Page Nav

HIDE

Classic Header

{fbt_classic_header}

Top Ad

Popular Posts

Latest Posts

latest

చరిత్ర చెప్పని పాఠం ఇకనైనా మేల్కొందాం - what should we learn from history

సద్గుణవికృతుల కొనసాగింపేనా?? నడుస్తున్న చరిత్ర మొదటి గా రెండు పదాల అర్దము తెలుసుకుందాం..  సద్గుణ వికృతి - అతి మంచితనం. ...

సద్గుణవికృతుల కొనసాగింపేనా?? నడుస్తున్న చరిత్ర
మొదటి గా రెండు పదాల అర్దము తెలుసుకుందాం.. 
సద్గుణ వికృతి - అతి మంచితనం.
సజ్జన సద్గుణం - మంచి కి మంచి చెడుకి చెడు. 

 ఇక కథలోకి వెళదాం AIM For SEVA వ్యవస్థాపకులు స్వామి దయానంద సరస్వతి స్వామీజీ మన దేశంలో పరిస్థితిని వివరిస్తూ ఓ సంఘటన చెప్తుండేవారు.దీని నుండి మనం చాల నేర్చుకోవచ్చు. "నేను ఋషికేశ్ లో కూర్చున్నప్పుడు ఒక ఫాదర్, ఒక మౌల్వీ వచ్చారు. వారిని ఆహ్వానించి గౌరవంగా ఆసీనులు కమ్మన్నాను. తర్వాత వారిరువురు నాతో వాదన పెట్టుకోవాలని ప్రయత్నించారు. కానీ నేను వాదించలేదు. వారు నాతో తగాదా పెట్టుకున్నారు. వారు నన్ను కొట్టడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న ఒక రక్షకభటునితో "నేను అహింసావాదిని... నన్ను దయచేసి కాపాడమని వేడుకున్నాను. అతనేమో- ఇది ఏదో ఆధ్యాత్మికుల మధ్య తగాదా, నేను సెక్యులర్ ని, నేను దీంట్లో తలదూర్చను" అన్నాడు. పోలీసులా స్పందించలేదు.     
            నేను అహింసావాదినే అయినా నన్ను నేను రక్షించుకోవాలి. నేను దీనుడ్ని కాదు, నాలో బలం ఉంది. కాబట్టి నన్ను నేను రక్షించుకోవటానికి నేను ప్రతి దాడి చేసాను.
       ఇప్పుడు రక్షక భటులు నన్ను ఆపి 'వారు మైనార్టీలు, వారిపై ఎందుకు దాడి చేస్తున్నావు? వారిని మనం రక్షించాలి' అన్నారు.- ఇది మన దేశంలో పరిస్థితి." అని స్వామీజీ చాల సందర్భాల్లో చెప్పేవారు.
పై సంఘటన లో వరుసగా మనం 3 విషయాలు గమనించవచ్చు.
1.సద్గుణ వికృతి: దేశకాలస్థాన పరిస్థితుల విచక్షణ లేకుండా,  సద్గుణాలని ఆచరణలో పెట్టడమే సద్గుణ వికృతి. దీనికి తార్కాణమే-స్వామీజీ అహింస అనే సద్గుణంతో ఇతరుల దౌర్జన్యాన్ని నిలువరించకపోవటం..
2.సజ్జన సద్గుణం: మన మతం/ధర్మం/దేశం పట్ల సహనం గల పరాయివాళ్ళనీ సహనంతో చూడటం, మన మతం/ధర్మం/ దేశం పట్ల అసహనం గల వాళ్లకి తగిన రీతిలో బుద్ధిచెప్పటం- సజ్జన సద్గుణం. దీనికి తార్కాణమే- స్వామీజీ తనపై అకారణంగా దాడిచేసిన వారిపై ప్రతి దాడి చేయటం...
3.కుహనాసెక్యులరిజం: అన్ని మతాల్ని సమానంగా కాకుండా, మైనార్టీ నెపంతో ముస్లిం-క్రైస్తవుల కొమ్ముకాయటం, బుజ్జగించటం, హిందూధర్మానికి న్యాయం చేయకపోవటం కుహనా సెక్యులరిజం. దీనికి తార్కాణమే స్వామీజీ పై దాడి చేసినపుడు స్పందించని పోలీసులు, స్వామీజీ ప్రతిదాడికి దిగగానే మైనార్టీల రక్షణకై రంగంలోకి దిగటం....

సద్గుణ వికృతి వల్ల కలిగే దుష్పరిణామాలు
   ప్రధానంగా ఇక్కడ సద్గుణ వికృతి అనే దుర్గుణం వల్ల భారత దేశ సార్వభౌమత్వానికి,దేశ అఖండతకి, దేశ సమగ్రత కి కల్గిన నష్టాల్ని, దుష్పరిణామాల్ని తెలుసుకుందాం. అహింస,శరణాగత రక్షణ,శత్రువు మీద దయ, పరమత సహనం, తన ప్రాణం తీయటానికి వచ్చిన శత్రువుల్ని కూడా క్షమించి వదిలిపెట్టటం మొదలైన సద్గుణాలని పరిస్థితులకి విరుద్ధంగా ఆచరణలో పెట్టటమే సద్గుణవికృతి.  
       దేశకాలపాత్ర విచక్షణాజ్ఞానం లేక వీటినే సద్గుణాలని, ధర్మమని భావించి ఆచరణలో పెట్టేవాళ్ళు వ్యక్తిగతంగాను, జాతిగాను నాశనం కాక తప్పదు అని హెచ్చరించిన స్వాతంత్ర్య వీర సావర్కర్ మాటలు గుర్తు చేసుకోవాలి. అలాంటివి సద్గుణాలే కావు, అవి సద్గుణవికృతులు- అవి కుళ్ళిపోయిన పదార్థంలాంటివి. పాచిపోయిన అన్నంలో విషక్రిములు చేరి, తిన్నవాళ్ళకి హాని చేసినట్లే ఈ సద్గుణవికృతులు కూడా సమాజానికి పూడ్చలేని నష్టం కల్గించాయని సావర్కర్ మహనీయుడు తన "భారతదేశ చరిత్రలో ఆరు స్వర్ణ పత్రములు" గ్రంథంలో ఐదవ స్వర్ణపత్రంలో 152 - 168 పుటల్లో సోదాహరణంగా విశ్లేషించారు.

మచ్చుకు కొన్ని అవలోకిద్దాం...
1.క్రీ.పూ-273 నుండి 232 వరకు పాలించిన అశోక చక్రవర్తి బౌద్ధధర్మం అనుసరించి,శస్త్ర శక్తిలేని దుర్భల స్థితిని సమాజంలో వ్యాపింపజేశారు. క్షత్రియధర్మం,రాజ్యరక్షణ, సైన్య శక్తి ఇవన్నీ మహాపాపంగా భావించి, "అహింస"యే పరమధర్మం అని బోధించి జాతిపౌరుషవృత్తిని క్షీణింపజేశాడు. ఫలితంగా అశోకుని మరణానంతరం గ్రీకులు తిరిగి దండయాత్రలు చేసారు.
2.మహ్మద్ గజనీ మొదటిసారి సోమనాథ మందిరం నాశనం చేసిన తర్వాత హిందువులు ఆ రాజ్యాన్ని తిరిగి జయించి ఆలయాన్ని పునరుద్ధరించారు. అరేబియా వ్యాపారుల ఓడలు ఆ మందిరం ఉన్న తీరంలోనే విశ్రాంతికి ఆగేవి. దేశరక్షణ దృష్ట్యా అది శ్రేయస్కరం కాదు. అయినా అప్పటి రాజు పట్టించుకోకుండా తన పరమత సహన ఉదారతను ప్రకటించాడు. ఫలితం కొద్దిరోజుల్లోనే ముస్లింల కపటనీతితో రాజు నుండి అనుమతి పొంది సోమనాథ మందిర ముందుభాగంలోనే మసీదు నిర్మించారు. ఈ పరమత సహన పాపానికి ఫలితంగా వేలాది మంది హిందువులు ఊచకోతకి, వేలాది హిందూస్త్రీలు మానభంగానికి గురయ్యారనేది సద్గుణవికృతికి తిరుగులేని సాక్ష్యం.
3.మహ్మద్ ఘోరీ 1191 లో దాడి చేసినపుడు పృథ్వీరాజ్ చౌహాన్ పరాక్రమ బలం వల్ల పరాజయం పొందాడు. శరణాగతునికి ప్రాణభిక్ష అనే సద్గుణ వికృతి వల్ల వరుసగా 16 సార్లు ఓడిపోయిన ఘోరీ ని పృథ్వీరాజ్ విడిచిపెట్టాడు. కాని కృతజ్ఞుడయిన రాక్షస ఘోరి భారీ సైన్యంతో పృథ్వీరాజ్ పై దండయాత్ర చేసి కళ్ళు పెరికించి బంధించాడు.
4.గుజరాత్ లోని అన్హల్ వాడ ప్రాంతానికి చెందిన హిందూరాజు సిద్ధరాజ్ న్యాయపాలకుడు, పరాక్రమవంతుడు. రాజ్యంలో హిందూ-ముస్లింలకి జరిగిన యుద్ధంలో ముస్లింలు ఓటమి పాలయ్యారు. మసీదులు కూలగొట్టబడ్డాయి. న్యాయబద్ధత, ఉదారత అను సద్గుణ వికృతులు మెండుగానున్న రాజు హిందువులకి కఠిన శిక్షలు వేసి, ముస్లింలకి లక్ష బంగారు నాణాలు సమర్పించి మసీదులు పునరుద్ధరించాడు. 
5. వందల సంవత్సరాలుగా హిందూస్త్రీల అపహరణ, మానభంగాలుజరుగుతున్నా హిందూసమాజం ప్రతిఘటన ఏనాడూ చేయకపోవటం అటుంచి, హిందూ రాజులు శత్రు స్త్రీలని గౌరవంగా ఆదరించినప్పటికీ ముస్లింల అత్యాచార పరంపర మాత్రం ఆగలేదు. స్త్రీ పూజనీయురాలు అన్న సద్గుణవికృతికి ఇది నిదర్శనం.
6. కాఫిర్ల(హిందూ)ధర్మాన్ని నాశనం చేయటమే, తమ ధర్మంగా భావించి గత వేల ఏండ్లుగా మన దేశంలో ముస్లింలు ఆ పనిని చేస్తున్నపుడు వాళ్ళ పట్ల సహనం చూపటం సద్గుణ వికృతికి పరాకాష్ఠ.
              అహింస, దయ, శరణాగత వాత్సల్యం, శత్రుస్త్రీల మాన సంరక్షణ, పరమత సహనం వంటి మంచి గుణాలని సమయం, సందర్భాన్ని బట్టి వ్యవహరించకుండా గుడ్డిగా ఆచరించే సమాజం అధోగతిపాలు అవక తప్పదని చరిత్ర చెబుతున్న అక్షర సత్యం. ఇలాంటి సద్గుణ వికృతి ఆధునిక కాలంలో ఇంకా కొనసాగుతుండటం నడుస్తున్న చరిత్ర. దీనికి పరిష్కారం- రాబోయే చరిత్ర. - సామల కిరణ్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..