Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

భారత్ ఒక ప్రాచీన హిందూ దేశం - india is an ancient hindu nation - megaminds

భారత్ దేశం ఒక ప్రాచీన దేశం, భారత్ ఒక ప్రాచీన హిందూ దేశం. యుగయుగాల నుండి ఇక్కడొక దేశం ఉంది. వేదాలలో కూడా దేశమనే భావన ఉల్లేఖించబ...


భారత్ దేశం ఒక ప్రాచీన దేశం, భారత్ ఒక ప్రాచీన హిందూ దేశం. యుగయుగాల నుండి ఇక్కడొక దేశం ఉంది. వేదాలలో కూడా దేశమనే భావన ఉల్లేఖించబడింది. ఆధునిక పరిశోధనల ద్వారా కూడా భారతదేశంలోని ప్రజలందరిలోని క్రోమోజోము లలో ఉన్న డిఎన్ఏ సుమారు 40వేల సంవత్సరాల నుండి ఒకటిగానే ఉంది. ఎలాంటి మార్పులు చెందలేదు అని తెలిసింది.

తల్లి,తండ్రి, సంతానం కలిసి ఎలాగైతే కుటుంబం ఏర్పడుతుందో అలాగే మాతృభూమి, సమాన పూర్వీకులు, పుత్రరూప సమాజం, సమాన సంస్కృతి కలగలసి దేశం అనేది ఏర్పడుతుంది. దేశం అనేది ఒక భావనాత్మక కల్పన. ప్రాచీన కాలం నుండి కూడా ఈ భావనను చూడటానికి ఉదాహరణలు లభిస్తాయి (వేదాలు, పురాణాలలో వర్ణనలు) భారతదేశపు ప్రాచీనత - చరిత్ర మరియు పురాతత్వ పరిశోధనల ఆధారంగా కనీసం 8000 సంవత్సరాల నుండి ఇదొక దేశంగా ప్రభవిల్లుతోంది. ఇదొక 'కొత్త దేశం' లేదా 'రూపొందుతున్న దేశం' కాదు. భారత్ ఒక ప్రాచీన దేశం. ఇక్కడి ధర్మం, వర్గం లేదా జాతీయత దృష్టితో ఒకే ప్రజలు నివసిస్తున్నారు. ఇది అనేక దేశాల సమూహము (ఉపఖండం) కూడా కాదు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఇదొకే దేశం.

ఉత్తరం యత్సముద్రస్య హిమాద్రేశ్చై దక్షిణమ్!

వర్షం తద్ భారతం నామ భారతీ యత్ర సన్తతి:!! (విష్ణుపురాణం 2-3-01)

భారత్ హిందూ దేశం ఈ దేశాన్ని నిర్మించేవారు, దాన్ని పరిచయం చేసేవారు (గుర్తింపు తెచ్చేవారు) హిందువులు మాత్రమే. ఇక్కడి ధర్మం, సంస్కృతి మరియు సమాజం హిందూ అనే పేరుతో పరిచితమైనవి. జీవన పద్ధతి, దృష్టి కూడా హిందుత్వమే. భారతదేశం మనకు కేవలం మట్టికాదు, ఆరాధ్య దేవత. నదులు, పర్వతాలు, వృక్షాలు మొక్కలు, జంతువులను హిందూ సమాజం ఒకే దృష్టికోణంతో చూస్తుంది. వాటన్నింటి పట్ల పూజనీయ భావం ఉంది. జీవనాదర్శాలైన స్త్రీ, దృష్టికోణం, ధనం, అతిథి, త్యాగపురుషులు మొ|| వాటిపట్ల కూడా సమాన దృష్టికోణం, దృష్టి కల్గిన సమాజాన్ని హిందూ అని పిలవడం జరిగింది. ఉదా!!


హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం|

తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే॥ (బార్హస్పత్య శాస్త్రం)

ప్రపంచానికి స్వామి వివేకానంద కూడా హిందూదర్శనమనే సందేశాన్నే ఇచ్చారు. హిందూ అనేదే ఈ దేశపు గుర్తింపు (Identity), వివిధత్వమున్నా ఇది ఏకత్వమున్న హిందూదేశమే. ఈ దేశం అంతా ఒకటే అనడానికి ప్రాచీనా గాంధారము మొదలుకొని కన్యాకుమారి వరకు ప్రతి గ్రామంలో హనుమంతుని విగ్రహారాదన, మరియు రాముడు అయోధ్య మొదలుకొని సిం హళమువరకు వన యాత్ర, కృష్ణుడు అరుణాచల్ నుండి ద్వారక వరకు యాత్ర అలాగే ఆది శంకరాచార్యుల నాలుగు పీఠాలు నాలుగు దిక్కులు ఇలా అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు, ప్రస్తుతం ఉన్న భారతదేశం నుండి తిరిగి మన పూర్వ భారతదేశం ను తిరిగి సాధనే ధ్యేయంగా ఎన్నో సంస్థ
లు భారత వైభవం కోసం పనిచేస్తున్నవి అందులో మనమూ పాలుపంచుకొందాము, దేశం కోసం సమయం కేటాయిద్దాము అఖండ భారతాన్ని సాదిద్దాము. జై హింద్, భారత్ మాతాకీ జై.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..