Type Here to Get Search Results !

బిజా మండల్ మసీదు కాదా మరి ఏ దేవాలయం? - About beejamandal Controversy in Telugu

బిజా మండల్ మసీదు(సా.శ 1707): విదిషా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని భోపాల్ తర్వాత మరో ముఖ్యమైన నగరం. ఇక్కడున్న బిజామండల్ మసీదు కూడా అంతకు ముందున్న హిందూ దేవాలయాన్ని కూలగొట్టి కట్టినట్టు తెలిసిపోతూనే ఉంటుంది. చర్చిక అనే చతుష్షష్టి యోగినీ గణంలోని ఒక శక్తిరూపిణికి నిర్మించిన ఆలయాన్ని తమకి చేతనైనంతవరకు రూపం మార్చి బిజామండల్ మసీదు అని పేరు పెట్టేసి వాడుకుంటున్నారు. విజయాన్ని ప్రసాదించే ఈ దేవత ఆలయాన్ని పారమార వంశానికి చెందిన నరవర్మ మహారాజు నిర్మించినట్లు ASI నిర్ధారణ కూడా చేసేసింది.

సా.శ 1679-1808 మధ్యన ఔరంగజేబు ఈ ఆలయం మీద దాడి చేసి సంపదని దోచుకుని విగ్రహాలని గుడిలో ఉత్తరం వైపున పాతిపెట్టించేసి ఆలయాన్ని మసీదు కింద మార్చేశాడు.బిజా మండల్ అనే పేరు కూడా విజయ్ మందిర్ అనే పదానికి భ్రష్ట రూపమే!

కొన్ని ఆలయాల్ని ధనం ఇచ్చి కాపాడుకోవాలని ప్రతిపాదనలు చేసినప్పటికీ ముస్లిములు వాటిని తిరస్కరించి కూలగొట్టేయ్యడానికే ప్రాధాన్యత ఇచ్చారు - వారి ప్రవక్త ప్రత్యేకించి నిషేధించినవాటిని కూలగొట్టకపోతే వారు నరకానికి పోరూ! ఇక్కడ అధికారం స్థాపించుకున్నాక కూడా ప్రజలు తిరగబడే ప్రమాదం వుందనుకోవడం వల్లనే వదిలేశారు గానీ లేకపోతే ఒక్క ఆలయం కూడా నిలిచేది కాదు!

ఇంత రాక్షసంగా వైదిక సంప్రదాయాన్ని ద్వేషించే వీళ్ళు మక్కా లోని కాబా దగ్గిర అదే సంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారు? ముప్పయ్యేళ్ళ పాటు సనాతనధర్మం మీద పగబట్టి ఇల్లు దాటి, వూరు దాటి, నగరాల్ని దాటి, రాజ్యం దాటి, ఎడారి దాటి, నదుల్ని దాటి, సైన్యాన్ని చంపుకుని, గుర్రాల్ని చంపుకుని సోమనాధ విగ్రహ విధ్వంసకుడని ఇస్లామిక్ ప్రపంచం మొత్తం చేత కీర్తించబడిన గజినీ మహమ్మదు కూడబెట్టిన సంపద ఆఖరి దాడి చేసి వెనక్కి వెళ్తున్నప్పుడు క్రిమియుద్ధం తరహాలో జాట్లు అంటించిన మలేరియా రోగం నుంచి కాపాడలేకపోయింది - కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు మలేరియాకి చేసిన వైద్యం వికటించి క్షయరోగం కింద మారి అలమటించి అలమటించి చచ్చాడు! సనాతన ధర్మం మాత్రం తన మీద దాడి జరుగుతుందని తెలిసినపుడూ దాడి జరుగుతున్న సమయంలోనూ దాడి ముగిసిన తర్వాత కాలంలోనూ ఒక్కలాగే చెక్కు చెదరని చిరునవ్వుతో నిలిచి ఉంది! భారత సంస్కృతిని ఎవ్వరూ నాశనం చేయలేరు ఇది సత్య సనాతనం నిత్య నూతనం.. జై హింద్.

క్రింద కొన్ని చిత్రాలు ఇవ్వడం జరిగింది వాటిని పరిశీలించండి వాస్తవాలు తెలుస్తాయి ఇవి సరిపోతాయి అనుకుంటాను.
Source: ASI

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.