Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హలాల్ మరియు జట్కా గురించి పూర్తి వివరాలు - interesting facts about halal vs jhatka - MegaMinds

ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా దేశంలో హలాల్ పైన చర్చ జరుగుతుంది. దీని గురించి చాలామంది అధ్యయనం చేశారు. అలాగే కొంతమ...

ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో అదేవిధంగా దేశంలో హలాల్ పైన చర్చ జరుగుతుంది. దీని గురించి చాలామంది అధ్యయనం చేశారు. అలాగే కొంతమంది పెద్దల ద్వారా తెలుసుకున్న విషయాలు, అలాగే మన భారతదేశ, తెలుగు వాళ్ళ మూఢ నమ్మకాలు అనండీ లేదా సంప్రదాయాలు అనండి వాటి నుండి పూర్తి విషయం తెలుసుకుందాం. ఈ హలాల్ గురించి జొమాటో తో చర్చ మొదలయ్యింది, తిండికి మతం లేదంటూనే, హలాల్ చేస్తాము అని ట్యాగ్ వేస్తాడు జొమాటో. ఇది జొమాటో నీచ వ్యాపార దోరణి.

ఏ మతస్థుడైనా మనిషన్నవాడు ఏ మూగజీవాన్నైనా చంపే అధికారం కలిగి ఉన్నాడా? ఉంటే జీవాన్ని కోసేముందు ముస్లిమ్స్ చేసే ప్రార్ధన /సూక్తులు /హలాల్ చేసిన ప్రాణిని తింటే పాపం తగలదా? ఇది మూఢనమ్మకమా? ఆచరమా? సాంప్రదాయమా? ఓ సారి ఆలోచిద్దాం, హిందువులు కూడా జట్కా పద్దతిని అనుసరిస్తారు, ఇది మూఢనమ్మకమా, ఆచారమా  నిజంగా ఏది నమ్మాలి! ఏది నమ్మకూడదు అనే దానిపై ఇప్పటికీ  స్పష్టత లేదు, ఎందుకంటే ఏది వాడుకలో ఉంటే అదే ఎక్కువగా నమ్మే స్వభావం హిందువులు కలిగి ఉన్నారు. దీనిని పసిగట్టి‌న ముస్లిం వ్యాపారులు హాలాల్ సర్టిఫికేషన్ ను భారత్ లో కూడా ప్రవేశపెడుతూ ఇది కేవలం ముస్లింలకు మాత్రమే అంటూ ఇప్పుడు అన్ని మటన్, చికె‌న్ షాపులలో అదేవిధంగా అనేక తినుబండారాలకు కూడా ఈ ట్యాగ్ ని సర్టిఫికేషన్ వాడుతూ వ్యాపారాలు చేస్తున్నారు, నిజం చెప్పాలంటే మాంసాహారమే కాదు శాఖాహారం భుజించే ప్రతి హిందువు హలాల్ చేయబడిందే తినే పరిస్థితిని తీసుకువచ్చారు.

హిందువులు జట్కా పద్దతిలో జంతువధ:
హిందువులలో కూడా ఇప్పటికీ అక్కడక్కడా ఆర్య కటికలు /ఆరె కట్టికోళ్లు అనీ ఉండేవారు, ఉండవచ్చుకూడా ఏ జంతువునైనా హిందూ సాంప్రదాయప్రకారం కోసేముందు, వాళ్ళు నమ్ముకున్న గ్రామదేవతలకు మ్రొక్కి కోయబోయే జీవాలకు ముందుగా ప్రణమిల్లి వాటికి కూడా మ్రొక్కి, నీళ్లు, కల్లు ఇలాంటి ద్రవపానీయాలు కొద్దిగా త్రాగించి ఒకే దెబ్బకు త్రెగేవిధంగా కోసేవారు. మ్రొక్కులో ఓ భగవంతుడా ఈ ప్రాణిని నీకు సమర్పణగా నీకు ఆహారముగా మాత్రమే చేస్తున్నాను, నేను నిమిత్తమాత్రుడను అనీ అర్ధము అందరికీ తెలిసిందే! ఇది చాలామంది చూసుంటారు. వైదిక సంప్రదాయంలో శైవం జంతు బలులకి వ్యతిరేకం. కానీ కాపాలికులు, వీర శైవులకి జంతుబలులు, నరబలులు అనేది ఆచార విధానం. శాస్త్రం ఆ నకారాత్మక పూజ విధానాన్ని సమర్ధించదు. ఎందుకంటే అది రాక్షసుల ప్రక్రియ. ఇది కలియుగం. ఇందులో మనిషిలో దైవత్వం కంటే రాక్షసత్వం పాళ్లు ఎక్కువగా ఉంటుంది. రాక్షస గుణాల్ని ఎదిరించి పోరాడే వాడు ధన్య జీవి.

ఇక ముస్లింలు చేసే హలాల్ గురించి చూద్దాం:
హలాల్ (Halal) ఇది  అరబ్బీ మూలం, అర్థం: అనుమతించబడినది, ధర్మబద్ధమైనది. ప్రపంచంలోని దాదాపు ముస్లింలు ఈ ధర్మబద్ధ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ హలాల్ ఆహారపదార్థాల వాణిజ్య మార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా ఉందనీ ఒక అంచనా, హలాల్ కు వ్యతిరేక పదం హరామ్ దీని  అర్థం: నిషేధింపబడినది, అధర్మమైనది మరియు అనైతికమైనది. హలాల్ చేయువారు ముస్లిమ్స్ ఎక్కువగా అల్లాహ్ నామమున అనీ  'Bismillah' "in the name of God".ఖురాన్ లో చెప్పబడిన Sura 16:115 చదువుతారు 

సాధారణంగా ఆహారపదార్థాల ఉపయోగ సంబంధమైన పదము. ఆహారపదార్థాలకు "హలాల్ సర్టిఫికేట్" ఇచ్చే సాంప్రదాయం ముస్లిం ప్రపంచంలో సాధారణం. జంతువుల మాంసాలను, హలాల్ (జుబహ్) చేసిన తరువాత మాత్రమే భుజించుట ఆచరణీయము. హలాల్ అనగా ముస్లింలు ఒక జీవి ప్రాణం తీసేటప్పుడు వారియొక్క దైవాన్ని ఇలా ప్రార్థిస్తారు.

ఓ అల్లాహ్  ఈ జీవిని ఆహారం కోసం లేదా వృత్తి కోసం మేం ప్రాణం తీస్తున్నాం.ఈ చర్యలో మాకు ఎటువంటి పాపము అంటకుండా మమ్మల్ని రక్షించు. ఈ జీవికి ఏ నొప్పిగాని బాధగానీ రాకుండా నువ్వే ఈశరీర బాధని తొలగించు. అనీ స్మరిస్తారు అంటారు.

మంత్రం చదివి కొస్తే హలాల్ అలా కాకుండా  మనం కోసుకుంటే హారామ్ జీవాన్ని కోసేముందు దాని తలను ఉత్తరం దిశగా ఉంచి, మెడ భాగంలో కాకుండా మెడ యొక్క క్రింది భాగంలో నాళాలు తెగిపోయే విధంగా మాత్రమే సగం వరకు ముందుగా కోస్తారు గమనించండి, దేనికంటే రక్తం మొత్తం వెళ్లిపోవాలనీ, లేదా మాంసం రుచిగా ఉండదు అనీ  చెబుతారు, కానీ దానికి వేరే అర్థముంది. మొత్తంగా ఒకేసారి మెడ నరికితే /కొస్తే, కోసినవారు ఏకంగా నరకానికి పోతారని వారి విశ్వాసం ప్రకారమే అలా చేస్తారు.

అ) ఇక్కడ అసలు విషయం ఏంటంటే హిందువులందరినీ, హిందువులకు అంటే మనకు తెలియకుండానే వాళ్ళు ఏ ప్రాణినైనా అల్లాహ్ కోసం వారి ప్రార్ధనతో  అర్పించిన తర్వాతే  జీవాన్ని హిందువులకు మాంసంగా అమ్ముతున్నారు అంటే ఓ రకముగా మన భాషలో చెప్పాలంటే ఎంగిలి అని అర్ధం!

ఆ) హిందూ ఆచారం, సాంప్రదాయం ప్రకారం దేవీదేవతలు ఏదైనా పదార్ధం తినుబండారాలు నైవేద్యం గా దేవుళ్ళకు  పెట్టేముందు రుచి చూడటం/ఎంగిలి చేయడం చేయరు?

ఇ) ఇదే పద్దతిన కొందరు క్రిష్టియన్ లు కూడా హిందూ దేవుళ్ళకు పెట్టిన ప్రసాదాలు తినరు.

ఈ) అంతెందుకు ముస్లింలు కూడా చాలామంది ఆర్య కటికలు కోసిన మేక, కోడి ఇలాంటి మాంసాన్ని అస్సలు ముట్టరు. కావాలంటే వారినే అడిగి చుడండి.

ఉ) ఈ విషయంలో ఒకందుకు సిక్కులను గౌరవించాలి వాళ్ళు హలాల్ చేసిన ఏ ప్రాణినైనా తినరు, అది వారి నిబద్ధత.

ఊ) ముస్లింల కంటే ఎక్కువ హిందువులు పాటిస్తున్నారు ఈ హలాల్. హలాల్ చికెన్ సెంటర్లో అయితే ముస్లింలకు జీతమిచ్చి మరి పెట్టుకుంటున్నారు. మైసమ్మకు మేకను కొస్తే హలాల్ చేస్తేనే పొత్తులో ఉంటాం అని అంటుంటారు. నిజంగా హిందువులకు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనే దానిపై స్పష్టత లేదు, దీనిని హిందువులు అందరూ ఒక్కసారి ఆలోచన చేసి వ్యతిరేకించాలి.

ఈ విషయం సరిగ్గా తెలియక హిందువులు ఎగబడి హాలాల్ చేసిన మాంసాన్ని వాళ్ళ కొట్టుకెళ్ళి మరీ కొంటారు, పాపాన్ని మూటగట్టుకుంటున్నారు నిజానికి ఈ వృత్తి చేసేవారు చాలామంది రాత్రి సంసార సంబంధ కార్యక్రమాలు చేసుకొని, అలాగే లేచి స్నానాదులు చేయకుండా పొద్దున్నే 3, 4 గంటలకు లేచి  పశువధ శాలకు వెళ్లి మాంసం తెచ్చి వారి అపరిశుభ్ర మరకల దేహాలతో/బట్టలతో అమ్ముతూ దర్శనమిస్తూ ఉంటారు. అదే హిందువుల మైసమ్మ గుళ్ళలో గానీ కటిక షాపులలో గానీ స్నానం చేసి పేద్ద బొట్టు పెట్టుకుని మరీ కనిపిస్తుంటారు.

1300 ఏళ్ళ క్రితం మన భారతదేశంలో ముస్లిమ్స్ లేరు అని చరిత్ర చెబుతుంది కదా అప్పుడు మూగజీవాలైన మేక, గొఱ్ఱె, కోడీలను  ఎవరు వధించారు? మన ఆర్యకటికలే కానీ ముస్లిం లు భారత దేశానికి వచ్చిన తరువాతే ఊచకోతలు, దేవాలయాల విధ్వంసాలు, హిందూ మతవిద్వేషాలు పెచ్చుమీరి నాశనం చేసేశారు. చాలామంది బలవంతముగా మతం మార్చారు. అంతకుముందు దేవుళ్ళకు పానకం వడపప్పు బెల్లం లాంటి ఆహారపదార్ధాలను పెట్టేవారిని నాశనం చేసేసి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనీ చెబుతూ దేవుళ్ళకు మద్యం మాంసం పెట్టడం అలవాటుగా చేసేసారు అని హిందువుల పెద్దలు చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో చరిత్ర చదివితేనే అర్ధమవుతుంది.

సనాతన ధర్మాన్ని పాటించేవారు మాంసాహారులుగా ఉండకూడదు. అనే నిజానిజాలు పక్కనబెడితే. మనిషికి దేవుడు తేలికపాటి ఆహారాన్ని నమిలి జీర్ణం చేసుకోగల చిన్న నోరు చిన్న పళ్లు ఇచ్చాడు. క్రూర మృగాలకీ మాత్రమే  మాంసాహారాన్ని తినే వీలుగా అంత కోఱలు లాంటి వాడియైన పళ్ళు/దంతాలు  ఇచ్చాడు. మనం క్రూర మృగాల ఆహారం తింటే మన ఆలోచనలు కూడా క్రూరంగా తయారవుతాయి.మెదడు మొద్దు బారుతుంది. హలాల్ లో ఏమి అంటూ కొస్తారు అనే కంటే, ఎలా కోయాలి, ఎక్కడ కోయాలి అనే దాన్ని మరింత వివరంగా గమనించండి. Its a very painful death to the animal, which die due to excessive bleeding at the neck.

సాధారణంగా శరీరంలో (సోమాటిక్ కణాలు) కనిపించే ఏదైనా సంచలనం మొదట కాగ్నేట్ రిసెప్టర్ ప్రోటీన్ల ద్వారా గ్రహించబడుతుంది మరియు తరువాత అది వెన్నెముక ద్వారా మెదడుకు నరాల (న్యూరాన్ల సేకరణ) ద్వారా వ్యాపిస్తుంది. మెదడు నుండి వచ్చే ప్రతిస్పందన వెన్నుపూస యొక్క న్యూరాన్ల ద్వారా వ్యాపిస్తుంది మరియు శరీరం యొక్క ప్రభావ కండరాల ద్వారా వ్యక్తమవుతుంది. హలాల్ వధ విషయంలో, ఈ వెన్నెముక నరాల మార్గం ఉద్దేశపూర్వకంగా చెదిరిపోదు, అయితే జాట్కా విషయంలో అది తక్షణమే అంతరాయం కలిగిస్తుంది అందువల్ల, నొప్పి తెలియకుండానే జట్కా పద్ధతిలో వెంటనే జీవి మరణిస్తుంది, హలాల్ విషయంలో, జంతువు చనిపోయే వరకు నొప్పి సంచలనం మెదడు నుండి వ్యాపిస్తుంది. హానికరమైన ఉద్దీపనకు కారణమవుతుంది మరియు ఆస్ట్రలేసియన్ మరియు బ్రిటిష్ సమూహాల పరిశోధకుల అధ్యయనాల ప్రకారం హలాల్ ద్వారా జంతువులో నొప్పి యొక్క భావన గణనీయంగా పెరుగుతుంది. కానీ జట్కా పద్దతి ద్వారా అయితే శిరచ్చేదం జరగడం వలన వెంటనే ప్రాణం పోతుంది నొప్పి ఉండదు అని పరిశోదకులు చెబుతున్నారు, భారతీయులకు హిందువులకి హింసా ప్రవృత్తి తక్కువ అని కూడా ఈ అధ్యయానలలో వారు వెళ్ళడించారు.

2017 లో భారత సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను అక్రమ కబేళాలను ఆపాలని మరియు అమలు కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.  భారత రాజ్యాంగంలో భారతీయ పౌరులు జంతువుల పట్ల కరుణ చూపాలని, జంతువుల ప్రాథమిక హక్కులను గౌరవించాలని, జంతువులపై క్రూరత్వాన్ని నివారించాలని రాష్ట్రాలను కోరారు. కబేళాల నుండి జంతువుల బాధలను ఆపడానికి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి క్రమంగా మరింత కఠినమైన చట్టాలను అమలు చేసే దిశగా మారుతోంది. యూరోపియన్ యూనియన్ డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్ మరియు ఇటీవల బెల్జియం దేశాలలో హలాల్ నిషేధించబడింది. యూదుల మరియు ముస్లిం మత అధికారుల వాదన ఏమిటంటే జంతువుల మెదడుకు గాయాలు అవుతాయి, దీనిని కర్మ వధకు సముచితం (అనగా ఆరోగ్యకరమైనది) గా పరిగణించలేము, ఈ వాదనను కొన్ని దేశాలు అంగీకరించవు. కొన్ని అంతర్జాతీయ హలాల్ ధ్రువీకరణ అధికారులు ఈ నిబంధనను అంగీకరించినప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం యుఎఇ, మలేషియా, సింగపూర్ మరియు ఇండోనేషియా వంటి ప్రధాన దేశాలు హలాల్ మాంసం దిగుమతి చేసే దేశాలలో ఉన్నాయి. అందువల్ల, పైన పేర్కొన్న చర్చ నుండి, మార్కెట్ ఆధారంగా జంతువుల వధకు, ఇది ప్రధానంగా మత సంప్రదాయం, ఇది జంతువు యొక్క విధిని నిర్ణయిస్తుంది మరియు శాస్త్రీయ వైఖరి కాదు, మరియు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను ఉత్పత్తి చేయడానికి ఆ సంప్రదాయం పెద్దదిగా ఉంటే, అప్పుడు జంతు సంక్షేమ అంశాలు తక్షణమే రాజీపడతాయి. ఇక్కడ మతపరమైన కోణంతో పాటు ముస్లిం సామ్రాజ్య వాదం కూడా బయటపడుతుంది.

అయితే ఇప్పుడు ఇన్ని విషయాలు తెలిసి‌న మనకు అంటే హిందువులకు హాలాల్ తో సంబంధం ఉందా? హిందువులకు హాలాల్ చేయబడిన ఒక జీవిని హింసిస్తూ కోసిన తిండి హిందువులుగా మనం తినాలా? హిందువుల పద్దతి అయిన జట్కా పద్దతిలో తినవచ్చు మీరు ఒకవేళ మాంసాహారులైతే లేదంటే మరీ మంచింది. ఈ హలాల్ మార్కెట్ వలన పిల్లలు తినే బాంబినో ఇలాంటివి కూడా హలాల్ ఉన్నవే కొనాలా అసలు వీటికి హలాల్ కి సంబంధం ఏమిటి? అలాగే ఇంకొన్ని విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, హలాల్ సర్టిఫైడ్ మైదా, గోధుమ పిండి, అలాగే హోటళ్ళు. శాఖాహారంలోకి కుడా వచ్చిన హలాల్, దీని వలన జరగబోయే ప్రమాదం మనకు తెలుసా?? హలాల్ ఎకనామి వలన హిందువులు కోల్పొయే అవకాశాలు, ఉద్యోగాలు ఎన్నో మనకు తెలుసా?? అసలు ఈ హలాల్ ఉత్పతులని మనతో ఎందుకు బలవంతంగా తినిపిస్తున్నారో తెలుసా??
ఈ రోజు భారత్ లో మొత్తం 40000 వేలకు పైగా హాలాల్ ఇండియా సర్టిఫైడ్ చేసిన ఉత్పత్తులు ఉన్నాయని మనకు తెలుసా?? మన దేశంలోకి హాలాల్ టూరిజం కుడా వచ్చిందని మనకు తెలుసా?? హిందువుల గుళ్ళ దగ్గర హలాల్ తో పనేంటి?? దీనిని హిందువుల గుళ్ళ దగ్గర వ్యాపారం గా మార్చే పెద్ద ప్రక్రియ జరుగుతుంది కాదు జరిగింది. భవిష్యత్తులో హలాల్ సర్టిఫైడ్ కాని ప్రోడక్ట్ ఉండదు భారత్ లో కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం. జంతువుల శ్రేయస్సు మరియు జంతువుల హక్కుల పరిరక్షణ కోసం, మతపరమైన లేదా ఆర్ధికవ్యవస్థ నడిచే పద్ధతులు కాదు, మానవత్వ విధానాలు కోరుకుంటారు హిందువులు అంటూ హిందువులు దేశం అంతా ఆందోళనలు చేస్తున్నారు... మరి ఇకనైనా హిందువులు మేల్కొంటారేమో చూడాలి.. జై హింద్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments

 1. Halaal gurinchi ikkada rasindi puttiga tappu. Asalu halaal anduku cheyali scientific proof kuda cheyabadindi.

  ReplyDelete
 2. మంచి సమాచార వ్యాసం.

  స్పష్టంగా హలాల్ ఏ జంతువుకైనా అత్యంత బాధాకరమైన మరణం. పైన పేర్కొన్న కారణంతో పాటు, హిందువులలో ప్రజాదరణ పొందటానికి నేను ఒక ముఖ్యమైన కారణాన్ని జోడిస్తున్నాను. రుచి.

  మన శరీరాలు (అన్ని క్షీరదాలతో సహా) ఫ్లైట్ / ఫ్రైట్ మోడ్‌లో పనిచేస్తాయి, మేక మెడపై లోతైన కోత చేసినప్పుడు - ఎక్కువా mothadhulo అడ్రినాలిన్ హర్మోన్ విడుదల అవుతుంది మరియు రక్తం గుండె ద్వారా పంప్ చేయబడుతుంది. హలాల్ లో నెమ్మదిగా మరణాన్ని నిర్ధారిస్తుంది, ఇది భారీ ఆడ్రినలిన్ ప్రవాహానికి మరింత భరోసా ఇస్తుంది. ఈ ఆడ్రినలిన్ ఇతర జంతువులకు మరియు మానవులకు కూడా మంచిది కాదు కాని ఈ ఆడ్రినలిన్ మాంసానికి గొప్ప రుచిని ఇస్తుంది. ఈ రుచి జంతువులకు శాపం.

  - భాను

  ReplyDelete