బారా షహీద్ దర్గా - స్వర్ణాల చెరువు ల అసలు చరిత్ర - Bara Shaheed Dargah Nellore: History & Rottela Panduga Explained

megaminds
0
బారా షహీద్ దర్గా చరిత్ర

నెల్లూరు బారా షహీద్ దర్గా చరిత్ర – రొట్టెల పండుగ కథ

బారా షహీద్ దర్గా ప్రస్తుతం కథనాలను పరిశీలిద్దాం:
నెల్లూరులోని బారాషహీద్‌ దర్గా, పవిత్ర స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచ శాంతి కోసం వచ్చి నెల్లూరులో అమరులైన 12 మంది త్యాగాలను స్మరించుకుంటూ మొహర్రం మాసంలో రొట్టెల పండుగను జరుపుకోవడం ఆనవాయితీ.

దర్గా పక్కన ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరిగే ఈ వేడుక కులమతాలకు అతీతంగా జరగడమే దీని ప్రత్యేకత. ఇక్కడ అంతా ఒక్కటై ఒకరికొకరు రొట్టెలు పంచుకుంటారు. మహ్మద్‌ ప్రవక్త సందేశాన్ని ప్రపంచానికి అందజేయడంలో 12 మంది మతబోధకులు టర్కీ నుంచి భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జా రాజులకు, బీజాపూర్‌ సుల్తాన్‌లకు మధ్య పవిత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో టర్కీ కమాండర్, మత ప్రచారకుడు జుల్ఫేఖార్‌ బేగ్‌తో పాటు 11 మంది వీర మరణం పొందారు.

వారి తలలు గండవరంలో తెగి పడగా మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకువచ్చాయి. వీరమరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే వీరికి సమాధులు నిర్మించారు. 12 సంఖ్యను ఉర్దూలో బారా, వీర మరణం పొందిన అమరులను ఉర్దూలో షహీద్‌లుగా పిలువబడతారు. అందుకే ఈ దర్గాకు బారాషహీద్‌ అనే పేరొచ్చింది. ఈ కథను నిత్యం మనకు వినిపిస్తూ అందరమూ ఒకటే అనే ప్రచారంలో పడిపోయి, కుల మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకునే విధంగా అల్లికలు చేశారు.

బారా షహీద్ దర్గా

అసల చరిత్రను పరిశీలిద్దాం:
హిందూ దేశం తన సుదీర్ఘమైన చరిత్రలో ఎన్నో విదేశీ దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. అటువంటి దండయాత్రలను ఎదిరించటమే గాక, ఆ ఆక్రామకులను తరిమికొట్టిన చరిత్ర హిందువులకు ఉన్నది. ముస్లింల భయంకరమైన నరమేధం, బలవంతంగా మతాంతరీకరణలు స్త్రీల అపహరణములు, దేవాలయాల విధ్వంసము నిత్యకృత్యాలుగా జరిగిపోతున్న రోజులలో సైతం హిందువులు ఎంతగా ధైర్యం వహించి, ఈ ఆపదలను సహించారో, ఓర్చుకున్నారో తెలిసికొన్నపుడు ఎంతటివారైనా అవాక్కవుతారు. తమకు ఎదురే లేదు అనుకొని విర్రవీగిన వారిని హిందువులు నిలువరించి సవాలు చేశారు. జయం లభించినా కూడా కొన్ని చోటల మనకున్న ఆధ్యాత్మిక భావన వలన విదేశీ దురాక్రమణ దారుల బొందలను దర్గాల పేరుతో మనం పూజించడం చూస్తున్నాం అలాంటి వాటిలో నెల్లూరు బారా షహీద్ దర్గా ఒకటి.

ఇక వాస్తవాలలోకి వెళదాము అలాగే మనదేశంలో హిందువుల మద్య ఈ శాంతికాముకులుగా పిలువబడే వారు మన మధ్య అనేక విద్వేషాలకు కారణమైన అంటరానితనం క్రీస్తుశకం 650 సం|| తరువాత ప్రారంభమయ్యింది అనే విషయం మనకు తెలియదు, ఈ అంటరాని తనం అనేది కేవలం భారతదేశంలో ముస్లిం దురాక్రణదారులు చొరబడినప్పటి నుండీ మొదలయ్యింది తప్ప అంతకు ముందు లేదనే చెప్పాలి అంతకు ముందు అందరు వృత్తుల వారీగా పనిచేసుకుంటూ ప్రతి వృత్తినీ గౌరవిస్తూ జీవిస్తుండేవారు, ఇంకొక విషయం ఏమిటంటే దురాక్రమణ దారులు సాగించిన మారణకాండలో కొంతమంది చిన్న పిల్లలను అలాగే ముసలి వాళ్ళను చంపకుండా వదిలేవారు అలాగే అందమైన ఆడపిల్లలను కూడా చంపేవారు కాదు, చిన్న పిల్లల చేత వాళ్ళకు సేవలు చేయించుకునేవారు , ముసలివాళ్ళను ఆ రాక్షస మూకకు వంటవారిగా మార్చి వందలమందికి వండి వార్చే బానిస చాకిరీ చేయించేవారు, ఇక అందమైన అమ్మాయిలను పడక సుఖానికి పిల్లలు కండానికి ఒకరి తరువాత ఒకరు అత్యంత కౄరంగా అనుభవించేవారు వేల మైళ్ళు నడిపించేవారు ఇది దురాక్రమణ దారులు శాంతి కాముకులు చేసిన రాచ క్రీడ అయితే ఇలా వాళ్ళు అనేకమందిని బానిసలుగా చేసి ఇలాంటి పనిచేసే వారిని బానిసలు అనడం అలాగే వాళ్ళను అంటరానివారిగా భావించడం ఇలా అనేక రకాలుగా వాళ్ళను చిత్రహింసలు చేసేవారు ఒకసారి మతం మారింతే ఏ దేశం వాడైనా ఎవరైనా సరే వాడు అరబ్బుని ప్రేమించాలి, అలాగే అరబిక్ భాష మాట్లాడాలి అవి చేయనంత వరకు వారు మతం మారినప్పటికీ వారికి అల్లా కరుణ లభించదు.

అలా హింసలకు గురయ్యిన చాలామంది మతం మారిపోయారు మన దేశంలో కుల వ్యవస్త బలంగా ఉండటం వలన వారి ఆశలు కొంతవరకు నెరవేరినప్పటికీ అక్కడక్కడా అన్నిచోట్లా అది సాధ్యపడలేదు కొన్ని చోట్ల అన్ని కులాల నుండి కొంతమంది మతం మారినప్పటికి మహరులు (మాదిగలు) లలో ఒక్కరు కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించలేదు, ఇది చరిత్ర కావాలంటే మీరూ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు, మహరులు చాలా యుద్ద నైపుణ్యం కలిగిన వారు కత్తి చేతికి దొరికితే వారి ఎదుట వందలమంది ఉన్నా కూడా రక్తం ఏరులయ్యి పారాల్సిందే తప్ప వారిని ఏ మాత్రం ఎదురించలేని శక్తి అజేయమైన శక్తిని మహరులు కలిగి ఉండేవారు, ఇది గ్రహించిన ముస్లిం దురాక్రమణ దారులు వారిని అనేక ఇబ్బందులు పెడుతూ అప్పుడు కులాల మధ్య విభేదాలు సృష్టించే పని చేసి వారు ఆయుధం పట్టకుండా ఉండే విధంగా వారి చేత ఒక సందిని కుదుర్చుకుని ధక్షిణ భారతదేశం వైపు పయనమయ్యారు, అదే నెల్లూరు పట్టణానికి దగ్గరలో జరిగింది అది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

సరిగ్గా ఇలాంటి సమయంలో భారతదేశంలో అల్లా రాజ్యాన్ని స్థాపించడానికి 400 సంవత్సరాల క్రితం 1751లో సౌదీ నుంచి, మక్కా నుంచి 12(బారా)మంది ఇస్లాం మత వ్యాప్తి కోసం బయల్దేరారు. దారి పొడవునా లొంగిన వారిని మతం మారుస్తూ, మొండికేసిన వారిని హతమారుస్తూ, మహిళల మాన ప్రాణాలను దోచుకుంటూ, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామం చేరుకున్నారు. ఈ గ్రామంలో మహరులు అధికంగా ఉండేవారు వీరంతా అప్పటికి ఆయుధాలు చేతిలో ఉంటే ఒక్కొక్కరు వందమందికి సమాధానం చెప్పగల యోధులు, మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు నెల్లూరులో చాలామంది ధైర్యసాహసాలు కలిగి ఉంటారు.

ఒక విచిత్రం ఎమిటంటే అందరూ అనుకుంటున్నట్లు ఆ 12 మంది గండవరం వెళ్ళలేదు కొంతమంది నెల్లూరులో అత్యంత ప్రాచూర్యం పొందిన గణపతి దేవుడు 11 వ శతాబ్దంలో తవ్వించిన చెరువులో ఉన్న శివాలయం వద్దకు కొంతమంది వెళ్ళారు, వారి వెంట వచ్చిన కొంతమంది అనుయాయులు మాత్రమే గండవరం వెళ్ళారు గండవరం వెళ్ళిన ముస్లిం దురాక్రమణ సైనికులు గండవరం గ్రామం ఒకవైపు నుండి అన్ని రకాల హింసలకు పాల్పడుతూ మహిళలను, చిన్న చిన్న ఆడపిల్లలను, బాలింతలను అనేకరకాలుగా చిత్ర హింసలు చేస్తూ ఒకరి తరువాత ఒకరు అనుభవిస్తూ అందరినీ సామూహికంగా హింసిస్తూ మారణం హోమం సృష్టించారు ఆ రాత్రి సమయంలో ఈ విషయం తెలిసిన కొంతమంది మహరులు ఆయుదాలు చేతబూని ముందుకి వచ్చారు వీరంతా వ్యాయామ శాలలో రోజూ యుద్ద విద్యలు అభ్యసించే మల్ల యోధులు వాళ్ళలో వీరయ్య అనే అతను ఈ యువకులందరిని ముందుండి నడిపించాడు అందుకే నెల్లూరు గండవరం చుట్టుపక్కల వీరయ్య, బుచ్చయ్య అనే పేర్లు మనకు తరచూ వినపడుతుంటాయి, ఆ రాత్రి సమయం లో మారణహోమం చూసిన వీరయ్య మరియు తన అనుచరులు రగిలి పోయారు వందలాది మందిని తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఉగ్ర నరసింహులై గండవరం ప్రజలను చంపిన దానికి ప్రతీకారంగా కత్తి దూస్తే తలలు తాటికాయల్లా తెగిపడ్డాయి అలాంటి ప్రతీకారం మహరులు తీర్చుకున్నారు.

కొంతమంది ముస్లిం దురాక్రమణ సైనికులు పారిపోయారు వారి వెంట వీరయ్య, అతని అనుచరులు వారి గుర్రాలపై వెంబడిబంచారు వారు పరుగెత్తుతూ నెల్లురు లో ఉన్న శివాలయం చెరువు దగ్గరకు వచ్చారు, అప్పుడు వీరయ్యకు జరిగినదంతా అర్దమయ్యింది, శివాలయం వద్ద వందలాది మంది ఊచకోత కోయబడ్డారు శివలింగాన్ని పగలగొట్ట పోగా అది పగలకపోవడంతో దానిని వారు ఆ చెరువులో పికిలించి పడవేశారు, జరిగినదంతా గ్రహించిన వీరయ్య మరియు అనుచరులు కత్తి కి పనిచెప్పి ఏ ఒక్కడినీ మిగలకుండా ఆ రాత్రంతా పరుగులెత్తించి ఆ పన్నెండు మంది ని నరికి ముక్కలు ముక్కలుగా చేసి పడేశారు ఆరాత్రి జరిగిన ముస్లిం దురాక్రమణ దారులు చేసిన నరమేదం లో గాయాలయ్యి వీరయ్య కూడా అక్కడే అమరుడయ్యడు ఇదీ జరిగిన కథ, ఇది తెలిసిన నెల్లూరు నవాబులు ఉగ్రులయ్యారు ఆ సమయంలో కర్ణాటకలో హైదర్ అలీ పరిపాలన, నెల్లూరులో నవాబుల పరిపాలన సాగుతుండడంతో వారిని అమర వీరులుగా కీర్తిస్తూ వారికి “బారా షహీద్” (పన్నెండు మంది అమర వీరులు) అని నామకరణం చేసి అక్కడ సమాధులు నిర్మించారు. కాలక్రమంలో అసలు చరిత్రను మరుగుపరచారు. హిందువులు కూడా జరిగిన వాస్తవాలు మరచిపోయారు. ముస్లిములు, సెక్యులర్ హిందువులు కలసి సృష్టించిన కల్పితగాధనే నిజమని నమ్ముతూ ప్రతి ఏడాది స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగలో కుల మతాలకతీతంగా అందరూ పాల్గొంటూ వస్తున్నారు.
 

Bara Shaheed Dargah Nellore

ఇప్పటికీ గణపతి దేవుడు తవ్వించిన చెరువులో, నాటి ఆచారాల ప్రకారం చెరువు మధ్యలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించారు. వేసవిలో చెరువులో నీటి మట్టం తగ్గిన ప్రతిసారీ ఆ శివలింగం దర్శనమిస్తూ వుంటుంది. ఈ విషయం నెల్లూరు వాసులు చాలామందికి విదితమే...!

బారా షహీద్ దర్గా

కనీసం ఆలోచన చేయగలిగితే వాస్తవాలు మనకే తెలుస్తాయి, అసలు ఎక్కడినుండో మనదేశం వచ్చి మనకు శాంతిని భోదిస్తే ఆ పన్నెండు మందిని ఎందుకు చంపుతారు, అయినా మనదేశం ఇప్పటి వరకూ ఏ ఒక్క దేశం మీదా దండయాత్ర చేయలేదు అలాగే ఎక్కడ నుండో ఇక్కడకు వచ్చి మన మహిళలను ఇబ్బందులు పెడుతున్న వారిని చంపిన వారు అమరులవ్వాలి గాని దురాక్రమణ దారులు ఎందుకు అమరులవుతారు. దోపిడీ దారులను ఎదురించి పోరాడింది మనము కదా మనకు కదా.. స్మారక స్తూపాలు కట్టించాల్సింది, ఇప్పటికైనా హిందువులు మేల్కొని ఆ చెరువులో ఉన్న శివయ్యకు గుడి కట్టి అమరులైన వీరయ్య, అనుచరులకు ఆత్మశాంతి ని కలుగ చేయాలనేది ఈ వ్యాసం యొక్క సారాంశం...

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMinds


Bara Shaheed Dargah history, Rottela Panduga Nellore, Bara Shaheed Dargah Nellore, బారా షహీద్ దర్గా చరిత్ర, నెల్లూరు రొట్టెల పండుగ, బారా షహీద్ దర్గా నెల్లూరు

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top