బంగదర్శన్ సంపాదకుడు ఎవరో తెలుసా? - megamind - short stories in telugu

0

ది 1876 వ సంవత్సరం సెప్టెంబరు నెల బెంగాల్ రాష్ట్రం నుండి బంగదర్శన్ అనే పత్రిక వస్తూ ఉండేది. ఒక రోజు మామూలుగా ఆ పత్రిక సంపాదకుడు ఆఫీసుకు వచ్చాడు. ఆరోజు రచనా కార్యక్రమం ప్రారంభించాలని కూర్చున్నాడు. ఇంతలో ఆ పత్రిక మేనేజరు వచ్చాడు. అయ్యా! పత్రిక లో ఇంకా రెండు పేజీలు అచ్చవ్వాలి. అచ్చు వేయటానికి ఇంకా ఏమి లేదు అని సంపాదకుడిని అడిగాడు.

ప్రస్తుతం నా చేతిలో ఏమి లేదు అన్నాడు సంపాదకుడు. అయితే! పత్రిక కాలంలో రావడం కష్టమే! అన్నాడు నిరాశగా మేనేజరు, అలాగా! అయితే ఓ గంట గడిచాక రా! నీకు కావలసింది తయారవుతుంది అన్నాడు సంపాదకుడు. మేనేజరు వెళ్తూ ఎక్కువగా ఏమి వ్రాయకండి. రెండు పేజీలు సరిపడా ఉంటే చాలు. అని హెచ్చరించాడు, సరే! నని సంపాదకుడు తల ఊపాడు.

మేనేజరు అటు వెళ్లగానే కాగితం. కలం తీసుకున్నాడు. ఆలోచనలో మునిగిపోయాడు. అతని కలం ఆప్రయత్నంగా కాగితం పైన కదిలింది. అనుకున్నట్లుగానే మేనేజరు వచ్చాడు. సంపాదకుడు వ్రాసింది ఇచ్చాడు. ఆది ఒక గీతం. అది చదివిన మేనేజరు ఏమిటండీ! ఇది సగం బెంగాలీ సగం సంస్కృతం. అయినా మహా గొప్పగీతం అని అన్నాడు. దాన్ని గురించి పొగడకు వెళ్లి అచ్చు కూర్చు మొదలు పెట్టు అన్నాడు సంపాదకుడు.

దీని నేమన్నా సరిదిద్దుతారా చూస్తూ ఉంటే నీవు మంచి విమర్శకుడు లా ఉన్నావు. ఈ గీతం గొప్పతనం కొన్నాళ్ల తరువాత చూడు అన్నాడు సంపాదకుడు ఆప్రయత్నంగా, ఆఊహ నిజమైంది. అలాగే ఆ గీతం ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించింది. స్వాతంత్ర్య పోరాటంలో తారకమంత్రంలా పని చేసింది. అదే వందేమాతరం గీతం ఆ సంపాదకుడే బంకించంద్ర ఛటర్జీ.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top