అడుక్కునే ఆమెకోసం అర్ధించి అడిగి ఆమే ఆరోగ్యం బాగుచేసిన దేశభక్తుడెవరో తెలుసా? - megamind - short stories in telugu


లోకంలో రెండు రకాల ప్రజలు ఉన్నారు. అందులో ఒకరు ఉన్నవారు రెండవవారు లేని వారు. అక్కడ ఉన్నవారు అంటే లోక వ్యవహారానికి కావలసిన ధనం ఉన్నవారు. అలాగే లేనివారు ధనం లేనివారు. ధనం లోకాన్ని నడిపిస్తున్నది. అది లేకపోతే మనుగడ కష్టం

ఉన్నవారు లేనివారిని ఆదుకుంటే, లేనివారి కష్టాలు గట్టెక్కుతాయి. దీనినే దీన జనోద్దరణ అంటారు. ఈ సత్యాన్ని తెలియజేస్తుందీ సంఘటన అది ఒక నగరం. వీధిలో వచ్చే పోయే వారితో కోలాహలంగా ఉన్నది. వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన రూపం భారతీయత మూర్తీభవించినట్లు ఉన్నది. నిరాడంబరమైన దుస్తులు తలకు పాగా, మెడచుట్టూ తిప్పి వేసుకున్న పై పంచె. నుదుట కాంతి బొట్టు. ఆయన ఏదో పని మీద వెళుతున్నాడు.

అలా వెళ్తున్న ఆయన దృష్టి రోడ్డు ప్రక్కన ఉన్న ఒక దృశ్యం పైన నిలిచిపోయింది. అంతే ఆయన నడక ఆగిపోయింది. కాళ్లు మళ్లీ కానవచ్చిన దృశ్యంవైపు సాగాయి. రోడ్డు ప్రక్కన ఒక భిక్షుకి ఉన్నది. ఆమె ఏదో వ్యాధి చేత బాధపడుతున్నది. ఆ బాధతో అరుస్తున్నది. వచ్చేపోయేవారు ఆమె అరుపులను లెక్క చేయటం లేదు. ఆయన ఆ భిక్షుకి దగ్గరకు చేరాడు. ఆమె ప్రక్కనే కూర్చున్నాడు. ఆయన అలా కూర్చోవటంతో ప్రజల దృష్టులు అటు వైపు మళ్ళాయి.

అందరూ ఆశ్చర్యంతో ఆయన చుట్టూ చేరారు. ఆయన చేయిచాపి అందర్నీ అర్ధించారు. కొద్ది సేపట్లో లెక్కలేనంత ధనం పోగుపడింది. ఆయన ఆ భిక్షుకిని వైద్యశాలకు చేర్చాడు. తగిన వైద్యం చేయించాడు. మిగిలిపోయిన డబ్బు చాలా ఉంది. అది అంతా ఆ భిక్షుకికే ఇచ్చి వేశాడు. తరువాత ఆయన తన పని మీద వెళ్ళిపోయాడు. అలా దీనజనుల పైన దయను చూపించిన ఆయనే మదన మోహన మాలవ్యా స్వరాజ్య పోరాటం లో పాల్గొన్నాడు. కాశీలో ఆయన గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది ఆయన పేరు ప్రఖ్యాతులను ఇప్పటికీ చాటుతున్నది.


ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments