Type Here to Get Search Results !

అధునికత ఎలా ఉండాలి - About Modernization in India in Telugu - MegaMinds


ఆధునికీకరణ అంటే అర్థం పాశ్చాత్యీకరణం కాదు ఆధునికీకరణానికి సులభమైన అర్థం కాలం చెల్లిన వస్తువులను వదలి పెట్టి వేర్వేరు సందర్భాలలో కొత్త సాంకేతికతను వాడటం. అయితే ఇందులో సరైన తర్కం ఉండాలి మరియు మౌళిక సిద్ధాంతం ప్రభావితం కారాదు. పాశ్చాత్యీకరణం అంటే పశ్చిమ దేశాలలో గత 200-250 సంవత్సరాలలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధివల్ల ఉత్పత్తి చాలా పెరిగింది. ఆయా దేశాలు ఏదో ఒక రూపంలో ఆ సాంకేతికతను ప్రపంచమంతటా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి వద్ద తగినంత ప్రచార సాధనాలు మరియు ప్రచార సామాగ్రి ఉంది. మన వస్తువులలో సుఖంగా ఉందని మనం భావిస్తే, వారి వస్తువులకు అమ్మకాలుండవు. వారికి అనుభవించడంలోనే సుఖం కలుగుతుంది, త్యాగంలో కాదు.
పాశ్చాత్య దేశాలు తమ వలనే మిగతా ప్రపంచం అంతా నాగరికతకు‌ నోచుకుంది అనే భ్రమను కలుగజేస్తూ వారి వస్తువులను ఆయా దేశాలపై భారం వేయడమనే కుట్రలో భాగం. పాశ్చాత్య వినియోగవాద దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు మనస్సులను మార్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాయి. Not mass production but production by masses కేవలం అధిక ఉత్పత్తి కావాలనుకోవడం కాలేదు, అధిక జనాభా ఉత్పాదక కార్యంలో పాలుపంచుకోవాలి అన్నారు గాంధీజీ. అంతేకాదు 'యంత్రాలొచ్చి, కష్టంలోని కఠినత్వాన్ని తొలగితే కార్మికుల కడుపునింపే రొట్టెను లాక్కోరాదు' అనికూడా అన్నారాయన.
భారతీయ ఉమ్మడి కుటుంబంలో 'నాకు కాదు నీకే' అనే భావన, పాశ్చాత్య దేశాలలో కుటుంబం వ్యక్తిగతమైంది. (Individualistic). వాళ్ళు స్త్రీని భోగవస్తువుగా చూడటం, వృద్ధులను వృద్ధాశ్రమాలలో చేర్చడం, వారి ఉపయోగాన్ని ప్రశ్నించడం లాంటివి అంధానుకరణం ప్రమాదకరం, అది మన దేశంలో కూడా చొప్పించారు. హిందూ దర్శనం దేశ - కాల పరిస్థితుల కనుగుణంగా మౌళిక సిద్ధాంతాలను సురక్షితంగా ఉంచుతూ నిరంతరం కొత్తదనాన్ని స్వీకరిస్తూ ఉండే ప్రయత్నం చేస్తుంది. నేడు కూడా పశ్చిమదేశాల ఆలోచనలను స్వీకరించడానికి ఇలాంటి మనస్తత్వమే కారణం.
భారతీయులు తీసుకోవలసిన ఉదాహరణలు, జాగ్రత్తలు: ప్రతి కొత్తదాన్ని దాని గుణదోషాల ఆధారంగా స్వీకరించాలి. దూరదర్శినిలో రామాయణ ప్రసారం పరికరం ఆధునికంగా ఉంది కార్యక్రమం భారతీయులది, వయోలిన్ పరికరం ఆధునికం సంగీతం భారతీయులది, వారణాసి రైల్వేస్టేషన్ ఆధునికం శిల్పకళ ప్రాచీనం. మానవుడు ఉపయోగించే కళ్ళ జోడు ఒక ఉదాహరణగా తీసుకుందాం. చాల ఏళ్ళ క్రితం వరకు ధరించే కళ్ళజోడుకి ఉన్న అద్దాల చుట్టూ ఉన్న ఫ్రేము మందంగా ఉండేది. మరి ఆధునికంగా అసలు ఫ్రేమ్ లేకుండా,  సన్నని ఫ్రేమ్ తో నేడు ఉపయోగిస్తున్నాం కదా! కళ్ళజోడు ఉపయోగిస్తున్నా, కొత్త మోడల్స్ తో మనం ఉపయోగించటమే ఆధునికత. కళ్ళజోడు లో ఉండే అద్దాలు మారవు అలాగే సంస్కృతిలో మౌలిక విషయాలు మారకుండా ఆధునికతకి స్థానం కల్పించుకోవటంలో దోషం లేదు.
స్వాభిమానం సురక్షితంగా ఉండాలి. యాంత్రీకరణ మరియు భౌతిక సుఖం కలగలిస్తే తద్వారా కలిగే దుష్పరిణామాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జపాన్ దేశంలో ఇంట్లోకి ప్రవేశించగానే ఇల్లు జపనీయులదనిపిస్తుంది కానీ అత్యాధునికంగా ఉంటుంది. సంప్రదాయబద్దంగా ఉంటుంది. పాశ్చాత్య సంస్కృతి వెంట పరుగులు తీస్తున్నారు అక్కడక్కడా, ఆధునికంగా ఉంటూ కూడా భారతీయతను కాపాడుకోవాలి. ఆధునికత మరియు భారతీయత అనేవి పరస్పర వ్యతిరేకతలు కావు, పూరకాలు.
ఆధునికత అంటే ఆహార పద్ధతులు, వస్త్రధారణలో పశ్చిమ దేశాలకు కాపీ (నకలు) అని కాదు. మూఢనమ్మకాలను వదలిపెట్టి దేశం మరియు సమాజానికి ఏది మంచిదో మంచి మనస్సుతో ఆలోచించడమే ఆధునికీకరణ. మన జీవనపద్ధతికి అనుగుణంగా Modernisation but not Westernization. మీకందరికీ‌ అర్దమయ్యింది అని ఆశిస్తున్నాము. పాశ్చాత్యమోజులో పడి మనదైన‌ సంస్కృతి ని నాశనం చేసుకోవద్దు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.