తలుపుల మీద బి ఎ బి ఎల్ జిల్లా మునసబు అని వ్రాసిన పిల్లాడెవరో తెలుసా? - megaminds - short stories in telugu


అది 1969వ సంవత్సరం, ఆనాడు ప్రతిచోట మునసబు కోర్టులు ఉండేవి, మునసబు అంటే అందరికీ గౌరవం రాయవరంలో అటువంటి కోర్టు ఒకటి ఉండేది. దానిలో ఒక సిరస్తదారు ఉండేవాడు. ఆయనకు ఒక మనవడు ఉన్నాడు. కోర్టుకు దగ్గరలోనే వాళ్ళ ఇల్లు, తాతకు మనవడు ఫలహారాలు తెచ్చి ఇచ్చేవాడు. ఆ కోర్టు ఆవరణలో తోటి పిల్లలతో ఆడుకొనేవాడు.

ఒక రోజు కోర్టు మూసివేశారు. పిల్లలు ఆటలు మునిగిపోయారు. పెద్దవాళ్లు అయ్యాక ఏమేమి చేస్తారో చెప్పటం ఆనాటి ఆట. అందులో ఒకడు 'డాక్టరు' అవుతానన్నాడు. ఇంకొకడు 'మాష్టరు". ఇంకొకడు 'తహశీల్దార్' ఇట్లా చెప్పారు. ఆ సిరస్తదారు గారి మనవడు ఏమి చెప్పలేదు, ఆటలు ముగిశాక కోర్టు తలుపులు మీద జి.వి. అప్పారావు. బి.ఏ. బి.యల్ జిల్లా మునసబు అని సుద్దతో వ్రాసి వెళ్లిపోయాడు.

మరునాడు దానిని మునసబుగారు చూశారు. ఆ అబ్బాయిని పిలిపించాడు. తలుపు మీద వ్రాసింది ఎవరు? మునసబు గారి అడిగారు. నేనే! అబ్బాయి జవాబు ఎందుకయ్యా! అట్లా వ్రాశావు? పిల్లవాడు నిన్నటి ఆటలన్నీ చెప్పాడు. ఆ మాటలు విని మునసబుగారు సంతోషించారు.

అయితే! గోడమీద వ్రాయకుండా. తలుపుల మీద ఎందుకు వ్రాశావయ్యా? అని నవ్వుతూ అడిగారు. నా జేబులో సుద్దముక్క మాత్రమే ఉన్నది. తెల్లటి గోడమీద తెల్లటి సుద్దతో ఎలా వ్రాస్తాం. అందుకే తలుపు మీద వ్రాశాను. అబ్బాయి భయపడకుండా జవాబు ఇచ్చాడు. మునసబు గారు ఆ అబ్బాయికి మంచి కితాబు ఇచ్చారు. ఆ పిల్లవాడే పెరిగి పెద్దవాడై.. మహాకవిగా.. పేరు పొందాడు. ఆయనే గురజాడ వెంకట అప్పారావు.


ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments