నష్టం వస్తుందని ప్రజలకు పాడైపోయిన మందు అందిస్తామా అన్న శాస్త్రవేత్త ఎవరో తెలుసా? - megamind - short stories in telugu


భారతదేశపు వైద్యవిధానం యుర్వేదం. ఆంగ్ల వైద్యవిధానం అల్లోపతీ రాకముందు ఆయుర్వేేదానికి మంచి ప్రాముఖ్యత ఉండేది. ఆంగ్లేయులు మన దేశం ఆక్రమించుకున్నారు దానితో వాళ్ల వైద్య విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అప్పటితో ఆయుర్వేదం ఒడిదుడుకులకు లోనయింది. ఆయుర్వేదాన్ని మనదేశీయులు చాలా మంది ప్రచారం చేయ సాగించారు. ఆంగ్ల ఔషధాలకు దీటుగా దేశీయ ఔషధాలు తయారు చేయాలని కొందరు ప్రయత్నాలు సాగించారు.

అటువంటి ప్రయత్నాన్ని బెంగాల్ లో ఓ ప్రసిద్ధ విద్యావేత్త చేశాడు. దేశీయ ఔషధాలు తయారు చేయటానికి ఒక సంస్థను స్థాపించాడు. అయినా కొంతమంది ప్రజలు రోగ విముక్తికి దేశీయ ఔషధాలు పనికిరావని అనుకుంటూ ఉండేవారు. ఇటువంటి పరిస్థితులలో ఆ విద్యాధికుడు సంకటంలో చిక్కుకున్నాడు. ఒకసారి ఆ సంస్థ తయారు చేసిన ఎన్నో సీసాల మందు ఏదో కారణం వలన పాడైపోయింది.

పాపం! ఆ సంస్థ నిర్వాహకుడు ఎంతో విచారించారు, ఆయన విచారాన్ని గమనించిన ఆ సంస్థ ఉద్యోగి ఒకరు, అయ్యా! మీరు విచారించకండి. మందు పూర్తిగా చెడిపోలేదు కదా? దీనిలో ఇంకా సత్తా ఉండి ఉంటుంది. అదీగాక ఈ సంగతి ఎవరికీ తెలియదు. మందును ఇంకా కొన్నాళ్లల్లో అమ్ముకోవచ్చు. అలా అమ్మకపోతే మనకెంతో నష్టం అని సలహా ఇచ్చాడు.

నిర్వాహకుడు ఆ మాటలు విని మండిపడ్డారు. నష్టం వస్తుందని ప్రజలకు పాడైపోయిన మందు అందిస్తామా? పోతే పోయింది. అటువంటి నీచానికి నేను పాల్పడను అని గట్టిగా చెప్పాడు ఆఉద్యోగి మారు మాట్లాడలేదు. చెడిపోయిన మందుసీసాలన్నీ బయట పారేయబడ్డాయి. నిర్వాహకునిలో నిజాయితీని సంస్థలోని ద్యోగులందరూ శ్లాఘించారు. ఆ వ్యవస్థాపకుడే ప్రసిద్ధ శాస్త్రవేత్తగా పేరు ప్రతిష్టలు సంపాదించాడు. ఆయనే ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

1 Comments

  1. ఇప్పటి కాలంలో డేటు ముగిసిన మెడిసిన్స్ ని ఫ్రీ మెడికల్ క్యాంపు పెట్టి ప్రజలకు అందజేస్తున్నారు పాపాత్ములు

    ReplyDelete

Thank You