Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

వాలంటైన్ డే - ఓ పాస్టర్ తద్దినంరోజు - ఓ దేశద్రోహి వర్ధంతి - valentine's day history in telugu

    మనం భారతీయులం-హిందువులం. హిందువు విశ్వబంధువే... ప్రేమసింధువే. ప్రపంచంలో మంచి ఎక్కడున్నా స్వీకరించే తత్వం మనదే. మనల్ని ఉత్...

    మనం భారతీయులం-హిందువులం. హిందువు విశ్వబంధువే... ప్రేమసింధువే. ప్రపంచంలో మంచి ఎక్కడున్నా స్వీకరించే తత్వం మనదే. మనల్ని ఉత్తమ మార్గంలో నడిపించే అన్ని పద్ధతుల్ని గ్రహిద్దాం-ఆచరిద్దాం. కానీ ఈ మధ్య అక్కరలేని,విశృంఖల విదేశీ పిచ్చి దినోత్సవాలు మన మెదళ్ళని కలుషితం చేస్తున్నాయి.అందులో ఫాదర్స్ డే, మదర్స్ డే, వాలంటైన్ డే పేరుతో జరిగే తతంగాలు అర్ధ రహితం,అశాస్త్రీయం. అచ్చ తెలుగులో అవి అమ్మదినం, నాన్నదినం. అదే విధంగా ప్రేమికుల దినం.
       వాలంటైన్ డే అనేది సామ్రాజ్యవాద వ్యాపార విష సంస్కృతిలో ఓ భాగం. ఆ రోజున షాపుల్లో గిరాఖీలు, హోటల్లో రద్దీలు, పబ్లిక్ పార్కుల్లో విచ్చలవిడి శృంగారాలు, డబ్బుల కొరకు ఇళ్ళలో గొడవలు-ఇవే ప్రత్యేకతలు. నిజానికి అనుకరించె వారు ఎవరికీ వాలంటైన్  గురించి తెలియదు.అసలు వాలంటైన్ సంగతులు తెలిసిన హిందువులు ఎవ్వరు, భారతీయ సంస్కృతిని ఆరాధించేవాళ్ళు ఎవ్వరు ఆ(తత్) దినం జరుపుకోరు.
    క్రీ.శ.268-70 మధ్యకాలంలో రోమ్ నగరంలోని ఒక క్రైస్తవ మత ప్రవక్త (సెయింట్)-(పాస్టర్ కన్నా కొద్దిగా పెద్ద) పేరు వాలంటైన్. ఆ దేశ రాజు పేరు క్లాడియస్. దేశాన్ని సురక్షితంగా ఉంచటానికి యువకుల్ని సైన్యంలో చేరమని రాజు ఆజ్ఞలు జారీచేశారు. కాని ఈ ప్రవక్త రహస్యంగా తన చర్చిలో ప్రేమ వివాహాలు జరిపేవాడు. రాజు అతడ్ని పిలిపించి దేశపరిస్థితుల్ని వివరించి వారించాడు. అయినా వినకుండా వాలంటైన్ రాజుకి శత్రువుల్ని ప్రేమించమని, యుద్ధం వద్దని ప్రేమబోధనలు చేసాడు.అపుడు రాజు " శత్రువు మెడ మీద కత్తి పెట్టి చంపే తరుణంలో ప్రేమ ఏమిటని, ఎదిరించకపోతే నగరం శత్రువుల పాలౌ తుందని, యువకులకి దేశ రక్షణ గురించి చెప్పాల్సిన సమయంలో ప్రేమవివాహాలు జరపడం నేరం" అని మందలించాడు. అయిన వినకపోతే అతన్ని జైలులో బంధించి పెట్టారు. అక్కడికి వచ్చే వాళ్లకి కూడా ప్రేమ బోధలే చేస్తుండటం వల్ల  269 ఫిబ్రవరి 14న ఉరి తీయవల్సిందిగా ఆదేశించాడు. చనిపోయే ముందురోజు వాలంటైన్ జైలు అధికారి కూతురికి ఒక లేఖ రాసాడు. అందులో from yours Valentine అని సంతకం చేసాడు అని ఓ కథనం. జైలు అధికారి కూతుర్ని  కూడా వదలని అపర దేశభక్తుడు, అమర ప్రేమ పిపాసి వాలంటైన్. 
       ఇలాంటి దేశద్రోహి, క్రైస్తవ పాస్టర్ ఉరి తీయబడ్డ చావు దినాన్ని ప్రేమ దినంగా హిందువులు జరుపుకోవటం స్వాభిమానమా?? ఉరి తీయబడిన 200 సం,, లకి క్రీ.శ.469 లో అప్పటి పోప్ గెలిలియస్ ఫిబ్రవరి 14 ని వాలంటైన్ డే గా ప్రకటించాడు. కాబట్టి ఇది ప్రేమికుల దినం కాదు. ఓ దేశద్రోహి చనిపోయిన రోజు. అంటే మన వాడుక భాషలో తద్దినం. క్రైస్తవ పాస్టర్ చనిపోయిన రోజుని సంబరంగా జరుపుకుంటున్న మూర్ఖులం మనం. ఇంకా చెప్పాలంటే ఒక దేశద్రోహి వర్దంతి ని, పర దేశం-పర మతానికి చెందిన వ్యక్తి దినాన్ని జరుపుకుంటున్నాము. ఇది స్వాభిమానం ఉన్న భారత జాతీయులు ఎవరు సహింపరు. ఇలా జరుపుకోవటం సిగ్గుచేటుగా భావించాలి. ఘనమైన సంస్కృతికి వారసులుగా చెప్పుకునే భారతీయుల్లారా! గొర్రెల్లాగా మూర్ఖత్వం తో అర్ధంపర్ధం లేని దినాలు జరుపుకోవద్దు. భారతీయ సింహాలై మహోన్నత సాంస్కృతిక జీవన విధానానికి వారసులుగా నిలుద్దాం. -సామల కిరణ్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..