Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారతదేశ చరిత్ర అంటేనే వీరుల చరిత్ర - Real Indian History - MegaMinds

చరిత్ర ఒక జాతికి గతం నుండి స్ఫూర్తి కలిగించే విధంగా, జరిగిన పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చే విధంగా ఉండాలి. అయితే మనలను మనమే...


చరిత్ర ఒక జాతికి గతం నుండి స్ఫూర్తి కలిగించే విధంగా, జరిగిన పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చే విధంగా ఉండాలి. అయితే మనలను మనమే అవహేళన చేసుకొనే విధంగా నేడు మన చరిత్ర పాఠాలు కొనసాగుతున్నాయి. భారత దేశం ఒక ధర్మ సత్రం అని, ఒకొక్క సారి ఒకొక్క విదేశీయుడు దండయాత్ర చేసి ఆక్రమించుకున్నారని అంటూ విదేశీ పాలకుల గురించే మన చరిత్రలో ఎక్కువగా చెబుతున్నారు.
ప్రపంచంలో నాగరికత ప్రారంభం కాని రోజుల లోనే భారత్‌లో విశాలమైన సామ్రాజ్యాలు ఉండేవని, ఆదర్శవంతమైన పరిపాలన సాగుతూ ఉండేదని, ఎంతో లోతైన తాత్విక ఆలోచనలు సాగాయని, శాస్త్ర, సాంకేతిక రంగాలలో విశేషమైన ప్రగతి సాధించామని మన ప్రజలు తెలుసుకోకుండా- చరిత్రను ఒక విధంగా విదేశీ పాల కులు కట్టడి చేశారు. 
ఈ కుట్రకు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వామపక్ష, కాంగ్రెస్ మేధావులు సహితం వంతపాడుతూ వస్తున్నారు. మొగలాయిలు, బ్రిటిష్ వారు వచ్చే వరకు భారత దేశంలో విశాలమైన సామ్రాజ్యాలు అంటూ లేవని, వారే భారత్ కు ఒక రాజకీయ స్వరూపం కల్పించారని, అప్పటి వరకు చిన్న చిన్న చిల్లర రాజ్యాలతో అస్తవ్యస్తంగా దేశం ఉండేదన్న అభిప్రాయాలను మన చరిత్ర పాఠాలు వెల్లడి చేస్తున్నాయి.
బ్రిటిష్ వారు మన దేశానికి రావడానికి వేయి సంవత్సరాలకు ముందే, 1957 నాటి ప్రథమ స్వాతంత్య్ర సమరానికి 1200 ఏళ్ళ ముందే ఒక గుజరాత్ రాజు సారథ్యంలో కశ్మీర్ నుండి కర్ణాటక వరకు భారత రాజులంతా కలసి ఉమ్మడిగా విదేశీ ఆక్రమణదారులపై పోరాటం జరిపారని, ఆ పోరాటం ఫలితంగా ఆ తర్వాత 300 ఏళ్ళ వరకు మన దేశంపై దండయాత్ర జరపడానికి మరెవ్వరు సాహసింపలేదని ఎంతమందికి తెలుసు?
అరబ్ నుండి మొహమ్మద్ బిన్ ఖాసిం 712లో రాజాదహిర్‌ను ఓడించి మనదేశంలో సామ్రాజ్యం ఏర్పర్చడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అతని కుమారుడు జునైద్ మర్రి తమిన్‌తో ఉజ్జయినిని ఆక్రమించుకోవడం కోసం గుజరాత్ మీదుగా ప్రయాణం సాగించాడు. రాగల ప్రమాదాన్ని గ్రహించిన గుజరాత్‌లోని అవంతీపుర్ రాజు నాగాభట్ట్-1 దేశంలోని రాజులందరినీ ఒకతాటిపైకి తీసుకు వచ్చి వీరోచిత పోరాటం జరిపారు. జునైద్‌ను 738లో స్వయంగా నావసారి వద్ద జరిగిన యుద్ధంలో నాగాభట్ట్-1 చంపివేశారు. తీవ్రంగా గాయపడిన జునైద్ ప్రాణ భయంతో తన అనుచరులతో కలసి దేశ సరిహద్దులను దాటి పారిపోయాడు. 
ఆ తర్వాత 1001లో మహమూద్ గజనీ దండయాత్ర చేసే వరకు భారత్‌వైపు మరెవ్వరూ కన్నెత్తి చూడలేక పోయారు. ఉజ్జయనిని ఆక్ర మించుకోకుండా అడ్డుకున్న నాగాభట్ట్-1 నిజానికి ఇస్లాంకు అతిపెద్ద శత్రువు... అంటూ అరేబియా చరిత్రకారుడు సులేయమన్ వ్యాఖ్యానించాడు. 70 సంవత్సరాల వ్యవధిలోనే తూర్పు ఆసియ, ఉత్తర ఆఫ్రికా వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన ఈ రాజు గురించి మన చరిత్ర గ్రంథాలలో ఎక్కడైనా కనిపిస్తుందా?
1957కు 300 ఏళ్లకు ముందే అత్యాధునిక సైన్యం గల పోర్చుగీస్ వారిని మంగళూరుకు సమీపంలో నిఉల్లాల్ అనే చిన్న సామ్రాజ్యం గల 30 ఏళ్ళ యువతి రాణి అబ్బక్క చౌతా వీరోచితంగా పోరాడి ముచ్చెమటలు పట్టించడం మన చరిత్ర గ్రంథాలలో ఎక్కడైనా కనిపిస్తుందా? అతికొద్దిమంది మద్దతుదారులతో వారి విస్తారమైన సైన్యాన్ని ఎదిరించి, వారి జనరల్‌నే ఆమె చంపివేసింది. స్వయంగా జైన్ అయిన ఆమె హిందూ, ముస్లింలతో కూడిన సైన్యంతో మంగళూరు ఓడరేవు నుండి పోర్చుగీస్ వారిని తరిమి కొట్టి ఆక్ర మించుకున్నారు. వారికి చుక్కలు చూపించారు. 
అయితే చివరకు ఆమె భర్తను లోబరచుకొని, అతని ద్వారా ఆమెను పట్టుకున్నా ఆమె జైలులో సహితం ఆమె తిరుగుబాటు చేశారు. తప్పించుకోబోతూ మృతి చెందారు. అంతటి వీర వనితలు మన చరిత్ర గుర్తు పెట్టుకోదా? పోర్చుగీసులకు వ్యతిరేకంగా పోరాడిన మత్స్యకారుల గురించి చాలామందికి తెలియదు. పైగా, దక్షిణ భారత చరిత్రను చోళులు, విజయనగర సామ్రాజ్యాలకే పరి మితం చేశారు. అదికూడా పాఠ్యగ్రంథాలలో సగం పేజీకి పరిమితం చేశారు. 
1857లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా స్వదేశీ రాజులు జరిపిన మూకుమ్మడి పోరాటాన్ని ప్రథమ స్వతంత్ర పోరాటం... అని ఆ తర్వాత ఎప్పటికో వీర సావర్కర్ అభివర్ణించేవరకు సిపాయిల తిరుగుబాటుగా మాత్రమే భావిస్తూ వచ్చాము. చరిత్ర కేవలం గతిని మార్చిన వారినే గుర్తు పెట్టుకొంటుంది. అటువంటి సంఘటనలను భద్రపరుస్తూ చరిత్రను తిరిగి రాయడం నేడు భారతీయ చరిత్రకారుల బాధ్యత అని గుర్తెరగాలి. గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పలు పరిశోధనలు, అధ్యయనాలు ఇప్పటి వరకు మన చరిత్రకారులకుఅందని అనేక నూతన అంశాలను వెలుగులోకి తెస్తున్నాయి. దాంతో భారతీయ దృష్టి కోణంతో చరిత్రను తిరిగి వ్రాయవలసి పరిస్థితులు స్పష్టం అవుతున్నాయి.
చరిత్ర రచనలో భారత్ వెనుకబడి ఉన్నదని ప్రముఖ గ్రీక్ చరిత్రకారుడు హీరోడోటస్ చెప్పారు. నేడు మనం సరిగ్గా గమనిస్తే, స్వతంత్ర ఉద్యమం మహాత్మా గాంధీతోనే ప్రారంభమైన్నట్లు అనిపిస్తుంది. భారతీయ చరిత్రలో మూడు అంశాలు ఉన్నాయి - ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్ర. మధ్యయుగ చరిత్ర మొహెంజొదారో నుండే భారతీయ నాగరికత ప్రారంభమైన్నట్లు మాట్లాడుతుంది. ఉపనిషత్‌లు, వేదాలు, శ్రీరాముడు, రామాయణ, మహాభారత కాలం వంటివన్నీ కూడా అంతకు ముందువే. 
వేదాల కాలం నాటి చరిత్రను తిరిగి గుర్తించే ప్రయత్నం ఎందుకు జరగడం లేదు? మొహెంజదారో ఎందుకు చరిత్రకు ప్రారంభ సమయం అవుతుంది? ఈ ప్రారంభ సమయాన్ని పాశ్చాత్య చరిత్రకారులు సృష్టించారు. ఆర్యులు పశ్చిమ ప్రాంతం నుండి వచ్చారనే అభిప్రాయాన్ని వ్యాప్తి చేశారు. ఉపనిషత్‌లు ఏ విధంగా ఆవిర్భవించాయి? వేదాలు ఎక్కడి నుండి వచ్చాయి? వీటన్నింటి గురించి చెప్పవలసి ఉంది.
సమస్య ఏమిటంటే భారతీయులకు చరిత్రను గ్రంథస్థం చేయడం పట్ల నమ్మకం లేదు. ఒకరి నుండి మరొకరి వద్దకు నోటి మాటగా చరిత్ర వ్యాపించింది. అన్ని కథనాలొ ఈ విధంగానే వ్యాప్తిలోకి వచ్చాయి. అయితే గాలిలో నుండి ఎవరూ కథలను సృష్టించలేరని గుర్తించాలి. చివరకు కల్పనలు సహితం కొన్ని సంఘ టనల నుండి ఆవిర్భవిస్తాయి. ప్రాచీన చరిత్రలో రేఖాగణితం (జామెటరీ), బీజగణితం, జీవశాస్త్రం, శస్తచ్రికిత్సలలో మన ఋషులు సాధించిన విజయాలను ప్రస్తావించడం లేదు. అటువంటి అంశాలు పాఠ్య గ్రంథాలలో ఉండవలసిందే. వ్యక్తుల గురించి గ్రంథాలు ఉన్నప్పటికీ ప్రతివారూ చదవరు. వాటిని పాఠ్యగ్రంథాలుగా మలచితే ప్రతివారి మెదడులోకి చరిత్ర ప్రవేశిస్తుంది.
పైగా మనకు అశోకుడు, చంద్రగుప్తుడు గురించి మాత్రమే తెలుసు. ఇతర రాజుల గురించి మనకు తెలియదు. తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో నెలకొన్న ఇతర రాజుల గురించి కూడా తెలుసుకోవలసి ఉంది. హిందూ దేశంగా కొనసాగిన కశ్మీర్ చరిత్ర గురించి ఏమీ లేదు. కాశ్మీర్ రాష్ట్ర వాస్తవాల గురించి మన విద్యార్థులు తెలుసుకోగలిగితే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ప్రాచీన కశ్మీర్ సాహిత్యం ఎంతో అందుబాటులో ఉంది. చరిత్రను తిరిగి వ్రాయడానికి దానిని ఉపయోగించుకోవాలి. ఆధునిక చరిత్రలో మొత్తం స్వతంత్ర ఉద్యమాన్ని ప్రస్తావించడం లేదు. స్వతంత్ర పోరాటం గురించి వ్రాస్తున్నప్పుడు మొత్తం పోరాట యోధులను ప్రస్తావిం చవలసి ఉంది. 
వీర్ సావర్కర్ గురించి మాట్లాడుతుంటే ఎక్కువగా ఆయన బ్రిటిష్ వారికి రాసిన క్షమాపణ లేఖనే ప్రస్తావిస్తున్నారు. ఆయన బ్రిటిష్ వారి ముందు సాగిల పడ్డారని, ఆయనకు స్వతంత్ర ఉద్యమం పట్ల ఆసక్తి లేదని కొందరు వింతగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే సావర్కర్ జైలులో ఉండటం కన్నా బైట ఉండటమే అవసరమని అప్పట్లో భావించారని గుర్తించే ప్రయత్నం చేయడం లేదు. చరిత్రలో జరిగిన సంఘటనలను విద్యార్థులు తెలుసుకొని, తామే ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం కల్పించాలి. 
భారత దేశంలో చరిత్ర చాలావరకు వలస పాలనలో బ్రిటిష్ వారి విధానాల గురించే ఉంటున్నది. బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలలో పాఠ్యగ్రంథాలలో కమ్యూనిస్ట్ దృష్టి కోణం నుండి చరిత్రను చూపే ప్రయత్నం జరుగుతున్నది. భారత దేశంలోని చరిత్ర గ్రంథాలు ఇస్లాం కాలానికి ముందు- దేశంలో ఆధిపత్యం వహించిన హిందూ చరిత్రను విస్మరిస్తున్నాయని ప్రతిష్టాకరమైన పద్మభూషణ్ పురస్కా రం పొందిన డా. డేవిడ్ ఫ్రేలెయ్ పేర్కొన్నారు. -చలసాని నరేంద్ర.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. What is BJp govt doing? Enjoying power....

    ReplyDelete