నీల్ సిటీ హైస్కూల్లో సాహసం చేసి పిల్లలచేత వందేమాతరం అని అనిపించింది ఎవరు? - MegaMinds - Nationalism in Telugu

0

నాగపూరులో నీల్ సిటీ హైస్కూలు అనే పాఠశాల ఉండేది, ఆనాడు ఆంగ్లేయుల చేతుల్లో పాఠశాలలన్నీ ఉండేవి. ప్రజలలో జాతీయ భావాలు వృద్ధి పొందుతున్న రోజులవి. ఆ భావాలు విద్యార్థుల్లో కూడా వ్యాపించసాగాయి. వందేమాతరం ఉద్యమం బెంగాల్లో ప్రారంభించబడింది. ఎక్కడ బడితే అక్కడ వందేమాతరం ధ్వనులు వినిపిస్తూ ఉండేవి.

విద్యార్థుల్లోని దేశభక్తి భావాలు అణచి వేయాలని ఆంగ్లేయులు కంకణం కట్టుకున్నారు. ఈ విషయమై పరిశీలనలు జరపటానికి ఆంగ్లేయ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్ళేవారు, అలాగే నీట్ సిటీ హైస్కూలుకు కూడా విద్యాధికారి వస్తున్నాడని కబురు వచ్చింది. ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పారు. అధికారి వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలో చెప్పారు.

ఆ పాఠశాల పవ తరగతిలో ఒక విద్యార్థి ఉండేవాడు. అతడు ఉత్తమ దేశభక్తి కలవాడు. విద్యాధికారి వచ్చినప్పుడు ఎలా ఆహ్వానించాలో నిర్ణయించుకున్నాడు. ఆ సంగతి తన స్నేహితులతో చెప్పాడు. అందుకోసం ఒక పథకం సిద్ధం చేశాడు, ఎదురు చూస్తున్నట్లుగానే విద్యాధికారి పాఠశాలకు వచ్చాడు. ఒక్కొక్క తరగతి గదిని పరిశీలిస్తూ రాసాగాడు. అలాగే పదవ తరగతి గదికి వచ్చాడు. విద్యార్థులంతా ఒక్కసారిగా వందేమాతరం అని నినాదం చేశారు, విద్యాధికారి నిప్పులు తొక్కిన కోతి అయ్యాడు. కోపం గా ఇంకో గదికి వెళ్లాడు. అక్కడా విద్యార్థులు అదే నినాదం చేశారు.

ఆంగ్లేయ అధికారి ఎదుట ప్రభుత్వ ఆజ్ఞకు దిక్కారం జరిగింది. అదీ చిన్నపిల్లలు చేశారు. ఆంగ్లేయుల దృష్టిలో అది ఒక మహాపరాధం, ఆ అధికారి చిన్నబోయిన ముఖంతో పాఠశాల విడిచి పెట్టి వెళ్లాడు, సాహసం చేసి పిల్లలచేత వందేమాతరం అని అనిపించింది ఎవరు? అని స్కూలు వారు విచారణ చేశారు. పదవతరగతి విద్యార్థి అని తేలింది. దానికి శిక్షగావిద్యార్థిని పాఠశాల నుండి వెళ్లగొట్టారు, చిన్ననాడే అంతటి సాహసాన్ని చూపిన ఆ విద్యార్థే కేశవరావ్ బలిరాం హెడ్గేవార్, పెద్దయ్యాక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థను స్థాపించాడు.


ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top