తివాచీలు పరవండి అందరం క్రింద కూర్చుందాం అన్నదెవరో తెలుసా? - megamind - short stories in telugu

0

పూర్వం భారత దేశమంతటా జమీందారీలు ఉండేవి. అటువంటి వాటిలో ఒకటి బెంగాల్ లో ఉన్న సీల్డా అనే గ్రామం. ఆ గ్రామ జమిందారు కొలువు తీర్చే రోజు దానినే పుణ్య మహోత్సవం అని అనేవారు. గ్రామ పంచాయతీలో ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. కచేరీకి వచ్చిన జమీందారు అక్కడ చేసిన అలంకరణలను చూశాడు. వేసిన అసనాలు చూశాడు. ఇదేమిటీ? అని అడిగాడు. ఈ ఏర్పాట్లు తమ తాత తండ్రి కాలం నుండి వస్తున్నాయండీ! కులం మతం అంతస్తులని బట్టి ఆసనాలు ఏర్పాటు చేశాం అని అన్నాడు మేనేజర్.

జమీందారుకు కోపం వచ్చింది. పర్వదినాలలో కూడా కుల మత భేదాలు? అంతస్తుల లోని విభేదాలు మరచిపోని సంకుచిత హృదయులా మీరు? ఈ ఆసనాలు వ్యత్యాసం ఎందుకు? అందరూ మానవులు కారా? అని అన్నాడు. ఇది జమీందారీ దర్బారు పద్ధతి. కాదని మీరంటే కులాచార్యం పోతుంది. ప్రక్కనే ఉన్న దివాను నసిగాడు వీలు లేదు. నా సింహాసనం. ఆసనాలు తీసివేయండి, అందరికీ తివాచీలు పరవండి. అందరం సమానంగా కూర్చుందాం! అని జమీందారు పట్టుబట్టాడు.

మేనేజరు, కార్యదర్శి, దివాను ఎంతో నచ్చచెప్పారు. తరతరాల గౌరవం అపఖ్యాతిపాలవుతుంది. అని వేడుకున్నారు కానీ జమీందారు పట్టు వదల్లేదు చేసేదేమి లేక ఆసనాలు తొలగించారు. అందరికీ తివాచీలు పరిచారు ప్రజలందరూ సుఖంగా కూర్చున్నారు జమిందారు కూడా వారితో పాటు తృప్తి గా కూర్చున్నాడు.

సమయం వచ్చినప్పుడు లేచి గంభీరంగా ఉపన్యసించాడు. సమాజంలో కుల మత భేదాలు పోవాలని. హెచ్చు తగ్గులు సమసిపోవాలనీ. సర్వమానవ సౌభ్రాతృత్వం పెంపొందాలనీ చెప్పాడు. ఆ పలుకులు విన్న సభికులు పరవశించారు. ఆయన విశాల హృదయానికి ప్రశంసల వర్షం కురిపించారు ఆ జమిందారే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top