Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మేవాడ్ వీరుడు రాణా హమ్మీర్ - Mewad Rana Hammir in Telugu - MegaMinds

సింధు-పంజాబు ప్రాంతాలు ముస్లిముల స్వాధీనమయినపుడు ముస్లిములను ఎదుర్కొనే బాధ్యత మేవాడు రాజపుత్రులపై పడింది. సుమారు 900 సంవత్సర...


సింధు-పంజాబు ప్రాంతాలు ముస్లిముల స్వాధీనమయినపుడు ముస్లిములను ఎదుర్కొనే బాధ్యత మేవాడు రాజపుత్రులపై పడింది. సుమారు 900 సంవత్సరాల సుదీర్ఘకాలం మేవాడు రాణాలు ముస్లిములతో సతత సంఘర్షణ కొనసాగించారు. ఎనిమిదవ శతాబ్దంలో మహ్మదు బిన్ కాసిమ్ సింధు ప్రాంతంపై దాడి చేశాడు. సింధు పాలకుడైన రాజా దాహిర్ ను ఓడించి వధించాడు. దాహిర్ కుమారుడు జయసింహుడు చిత్తోడులో ఆశ్రయాన్ని పొందినాడు. చిత్తోడు రాజు మానసింహ మోరి (మౌర్య) విజయసింహుని కాసిమ్ కు అప్పగించాలనుకుంటాడు. ఇది రాజపుత్ర ధర్మం కాదని మానసింహుని సోదర పుత్రుడైన బాప్పా రావల్ జయసింహుని రక్షణభారం వహించాడు. బాప్పారావల్ వీరసేనాని. మహ్మద్ బిన్ కాసిమ్ సేనపై దండెత్తినాడు. బాప్పారావల్ ధాటికి కాసిమ్ సేనలు తోకముడిచినవి. కాసిమ్ అరేబియాకు పారిపోయాడు. సింధుప్రాంతాన్ని పూర్తిగా విముక్తి గావించిన బాప్పారావల్ చిత్తోడు పాలనను చేపట్టినాడు (738), ఆఫ్ఘనిస్థాన్-ఇరాన్ వరకు జైత్రయాత్ర సాగించి హిందూరాజ్య స్థాపన గావించాడు.
దీని తర్వాత ఒక వందేళ్ల వరకు ముస్లిములు భారత్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఖలీఫా మామూన్ రశీద్ కాలంలో మళ్లీ భారత్ పై అరబ్బుల దాడి జరిగింది. అప్పుడు మేవాడ్ రాణా ఖుమాణ్ నాయకత్వంలో హిందువులు సంఘటితులైనారు. గుజరాత్, మాళ్వా, సింధ్ మరియు పంజాబ్ ప్రాంతాలకు చెందిన 38 రాజ్యాల రాజపుత్రులు ముస్లిముల నెదిరించారు. సుమారు 24 యుద్ధాలు జరిగినవి. చివరకు ముస్లిములను పూర్తిగా పారద్రోలగల్గినారు. దీని తర్వాత 300 ఏళ్ల వరకు మేవాడుపై ముస్లిముల దాడి ఏదీ జరగలేదు. సుల్తాన్ శమ సుద్దీన్ అల్తమశ్ పాలన (1311-1336) కాలంలో ముస్లిములు రాజస్థాన్, గుజరాత్ ల పై దాడిచేశారు. అప్పుడు నాగదా పట్టణం మేవాడు రాజధాని. మేవాడ్ రాజు రాణా జైత్రసింహ నాగదా పట్టణం వద్ద సుల్తాన్ ను ఎదుర్కొన్నాడు. భీషణ సంగ్రామంలో సుల్తాన్ పరాజితుడై పారిపోయాడు. తర్వాత జలాలుద్దీన్ విశాల సైన్యాన్ని అనహిలవాడపైకి సింధుమార్గం గుండా పంపినాడు. రాణా జైత్రసింహుడు ఆ సైన్యాన్ని కూడా తరిమికొట్టినాడు. అందువల్ల నాగపట్నం హిందువులకు శక్తివంతమైన కేంద్రంగా నిలిచిపోయింది. ముస్లిం దురాక్రమణ కార్లు దీన్ని గమనించారు. హిందువుల శక్తి కేంద్రాన్ని ఎలాగైనా విచ్చిన్నంచేయజూశారు. రాజస్థాన్-గుజరాత్ ప్రాంతంలో ముస్లిం పాలన స్థిరపరచడానికి ఇది అత్యవసరం. రాజస్థాన్ పైకి ఉలుగ్ ఖాన్ దాడి చేశాడు. జైత్రసింహుని మనవడు రామసింహుడు పరాక్రమించి అబూ పర్వతాలలో ఉలుగ్ ఖాన్ ను ఓడించి తరిమికొట్టినాడు.
మహారాణా హమ్మీర్:
మహమ్మద్ బిన్ తుగ్లక్ (1326-1351) ఢిల్లీ సుల్తాన్ గా ఉన్న కాలంలో రాజ్యంలో అనేక తిరుగుబాట్లు సంభవించినవి. అంతకు ముందే రాణా హమ్మీర్ మేవాడు పాలకుడైనాడు. మేవాడు రాజ్యం బలమైన స్వాభిమాన వునాదులపై నిర్మాణమయింది. అనేక ఆటుపోట్లను తట్టుకొని నిలబడ్డ రాజ్యం మేవాడు. 1303లో చిత్తోడు కోట ముస్లిం సైన్యాలు ముట్టడిలో చిక్కుకున్నది. రాణా రతన్ సింహ కుమారుడు లక్ష్మణసింహుడు చిత్తోడు దుర్గపాలకుడుగా ఉన్నాడు. అతడు ముస్లింల నెదిరించి తన ఆరుగురు వీరపుత్రులతో సహా యుద్ధంలో వీరస్వర్గ మలంకరించాడు. ఏడవ పుత్రుడు అజేయసింహుడు సమష్టిగా చేసిన నిర్ణయాన్ని పాటించి, కోట నుండి తప్పించుకొన్నాడు. ఆరావళి పర్వత ప్రాంతాలకు చేరుకున్నాడు. మరణ పర్యంతం చిత్తోడు కోట విముక్తికి సంఘర్షణ సాగించాడు. 1314లో అతడు మరణించాడు.
అతని జ్యేష్ట సోదరుని కుమారుడు రాణా హమ్మీర్ చిత్తోడ్ రాజు వారసత్వాన్ని స్వీకరించాడు. ఆరావళి పర్వతాలలోని కేల్ వాడ కేంద్రంగా పోరాటం సాగించాడు. మేవాడు - మార్వాడు ప్రాంతాలను కలిపే ఆరావళి కనుమల మధ్య నున్న జిల్ వాడా కోటను స్వాధీనం చేసుకున్నాడు. అక్కడినుంచి రాజపుత్రులను సంఘటిత పోరాటానికి సమాయత్తం గావించాడు. ఢిల్లీ సుల్తానుల నుండి చిత్తోడ్ స్వాధీనానికి సంఘర్షణ సాగించాడు. దిల్లీ ప్రతినిధిగా సిసోదియా రాజపుత్రుడు మాల్ దేవుడు చిత్తోడ్ పాలకుడుగా ఉన్నాడు. అతడు అకాల మరణం చెందగా అతని పుత్రుడు బన్ వీరుడు చిత్తోడ్ పాలకుడుగా ఉన్నాడు. హఠాత్తుగా రాణా హమ్మీర్ చిత్తోడ్ పై దాడి చేశాడు. ముస్లిం సేనల్ని పారద్రోలినాడు. నాడు. బన్ వీర్ ఢిల్లీ పారిపోయాడు. ఢిల్లీ సుల్తాన్ వద్ద నుండి భారీ సైన్యాన్ని తీసుకొని మళ్లీ చిత్తోడ్ వైపు బయలుదేరినాడు. సింగోలి అనేచోట రాణా హమ్మీర్ ముస్లిం సైన్యాలను మళ్లీ త్రిప్పికొట్టినాడు. రాణాహమ్మీరుడు చాలా విజయవంతంగా ముస్లింలను అనేకసార్లు తరిమికొట్టినాడు. చిత్తోడ్ గెలిచి సుదీర్ఘకాలం మేవాడు రాజ్యాన్ని సురక్షితంగా ఉంచాడు. హమ్మీర్ తర్వాత అతని పుత్రుడు రాణా క్షేమసింహుడు మేవాడ పాలకుడయ్యాడు (1378-1415) అతని కాలంలోనే డిల్లీ సుల్తానులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగినవి. మాళ్వా మరియు గుజరాత్ ప్రాంతాలలో దిల్లీ రాజప్రతినిధులు సుల్తాన్లను వ్యతిరేకించారు. స్వతంత్రం ప్రకటించుకొన్నారు. తామే సుల్తానులమని చాటి చెప్పారు. మాళ్వా ప్రతినిధి దిలావర్ ఖాన్ అలా స్వతంత్రించి సుల్తాన్ అయ్యాడు. పాత పగతో రాణా క్షేమసింహునిపై దాడిచేసి క్షేమసింహుని చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. అలా మేవాడు రాజ్యసరిహద్దులు మరింత సురక్షితం మయ్యాయి.
క్షేమసింహుని తర్వాత అతని పుత్రుడు రాణా లాఖా రాజయ్యాడు. మేవాడ రాజకీయం ముస్లిం రాజులందరి ఉమ్మడి శత్రురాజ్యం. మేవాడు స్వాధీనం చేసుకోవాలి. ఢిల్లీ, గుజరాత్, మాళ్వా సుల్తానులు అదనుకోసం చూస్తున్నారు. రాణా లాఖా తన రాజ్యసరిహద్దుల్ని మరింత కట్టుదిట్టం చేశారు. మార్వాడు ప్రాంత పర్వత సానువులను తన రాజ్యసరిహద్దులుగా చేసుకున్నాడు. మరోవైపు బద్నోర్ పర్వత ప్రాంతాన్ని సరిహద్దుగా తీర్చిదిద్దినాడు. సరిహద్దులోని యుద్ధప్యూహ రీత్యా కీలక ప్రాంతాలన్నింటిని తన స్వాధీనంలో ఉంచుకొని పటిష్టం చేసినాడు. తర్వాత గయ, కాశీ-ప్రయాగ తీర్థయాత్రకు వెళ్లినాడు. అక్కడి జౌన్ పూర్ ముస్లిం పాలకునితో పన్ను రద్దు చేయించాడు. మేవాడుపాలకులందరిలో ఒక ప్రత్యేకత ఉంది. ముస్లిముల ద్వారా విధ్వంసం గావించబడిన హిందూ మందిరాలను తమ స్వాధీన ప్రాంతంలో పునర్నిర్మాణం గావించారు. దేశంలో ఎక్కడైనా హిందువులు మందిర నిర్మాణాలకు పూనుకుంటే అన్ని రకాల సాయమందించాడు.
1368లో దిల్లీపై తైమూర్ అను ముస్లిం దురాక్రమణదారుడు టర్కీ ఆఫ్గనిస్థాన్ ప్రాంతం నుండి వచ్చి దాడి చేశాడు. ఢిల్లీ సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ దిల్ వదిలి పారిపోయాడు. ఈ సదవకాశాన్ని మేవాడు పాలకులు బాగా వినియోగించుకున్నారు. రాణాలాఖా పుత్రుడు రాణా మోకల్ మేవాడు సరిహద్దుల్ని మరింత విస్తరించాడు. ఢిల్లీ సుల్తాన్ల స్వాధీనం లోని రాజ్యభాగాలను మేవాడు రాజ్యంలోకి కలుపుకున్నాడు. నాగోర్ రాజ్య పాలకుడైన ఫిరోజ్ ఖాన్ మేవాడు రాజ్యవిస్తరణను అడుకొనజూశాడు. మేవాడుపై దాడి చేయపూనుకున్నాడు. రాణా మోకల్ ముస్లిం సేనల్ని తరిమికొట్టినాడు. మేవాడు రాజ్యసరిహద్దుల్ని మాళ్వా ప్రాంతంవరకు విస్తరించాడు. గుజరాతు ప్రాంతంలోని సుల్తాన్ మొదటి అహ్మద్ షా మేవాడు విస్తరణను అడ్డుకోజూశాడు. జహాజ్ పూర్ అనేచోట జరిగిన యుద్ధంలో రాణా మోకల్ ముస్లిం సైన్యాలను తరిమికొట్టినాడు. ఇలా మేవాడు చాలా పటిష్టమైన రాజపుత్ర రాజ్యంగా రూపుదిద్దుకున్నది, 1433 లో రాణా మోకాల్ మరణించాడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments