తెలిపాడు. అలా తుపాకీ గుండు కెదురుగా గుండె చూపిన ఆయనే టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆంధ్రకేసరి అనే వీరుడు ఆయనకు అలా వచ్చింది.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top