Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గుర్రం చేతిలో చచ్చిన కుతుబుద్దిన్ ఐబక్ - Subhrak, Horse which killed Qutbuddin Aibak

కుతుబ్ ఉద్-దిన్ ఐబక్ (CE 1150–1210), మామ్లుక్ రాజవంశం స్థాపకుడు మరియు డిల్లీ మొదటి సుల్తాన్. అతను తుర్కిస్తాన్లో టర్కీ తల్లి...

కుతుబ్ ఉద్-దిన్ ఐబక్ (CE 1150–1210), మామ్లుక్ రాజవంశం స్థాపకుడు మరియు డిల్లీ మొదటి సుల్తాన్. అతను తుర్కిస్తాన్లో టర్కీ తల్లిదండ్రులకు జన్మించాడు. ఐబక్  అతని బాల్యంలో బానిసగా అమ్ముడై పర్షియాలోని నిషాపూర్ లో పెరిగాడు, అక్కడ అతన్ని స్థానిక ఖాజీ కొనుగోలు చేశాడు. చివరికి ఘోరి ముహమ్మద్ యొక్క బానిస అయ్యాడు, అతన్ని అమీర్-ఇ-అఖూర్ అని పిలుస్తారు.

ఇక భారత చరిత్ర విషయానికి వస్తే చిత్తోర్‌గర్‌ రావల్ సమర్ సింగ్ దేవా చౌహాన్ రాజ్‌పుత్ బప్పా రావల్ వారసుడు, సమర్ సింగ్ క్రీ.శ 1171లో పృద్విరాజ్ III సోదరి పృథబాయిని అజయమేరు రాకుమారిని (అజ్మీర్) వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన వెంటనే, పృథబాయికి కల్యాణ్ రాయ్ అనే కుమారుడు జన్మించాడు, తరువాత  పృథబాయికి పిల్లలు పుట్టరన్న విషయం తెలిసి సుమారు 1178 లేదా 1179 లో రావల్ సమర్ సింగ్ మరలా గుజరాత్ రాణి నాయకి దేవి కుమార్తె యువరాణి కుర్మా దేవిని వివాహం చేసుకున్నాడు, కుర్మా దేవి సమర్ సింగ్ రెండవ భార్య.

గుజరాత్ లో అదే సమయంలో నాయకిదేవి ముహమ్మద్ ఘోరీ చేతుల్లో ఓటమి పాలయ్యింది, భారతదేశాన్నిమరలా జయించటానికి తిరిగి వచ్చిన మహ్మద్ ఘోరి మరియు పృథీవిరాజ్ చౌహాన్ దళాల మధ్య జరిగిన 2 వ తారైన్ యుద్ధంలో (క్రీ.శ. 1191-92) సమర్ సింగ్ దేవా మరియు అతని పెద్ద కుమారుడు కల్యాణ్ రాయ్ ఇద్దరూ తారైన్ రెండవ యుద్ధంలో మరణించారు, పృథబాయికి రెండు విధాలగా నష్టం జరిగింది భర్త మరియు కుమారుడు కళ్యాణ్ రాయ్ ఇద్దరూ ఒకేసారి మరణించారు, ఆ బాధను తట్తుకోలేక అదే రోజున సమర సింగ్ చితిలో పృథబాయి దహనం అయ్యింది. కానీ కుర్మా దేవి ఒక్కమారు ఆలోచన చేసి చిన్న వాడైన కర్ణా సింగ్ అలాగే భర్త రాజ్యాన్ని ప్రజలను ఎలాగైనా కాపాడలని నిర్ణయించుకుని కథన రంగంలోకి దూకింది.

ముహమ్మద్ ఘోరి దగ్గరకు కుతుబ్-ఉద్-దిన్ ఐబాక్ డిల్లీ మరియు అజయమేరు (అజ్మీర్) లకు విడిచిపెట్టి వెళ్ళాడు. ఈ సమయంలో కుర్మా దేవి తన బలగాలను ఏకీకృతం చేసి, పొరుగున ఉన్న రాజ్‌పుత్ పాలకులతో కొత్త పొత్తులు పెట్టుకున్నారు. తండ్రి సమర్ సింగ్ మరణించినప్పుడు, కర్ణ సింగ్ కీ 12 సంవత్సరాల వయస్సు వారసత్వం ఎటువంటి అడ్డంకులను ఎదుర్కోలేదు, కుర్మా దేవి తన కుమారుడు చిన్నవాడు అవ్వడం వలన తనే రాణిగా ముందుకు నడిపించింది. తల్లి నాయకి దేవి నుండి కుర్మా దేవి ప్రేరణ పొందింది, నాయకీ దేవి ఒక యోధురాలు మరియు 2 వ తారైన్ యుద్ధంలో నష్టపోయిన తరువాత బలగాలను తిరిగి కుర్మా దేవి బలపరిచింది.

చిన్నవాడు కర్ణ సింగ్ తన 13 వ పుట్టినరోజుకు చేరుకున్నప్పుడు, ఆమె సైన్యాన్ని నడిపించి, తన భర్తను చంపిన వ్యక్తిని వెతుక్కుంటూ ఉత్తరం వైపుకు వెళ్ళింది, క్రీ.శ 1194 లో అసోజ్ (అస్విన్) నెలలో, దసరా తరువాత, యుద్ధ కాలం యొక్క సాంప్రదాయ ప్రారంభం. డిల్లీ వైపు ఆమె యాత్రలో తొమ్మిది మంది రాజాలు మరియు పదకొండు మంది ముఖ్యులతో పయనమయ్యింది.

పృథ్వీ రాజ్ రాసోలో వివరించిన యుద్ధం ప్రకారం, కుర్మా దేవి మరియు ఆమె దళాలు పాత అంబర్ కోట సమీపంలో కుతుబ్-ఉద్-దిన్ మరియు అతని సైన్యాన్ని ఎదుర్కొన్నాయి. ఆమె తన తల్లిలాగే యోధురాలైన కుర్మా దేవి కుతుబ్-ఉద్-దిన్ సైన్యం యొక్క అంచనాలను దెబ్బతీసింది ఐబక్ సైన్యం ప్రాణ భయంతో పరుగులు తీసింది, ద్వంద్వ పోరాటంలో అతనిని సవాలు చేస్తూ కుర్మా దేవి తన కత్తిని కుతుబ్-ఉద్-దిన్ యొక్క పొట్టలో లోతుగా దింపింది అతన్ని తీవ్రంగా గాయపరిచింది రక్తంతో గుర్రం మీద నుండి పడిపోయాడు. అది చూసి తను చనిపోయాడని నమ్ముతూ, ముస్లిం సైన్యం పూర్తిగా గందరగోళానికి గురై యుద్ధభూమి నుండి పారిపోయింది. ఆమె క్యూతుబ్-ఉద్-దిన్ను చంపినట్లు నమ్మి మరియు అతని సైన్యం యుద్ధభూమి నుండి పారిపోవడాన్ని చూసి, కుర్మా దేవి తన సైన్యాన్ని తిరిగి సమూహపరిచి, దక్షిణ దిశకు నడిపించింది. చిత్తోర్‌గర్‌కు తిరిగివచ్చిన కుర్మా దేవి  భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తను కూడా పృథబాయి వలే ఆత్మార్పణ చేసుకుంది.

క్యూతుబ్-ఉద్-దిన్ అతని గాయాల నుండి చనిపోలేదు. అతను చివరికి కోలుకొని డిల్లీకి తిరిగి వచ్చాడు, తరువాత  సుల్తాన్ ఆఫ్ హింద్ అని ప్రకటించాడు. కుర్మా దేవి వలన జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అతను విష్ణు ఆలయాన్ని ధ్వంసం చేశాడు, దీనికి ధ్రువ్ స్థంబ్ లేదా విష్ణు ధ్వజ్ కూడా అంటారు. దీనికి తరువాత డిల్లీలో కుతుబ్ మినార్ అని పేరు పెట్టారు.
డిల్లీలో ఐబాక్  రాజధానితో సహా గంగా మరియు యమునా నదుల మధ్య ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. అతను తన దృష్టిని ఇప్పటికీ గోరిడ్ ఆధిపత్యాన్ని ప్రతిఘటిస్తున్న రాజ్‌పుత్‌ల వైపు మరల్చాడు. 1195-1203 CE లో అతను వారి బలమైన ప్రదేశాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు, అతని సేనాదిపతి ముహమ్మద్ బిన్ బక్తియార్ ఖిల్జీ బీహార్ మరియు బెంగాల్‌ను జయించాడు. అప్పుడే నలంద విశ్వ విద్యాలయం ను నాశనం చేశాడు, అందులో ఉన్న ధర్మగంజ్ అనే గ్రంధాలయాన్ని తగలబెడితే ఆరు మాసాలపాటు కాలింది అని చరిత్రకారులు చెబుతున్నారు.

పృథ్వీరాజ్ చౌహాన్ ముహమ్మద్ ఘోరీని చంపిన తరువాత. ఐబాక్ ఘోరీ వారసుడయ్యాడు. అతను అప్పటికీ బానిసగా ఉన్నాడు కాని ఐబక్ ఘోరీ వారసుడుగా ప్రకటించుకున్నాడు. ఐబక్ మరోసారి మేవార్‌పై దాడి చేసి కర్ణ సింగ్‌ను (కుర్మ దేవి కుమారుడు) పట్టుకున్నాడు. దోచుకున్న సంపద మరియు రాజుతో పాటు, అతను కర్ణ సింగ్ యొక్క గుర్రం శుబ్రక్ ను కూడా లాహోర్ కు తీసుకువెళ్ళాడు.

సంస్కృతంలో శుబ్రక్ అంటే, శుభా (మంచి) చిహ్నాలను ధరించినవాడు. మహిళలు గాజులు మరియు చీలమండలు ధరించినట్లుగా, ఈ గుర్రం దాని కాళ్ళకు కంకణాలు లేదా చీలమండలు ధరించింది మరియు ఇది ఒక అదృష్ట గుర్రం. లాహోర్ చేరుకున్న తరువాత కర్ణ సింగ్ తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ మళ్ళీ పట్టుబడ్డాడు. కుతుబుద్దీన్ కర్ణ సింగ్‌ను శిరచ్ఛేదం చేయాలని, అవమానాన్ని పెంచాలని, చనిపోయిన రాజుల తలతో పోలో మ్యాచ్ ఆడాలని ఆదేశించాడు.

మరుసటి రోజు, శిరచ్ఛేదం చేయటానికి, కుతుబుద్దీన్ శుబ్రక్ గుర్రంపై స్వారీ చేస్తూ వేదిక వద్దకు వచ్చాడు. శుబ్రక్ తన రాజైన కర్ణ సింగ్‌ను తక్షణమే గుర్తించి కన్నీరుకార్చింది. శిరచ్ఛేదం చేయడానికి గొలుసుల నుండి విముక్తి పొందినప్పుడు, శుబ్రక్ ఒక్కసారిగా అనియంత్రితంగా మారి కుతుబుద్దీన్‌ను తన మీద నుండి నేలమీదకు విసిరింది. కర్ణ సింగ్‌ను రక్షించడానికి శుబ్రక్ తన శక్తివంతమైన కాళ్లతో కుతుబుద్దీన్‌ ఛాతీ మరియు తలని నిరంతరం తన్నడం ప్రారంభించింది. శుబ్రక్ గుర్రం 12–15 సార్లు శక్తివంతమైన తన్నుల ద్వారా కుతుబుద్దీన్ ఐబాక్ అక్కడికక్కడే మరణించాడు.

ఈ సంఘటన మన చరిత్రలో లేదు. కుతుబుద్దీన్ ఐబాక్ గుర్రం నుండి పడి చనిపోయాడని వారు వ్రాశారు. అది ఏ గుర్రం మరియు 11 సంవత్సరాల వయస్సు నుండి గుర్రపు స్వారీ చేస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా పెంపుడు గుర్రం నుండి పడి చనిపోతాడా?

శుబ్రక్  చేతిలో ఐబాక్ మరణం చూసి మొత్తం అక్కడ ఉన్న ముష్కరులంతా అయోమయానికి గురయ్యారు దానినుండి తేరుకునే లోపే శుబ్రక్  తన రాజైన కర్ణ సింగ్ వైపు పరుగెత్తింది, కర్ణ సింగ్ గుర్రాన్నిఎక్కి తప్పించు కున్నాడు. పగలు, రాత్రులు శుబ్రక్  పరుగెత్తి ఉదయపూర్ రాజభవనానికి వచ్చింది. కర్ణ సింగ్ దిగి తన ప్రియమైన గుర్రాన్ని పలకరించిన వెంటనే, గుర్రం విగ్రహంలా కనిపించింది మరియు కర్ణ సింగ్ శుబ్రక్ తలను తాకినప్పుడు, శుబ్రక్  నేలమీద పడి చనిపోయింది. శుబ్రక్ (शुभ्रक) భారత చరిత్రలో నిలిచిపోయిన రాజా కర్ణసింగ్ కు అత్యంత  నమ్మకమైన గుర్రం. రాజా కర్ణసింగ్  చిత్తోర్‌గర్‌ రాజు.

ఈ దేశంలో తను స్వారీచేసే గుర్రం కూడా తన రాజును కాపాడుకోవడం మనం చూడవచ్చు శుబ్రక్ అలాగే చేతక్ గుర్రాలు ఇంకా అనేకమైనవి ఉన్నవి, ఏనుగులు అలాగే ఒంటెలు కూడా ఉన్నవి.. ఇలాంటి ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు దాచి వక్రీకరించిన చరిత్రను రాసి మనల్ని పిరికి వాళ్ళను చేసే ప్రయత్నం జరిగింది ఇకనైనా మేల్కొని మన చరిత్రనెరిగి మనదేశం గురించి ఆలోచిద్దం ఎంతోకొంత దేశం కోసం సమయం కేటాయిద్దాం. మీ నన్నపనేని రాజశేఖర్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

3 comments

  1. Why did you lock the contents not to permit for copy paste?

    ReplyDelete
  2. ఇలాంటి మరిన్ని తెలియని మరియు దాచిన మన దేశం హిందూ రాజులు వీర గాథలు కాలగర్భంలో కలిసిపోయిన. వాటిని బయట పెట్టాలి మన రాజసం, రోషం , పౌరుషం మరియు త్యాగం అందరికీ తెలియపరచాలి..

    ReplyDelete
  3. ఇలాంటి వి పుస్తకాల్లో రాయండి, పిల్లలకు చరిత్ర తెలుస్తోంది

    ReplyDelete