ప్రతిహర నాగబట్టు - Pratihara Nagabhatt in Telugu - MegaMinds


అరబ్ నుండి మొహమ్మద్ బిన్ ఖాసిం 712లో రాజాదహిర్‌ను ఓడించి మనదేశంలో సామ్రాజ్యం ఏర్పర్చడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అతని కుమారుడు జునైద్ మర్రి తమిన్‌తో ఉజ్జయినిని ఆక్రమించుకోవడం కోసం గుజరాత్ మీదుగా ప్రయాణం సాగించాడు. రాగల ప్రమాదాన్ని గ్రహించిన గుజరాత్‌లోని అవంతీపుర్ రాజు నాగాభట్ట్ దేశంలోని రాజులందరినీ ఒకతాటిపైకి తీసుకు వచ్చి వీరోచిత పోరాటం జరిపారు. హమీద్ ను 738లో స్వయంగా నావసారి వద్ద జరిగిన యుద్ధంలో నాగాభట్ట్ చంపివేశారు. తీవ్రంగా గాయపడిన జునైద్ ప్రాణ భయంతో తన అనుచరులతో కలసి దేశ సరిహద్దులను దాటి పారిపోయాడు.

ఆ తర్వాత 1001లో మహమూద్ గజనీ దండయాత్ర చేసే వరకు భారత్‌వైపు మరెవ్వరూ కన్నెత్తి చూడలేక పోయారు. ఉజ్జయనిని ఆక్రమించుకోకుండా అడ్డుకున్న నాగాభట్ట్ నిజానికి ఇస్లాంకు అతిపెద్ద శత్రువు అంటూ అరేబియా చరిత్రకారుడు సులేయమన్ వ్యాఖ్యానించాడు. 70 సంవత్సరాల వ్యవధిలోనే తూర్పు ఆసియ, ఉత్తర ఆఫ్రికా వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన ఈ రాజు గురించి మన చరిత్ర గ్రంథాలలో ఎక్కడైనా కనిపిస్తుందా?

నాగబట్టు గురించి తెలుసుకుందాం:
ఖలీఫా హిశమ్ (724-743) తన సేనాపతి జునైద్ అనే వాడిని సింధు ప్రాంతంలో రాజప్రతినిధిగా నియమించాడు. అతడు జలమార్గంలో దేవళ్ చేరుకున్నాడు. సముద్ర తీరప్రాంతంలోని కొద్ది భూభాగం మాత్రమే ఖలీఫా ఏలుబడిలో ఉండేది దేవళదుర్గం- రాఓర్ మున్నగు అనేక ప్రాంతాలు అరబ్బులనుండి విముక్తమై స్వతంత్రాన్ని ప్రకటించుకున్నవి. అరబ్బు సేనాపతి జునైద్ మళ్లీ సింధు ప్రాంతాన్ని జయించుటకు సంకల్పించాడు. ఒకసారి గెలుచుకున్న ప్రాంతాలు చేజారిపోవడం వారికి హృదయశల్యంగా ఉంది. జునైద్ భారీసైన్యంతో దేవళ దుర్గంపై దాడి చేశారు దాహిర్ రాకుమారుడు జయసింహుడు దుర్గ సంరక్షణకు రాజర్ నుండి తరలి వచ్చేలోగానే కొద్దిపాటి సైన్యం సంరక్షణలో నున్న దేవళ దుర్గం జునైద్ వశమైంది
జయసింహుడు దుర్గాన్ని సంరక్షించుటకు భీషణమైన యుద్ధం చేశాడు. విశాల అరబ్బు సైన్యాలతో రోజుల తరబడి యుద్ధం సాగించి వీరగతి అలంకరించాడు జయసింహుని మరణంతో జునైద్ కు ఎదురులేకపోయింది.

రాజా దాహిర్-జయసింహుని వంటి సమం వీరుల నాయకత్వం లేని కారణంగా మళ్లీ సింధు-కశ్మీర్-కన్నౌజ్ ప్రాం కూడా అరబ్బుల వశమైనవి. జునైద్ విజయగర్వంతో రాజస్థాన్-గుజరాత్-మాళ్వా ప్రాంతాలను జయించే యోజన చేశాడు. మాళ్వాపైకి అరబ్బు సేనలు వెడలినపుడు అక్కడి ప్రతిహార వంశీకులైన వీరుల పాలన సాగుతున్నది. అరబ్బు సైన్యాలు ప్రతీహారుల చేతిలో చావుదెబ్బ తిని సింధు ప్రాంతానికి పారిపోయినవి.

ప్రతిహార నాగభట్టు నాయకత్వం :
అరబ్బు రాజప్రతినిధి జునైద్ పెద్ద సేనను హమీద్ నాయకత్వంలో మాళ్వా ప్రాంత ఆక్రమణకు పంపినాడు. అపుడు మాళ్వా ప్రాంతాన్ని ప్రతీహార వంశపురాజులు పరిపాలిస్తున్నారు. ప్రతీహార నాగభట్టు ముస్లిం దురాక్రమణలను తరిమికొట్టుటకు చిన్న చిన్న రాజులందరినీ ఏకత్రితం చేశాడు. అప్పటికే జునైద్ సేనలు రాజస్థాన్ మరో సైనికపటాలం గుజరాత్లోని సౌరాష్ట్ర - కచ్ ప్రాంతాలపై దాడులు చేసి ఆక్రమించుకున్నారు. గుజరాతులోని ప్రసిద్ధ ఓడరేవు భరుకచ్ఛము (భరుచా-బ్రోచ్)ను కూడా అరబ్బుసేనలు దోచుకున్నాయి. అరబ్బులు భారత పశ్చిమ ఉత్తర ప్రాంతాలలో తమ పాలనను స్థిరపరచుకోజూస్తున్నారు. అయితే వారిని అడుగడుగునా భారతీయ రాజులు ఎదిరిస్తూనే ఉన్నారు. ఒంటరిగా ఎదిరించటం అరబ్బులు భారీ సైన్యాల చేతిలో హిందూరాజులు సహజంగానే ఓడిపోవటం, బలిదానం కావటం జరుగు తున్నది.

ఈ క్రమంలోనే ముస్లిం సేనలు మాళ్వా లో సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని పై దాడిచేశారు. ప్రతిహార నాగభట్టు ఉజ్జయిని సంరక్షణకు మాళ్వా ప్రాంతం రాజులందరినీ ఏకంచేసి ముస్లిం సేన నెదిరించాడు. ఉజ్జయిని పొలిమేరలలో తిష్ఠవేసిన ముస్లిం సేనల్ని హిందూరాజులు నాలుగువైపులనుండి చుట్టుకుని తరిమివేశాడు. ముస్లిం విదేశీ దురాక్రమణకారులను తరిమికొట్టుటకు దేశం మొదటిసారిగా హిందూ జాతీయ భావం మేల్కొన్నది. నాగభట్టు నాయకత్వంలో జాతీయ నాయకత్వం రూపుదిద్దుకుంది. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఏక జాతీయ నాయకత్వాన్ని ఆశీర్వదించాడు. ప్రళయ భయంకర శివాంశ సంభూతునిగా నాగభట్టు విజృంభించాడు. హిందూవీరులు మాళ్వా ప్రాంతంలో అక్కడక్కడ తిష్ఠవేసి ఉన్న ముస్లిం సైన్యాన్ని తరిమివేశారు. నాగభట్టు నాయకత్వం జాతీయ నాయకత్వంగా అంగీకరించబడ్డది. నాగభట్టు సేనలు గుజరాత్ ప్రాంతాన్ని అరబ్బులనుండి విముక్తం గావించాయి. అలా సువిశాల ఘూర్జర ప్రతీహార సామ్రాజ్యానికి నాగభట్టు గట్టి పునాది వేశాడు. ఏకరాష్ట్ర భావన (భారత జాతీయ భావన)తో ఏర్పడ్డ సామ్రాజ్యమిది.


భారత పశ్చిమ ఉత్తర ప్రాంతమంతటా ఈ ఏకరాష్ట్ర భావం పెద్ద ఎత్తున నిర్మాణమయింది. సంఘటిత హిందూశక్తి నిర్మాణమయింది. మ్లేచ్చులైన ముస్లిం సైన్యాలను తరిమికొట్టడం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించారు. ముస్లిం నెదిరించిన వీరులందరిని ప్రజలు ప్రశంసించారని ఆనాటి చారిత్రక అఖిలేఖా పత్రాలలో విస్తృతంగా కనిపిస్తున్నది గ్వాలియర్ను పాలించిన భోజరాజు అఖిలేఖా పత్రాలలో ప్రతీహార నాగభట్టు నాయకత్వంలో సాగినపోరాటాలు బహువిధాలుగా గానం చేయబడినట్లుంది. నాగభట్టు శివతాండవమాడుతున్న పరమశివునిగా ప్రస్తుతింపబడినాడు. నాలుగు చేతులలో తళతళ లాడుతున్న ఖడ్గాలతో ముస్లిం (మచ్చ) సంహారం గావించినట్లు వర్ణింపబడింది. భారతదేశ చరిత్రలో ఇలాంటి ఎందరో వీరులు మరుగునపడ్డారు. భవిష్యత్తులో మరింత‌మంది గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజశేఖర్ నన్నపనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments