దేశంకోసం అత్యున్నత పట్టాని వదిలేసిన నాయకుడు ఎవరో తెలుసా? - MegaMinds - Short Stories in Telugu


అవి ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులు. పరిపాలనలో తోడ్పడటానికి భారతీయులను కూడా ఎన్నుకునేవారు. అందుకోసం ఇండియన్ సివిల్ సర్వీసు అనే పరీక్షలో ఉత్తీర్ణులై ఉండవలసి వచ్చేది ఆ పరీక్షలు ఇంగ్లాండులో జరిగేవి చాలామంది పరీక్షల కోసం ఇంగ్లాండు వెళ్ళేవారు.

అది 1919 వ సంవత్సరం కలకత్తా విశ్వ విధ్యాలయం నుండి ఒక యువకుడు పట్ట పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు ఇంగ్లండు వెళ్ళి ఐ.సి.ఎస్ పరీక్ష రాసిరమ్మని చాలామంది అతడిని ప్రోత్సహించారు అందుకోసం ఇతడు ఇంగ్లండు వెళ్ళాడు. అతడిలో పట్తుదల శ్రద్ద ఎక్కువగా ఉన్నాయి. పరీక్షకు దీక్షగా చదివాడు, పరీక్ష వ్రాశాడు. ప్రథములలో నాలుగవ వడిగా ఉత్తీర్ణుడయ్యాడు. పరీక్షదికారులు తోటి విధ్యార్థులు ఎంతగానో పొగిడారు అభినందనలు తెలియజేశారు.

నీవు పరీక్షలో నాలుగవ వాడిగా వచ్చావు నీకు మంచి భవిష్యత్తు ఉంది నీ పట్టాని సక్రమంగా ఉపయోగించుకో అని ఒకరు అభినందించారు. ఆ యువ విధ్యార్థి పొగడ్తలకు పొంగిపోలేదు. నిర్మలమైన మనస్సుతో ఇలా అన్నాడు. అయ్యా నేను జ్ఞానాన్ని సంపాదించి విధ్యధికుడిగా నన్ను తీర్చి దిద్దుకోవాలనుకున్నాను అందుకే పరీక్ష వ్రాశాను. అంతేకాని ఉన్నత పదవిపై వ్యామోహంతో కాదు..

అతడు కోరుకుంటే భారతదేశంలో ఉన్నత పదవి దొరికి ఉండేది కానీ అలా చేయలేదు, పరీక్షకు రాజీనామా చేశాడు. నీ రాజీనామ వ్యాకులపాటును కలిగించింది తరువాత ఏంచేయలనుకుంటున్నావు అని ఒక మిత్రుడు అడిగాడు. నా దేశ విముక్తి కోసం పాటుపడదామనుకుంటున్నాను అని జావాబు ఇచ్చాడు అలాగే చేశాడు. చివరకు నేతాజీగా ప్రసిద్ది చెందాడు ఆయనే సుభాష్ చంద్రబోస్.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments