Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పేరులోనే ఇండియా-చర్యలన్నీ ఇండియాకి వ్యతిరేకం - About Popular Front of India in Telugu - MegaMinds

పేరులోనే ఇండియా-చర్యలన్నీ ఇండియాకి వ్యతిరేకం        అమెరికా రాజనీతిశాస్త్ర మేధావి అయిన జీన్ షార్ప్" ప్రజాస్వామ్య, శాం...

పేరులోనే ఇండియా-చర్యలన్నీ ఇండియాకి వ్యతిరేకం
       అమెరికా రాజనీతిశాస్త్ర మేధావి అయిన జీన్ షార్ప్" ప్రజాస్వామ్య, శాంతియుత పద్ధతుల్లో ప్రభుత్వాల్ని ఎలా కూల్చాలి?" అనేందుకు ఒక 100 పద్ధతుల్ని పేర్కొన్నారు. ఇలాంటి ఉద్యమాలన్ని పైకి ప్రజాస్వామ్య సంస్థలుగా, శాంతియుత మార్గాల్లో పోరాటం చేస్తున్నట్లు అన్పిస్తుంది. కానీ తద్వారా ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటమే వాటి లక్ష్యం. అలాంటి వాటిలో భారత దేశంలోని PFI సంస్థ ఒకటి. పైకి దేశ అట్టడుగు వర్గాల హక్కులకి ఏర్పడ్డ నూతన సామాజిక సంస్థగా కనిపిస్తుంది. కానీ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) అనేది భారత్ లోని ఒక ఉగ్రవాద మరియు మిలిటెంట్ ఇస్లామిక్ మత ఛాందస సంస్థ. 2006 లో నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ (NDF) కొనసాగింపుగా ఇది ఏర్పడింది. న్యాయం, స్వేచ్ఛ మరియు భద్రతను కల్పించి ప్రజలను శక్తివంతం చేయడానికి కట్టుబడి ఉన్న ఒక నూతన-సామాజిక ఉద్యమంగా పిఎఫ్‌ఐ తమను తాము అభివర్ణించుకుంటుంది. నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్ మరియు క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సహా సమాజంలోని వివిధ వర్గాలను భారత వ్యతిరేఖులుగా తయారు చేయుటకు ఈ సంస్థకు వివిధ అంగాలు ఉన్నాయి. పైకి ప్రజాస్వామ్య, శాంతియుత సంస్థగా కనపడే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అసలు రంగుని తెలియజేయటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. PFI ప్రధానంగా కేరళ కేంద్రంగా రాజేసిన దేశద్రోహ చర్యల్ని ఇక్కడ అర్ధం చేసుకుని దేశవ్యాప్తంగా కొద్దిరోజుల్లోనే జరుగబోయే కుట్రల్ని అంచనా వేయవచ్చు.
        ఆరంభం నుండి PFI వివిధ సంఘ విద్రోహ మరియు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడింది. దీనికి వివిధ ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని, ఆయుధాలు కలిగి ఉన్నదని, కిడ్నాప్, హత్య, బెదిరింపులు,లవ్ జిహాద్ వంటి అనేక మత తీవ్రవాద చర్యల్లో సంబంధముందని తేలింది.
     2012 లో, కేరళ ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ యొక్క కార్యకలాపాలు దేశ భద్రతకు విరుద్ధమని మరియు ఇది "నిషేధించబడిన విద్యార్ధి సంస్థ సిమీకి ఇంకో రూపం తప్ప మరొకటి కాదని హైకోర్టుకు తెలియజేసింది.


PFI కి SIMI కి గల సంబంధాలు
       స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(Simi) 2010 లో నిషేధించబడిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో పిఎఫ్ఐకి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలున్నాయి.​​పిఎఫ్‌ఐ జాతీయ చైర్మన్ అబ్దుల్ రెహమాన్ సిమి మాజీ జాతీయ కార్యదర్శి కాగా, సంస్థ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ హమీద్ సిమి మాజీ రాష్ట్ర కార్యదర్శి.సిమి యొక్క చాలా మంది మాజీ నాయకులు పిఎఫ్‌ఐ సంస్థలో వివిధ పదవులను కలిగి ఉన్నారు .సిమితో సంబంధాలను పాపులర్ ఫ్రంట్ నాయకులు నిరాధారంగా కొట్టిపాడేసిన అందులో వాస్తవం లేకపోలేదు.

కేరళ లో విధ్వంసానికి కుట్రలు
       "స్వాతంత్ర్య పరేడ్" గా పిలువబడే సంస్థ యొక్క స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంపై హైకోర్టు ప్రభుత్వ వైఖరిని కొట్టివేసింది. కాని రాష్ట్రం విధించిన నిషేధాన్ని సమర్థించింది. జూలై 2010 లో, కేరళ పోలీసులు PFIతయారు చేసిన బాంబులను, ఆయుధాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. మరియు పిడిఎఫ్ కార్యకర్తల నుండి సిడిలు మరియు తాలిబాన్ మరియు అల్-ఖైదా ప్రచారాలను కలిగి ఉన్న అనేక పత్రాలు స్వాధీనపర్చుకుంది. కేరళ పోలీస్ లు నిర్వహించిన దాడులను సంస్థ "అప్రజాస్వామిక" మరియు "రాజ్యాంగ విరుద్ధం" అని పిలిచింది.  సెప్టెంబర్ 6 నాటికి, కేరళ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసినట్లుగా హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్-ఎ తైబా (లెట్) లేదా అల్-ఖైదాకు సంబంధాలున్నాయనే ఆరోపణలపై పోలీసులు జరిపిన దర్యాప్తులో ఆధారాలు చూపలేకపోయింది. అయితే, ఏప్రిల్ 2013 లో, ఉత్తర కేరళలోని పిఎఫ్‌ఐ కేంద్రాలపై కేరళ పోలీసులు జరిపిన వరుస  దాడులలో ప్రాణాంతక ఆయుధాలు, విదేశీ కరెన్సీ, బాంబులు, పేలుడు ముడి పదార్థాలు, గన్‌పౌడర్, కత్తులు మొదలైనవి లభ్యమయినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు

షిమోగా హింస వెనుక PFI హస్తం
      కర్ణాటకలోని  షిమోగాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ర్యాలీలో హింస చెలరేగింది. దీని ఫలితంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు.  విశ్వనాథ్ శెట్టి హత్య కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలను అరెస్టు చేశారు.  రెండవ హత్య పాపులర్ ఫ్రంట్‌కు సంబంధించినదని తరువాత రుజువైంది.  

 నిధుల సేకరణకి అబ్బాయిల కిడ్నాప్ మరియు హత్య
      2011 జూన్ 8 న మైసూర్ లోని మహాజన్ కాలేజీ ప్రాంగణం నుండి ఇద్దరు అబ్బాయిలను కిడ్నాప్ చేసి, కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ (KFD) సభ్యులు హత్య చేశారు. వారిసంస్థ నిధుల సేకరణ కోసం 5 కోట్ల రూపాయలని డిమాండ్ చేసింది. కెఎఫ్‌డి సభ్యులు ఆదిల్, అలియాస్ ఆదిల్ పాషా;  అతవుల్లా ఖాన్;  అమీన్, అలియాస్ సయ్యద్ అమీన్;  రెహమాన్, అలియాస్ షబ్బీర్ రెహమాన్;  కౌసర్, అలియాస్ మొహమ్మద్ కౌసర్;  మరియు సఫీర్ అహ్మద్, అలియాస్ సఫీర్ లు అరెస్ట్ చేయబడ్డారు.  ఈ కెఎఫ్‌డి సభ్యుల అరెస్టు తరువాత, కర్ణాటక ఫోరమ్‌ను గౌరవంగా నిషేధించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. తర్వాత 2006 లో KFD PFI లో విలీనమయ్యింది.

సిపిఐ(ఎం)మరియు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల హత్య
       2012 లో, కేరళ ప్రభుత్వం కేరళ హైకోర్టుకు అఫిడవిట్‌లో తెలియజేసిన వివరాల ప్రకారం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి 27 హత్య కేసుల్లో చురుకుగా ప్రమేయం ఉందని తేలింది. హత్య చేయబడ్డ వారిలో ఎక్కువగా సిపిఐ-ఎం, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలని తేలింది. 76 హత్యాయత్నం కేసుల్లో మరియు రాష్ట్రంలో నమోదైన 106 మతకలహాల్లో పీఎఫ్ఐ పాత్ర ఉందని నిరూపణ అయ్యింది.

 ఎబివిపి కార్యకర్తలు ఎన్ సచిన్ గోపాల్ మరియు విశాల్ హత్య
      2012 జూలై 6 న, కన్నూర్ లోని అఖిలభారతీయ విద్యా పరిషత్ జిల్లా స్థాయి కార్యకర్త అయిన సచిన్ గోపాల్ ని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు క్యాంపస్ ప్రాంగణంలోనే పొడిచి చంపారు. అదే విధంగా విద్యార్థి నాయకుడు విశాల్‌ను హత్య చేశారు. 

ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై SMS ప్రచారం
       2012 లో అస్సాం అల్లర్ల తరువాత, ఈశాన్య ప్రజలను ప్రతీకారంతో బెదిరిస్తూ, ముఖ్యంగా రంజాన్ తరువాత, దక్షిణ భారతదేశంలో ఒక SMS ద్వేషపూరిత ప్రచారం ప్రారంభించబడింది.  ఈ ద్వేషపూరిత సందేశాల మూలాన్ని పరిశోధకులు కనుగొన్నారు. హర్కత్-ఉల్-జిహాద్ అల్-ఇస్లామి (హుజి) మరియు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు దాని అనుబంధ సంస్థలైన మనీతా నీతి పసారై మరియు కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ కి ఈ విద్వేష SMS ప్రచారం ఉద్యమంలో భాగం ఉందని తేలింది. 13 ఆగస్టు 2012 న ఒకే రోజులో 60 మిలియన్లకు పైగా సందేశాలు పంపబడ్డాయి. ఇందులో కొన్ని సందేశాలు పాకిస్తాన్ నుండి అప్‌లోడ్ చేయబడినట్లు కనుగొనబడింది.  ఈశాన్య ప్రాంతాల ప్రజలలో భయాందోళనలు కలిగించేలా ఎస్ఎంఎస్ ప్రచారం రూపొందించబడింది.

నరత్‌లో ఆయుధ శిక్షణా శిబిరం
        ఏప్రిల్ 2013 లో, కేరళ పోలీసులు కన్నూర్‌లోని నరత్‌లో ఒక శిక్షణా శిబిరంపై దాడి చేసి, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన 21 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు.  దేశంలో తయారు చేసిన రెండు బాంబులు, ఒక కత్తి,బాంబులు తయారు చేయడానికి ముడి పదార్థాలు, పీఎఫ్ఐ పేరిట కల కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  తనాల్ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయ భవనంలో ఈ దాడి జరిగింది.  అనేక ప్రముఖ వ్యక్తులు మరియు సంస్థల పేర్లతో కూడిన పత్రం కూడా స్వాధీనం చేసుకుంది. ఇది హిట్-లిస్ట్ అని పోలీసులు అనుమానిస్తున్నారు

షాహిన్ భాగ్ CAA వ్యతిరేఖ ఉద్యమానికి PFI కి భారీగా విదేశీ నిధులు
         భారత ప్రభుత్వం తెచ్చిన CAA ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమం వెనుక PFI వేర్పాటువాద కుట్ర దాగి ఉంది. స్వాతంత్ర్యం ముందు ఖిలాపథ్ ఆందోళనలో,సంబంధం లేకున్నా భారత దేశంలోని ముస్లింలు ఆందోళన చేశారు. అప్పుడు ముస్లింనేతలు ఇచ్చిన నినాదాలే నేటి ఢిల్లీలోని షాహిన్ భాగ్ లో మనకు విన్పించాయి. అల్లర్లని దేశమంతటా విస్తరించే భారీ కుట్రకి విదేశీ సొమ్ములు PFI కి ముట్టినట్లు ఇంటిలిజెన్స్ ప్రాథమిక విచారణలో తేలింది. 
తెలంగాణ దాకా PFI కార్యకలాపాలు
     సంస్థ విస్తరించే క్రమంలో CAA వ్యతిరేఖ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మల్చుకుని అనేక రాష్ట్రాల్లో కార్యకర్తలను నియమించుకుంది. ఇటీవలనే తెలంగాణలో కరీంనగర్ కేంద్రంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా  కార్యకలాపాలు మొదలవటం మనకు తెలిసిందే. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్(IOM) అనే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అహ్మద్ జమీల్  PFI కార్యకలాపాలకి ప్రధాన సూత్రధారిగా తేలింది. కోచింగ్ సెంటర్ పేరుతో అమాయక ముస్లిం యువతని ఆకర్షించి నెమ్మదిగా మతఛాందసం వైపు దింపడమే అతని లక్ష్యం అని పోలీసులు గుర్తించారు. తన ఇద్దరి కుమారులని శిక్షణ పేరిట బెంగుళూర్ కి తీసుకెళ్లినట్లు గమనించిన బాధ్యత గల స్థానిక  ఓ ముస్లిం వ్యక్తి ఫిర్యాదు మేరకు అహ్మద్ జమీల్ ని అరెస్ట్ చేశారు. ఇక్కడ బాధ్యతాయుతుడయిన స్థానిక భారతీయముస్లింని మనం అభినందించకుండా ఉండలేం.  అంతకు ముందే ఇండోనేషియా నుంచి పిలిపించిన  ముస్లింల ద్వారా ఆహ్మద్ జమీల్ కరీంనగర్ లో ఏమి చేయదల్చుకున్నాడో అంతులేని ప్రశ్నలు ఎన్నో? వారితో సన్నిహిత సంబంధాలు ఉన్న జమీల్ కి, ఇండోనేషియా దేశస్థుల్లో 8 మందికి కరోనా పాజిటివ్ రావటం కొసమెరుపు. ఇండోనేషియా- కరోనా- కరీంనగర్ వెనుక ఉన్న రహస్యమంతా ఆ భగవంతునికెఱుక. తెలంగాణలోని అన్ని ఉద్యమాలకి కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్ నేడు భయానక పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. ఆ భయానక పరిస్థితుల్లో అందరం ఉన్నామనే విషయం ప్రతి ఒక్క పౌరుడు గమనించాలి. దేశభక్తి కల పౌరులుగా దేశవ్యతిరేఖ కార్యకలాపాలకి, దేశ విభజన కుట్రలకి అడ్డు నిలుద్దాం. మొదట్లో చెప్పిన అమెరికా స్కాలర్ జీన్ షార్ప్ థియరీ ని అర్ధం చేసుకుని దేశ సమగ్రతకి భంగం కలిగించే చర్యల్ని త్రిప్పికొడుదాం. -సాకి

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment