Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారతదేశాన్ని పాలించిన చివరి హిందూ చక్రవర్తి హేము - Hemu Vikramaditya The Last Hindu Emperor Who Defeated Akbar

అక్బర్ మనకు తెలిసి గొప్ప మొఘల్ పాలకులలో ఒకడు, అక్బర్ పేరును మన చరిత్రలో చాలా గౌరవంగా లిఖించారు. తన ప్రత్యర్థులపై లెక్కలేనన్న...

అక్బర్ మనకు తెలిసి గొప్ప మొఘల్ పాలకులలో ఒకడు, అక్బర్ పేరును మన చరిత్రలో చాలా గౌరవంగా లిఖించారు. తన ప్రత్యర్థులపై లెక్కలేనన్ని యుద్ధాలు గెలిచాడు మరియు భారత హిందూ రాజులపై గెలిచి ఖ్యాతి గడించాడు అని మనం చదువుకున్నాం, కానీ మనకు చాలా తక్కువ తెలిసిన ఒక గొప్ప భారత చక్రవర్తి ఉన్నాడు.  భారత చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన వ్యక్తి అతనే హేమచంద్ర విక్రమాదిత్య,  శక్తివంతమైన అక్బర్ దళాలను ఓడించాడు. పూర్తి భారతదేశాన్ని పాలించిన చివరి హిందూ చక్రవర్తి హేము విక్రమాదిత్య.

కానీ దురదృష్టవశాత్తు హేమూకి భారత స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పెద్దగా చరిత్రలో గౌరవం మరియు ప్రస్తావన లేకుండా పోయింది, హేము డిల్లీకి నైరుతి దిశగా ఉన్న రేవారి అనే చిన్న పట్టణంలో జన్మించాడు. హేము కుటుంబాన్ని పోషించడానికి బాల్యంలోనే చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు.

డిల్లీలో 1545 లో షేర్ షా సూరి మరణం తరువాత, అతని కుమారుడు ఇస్లాం షా సింహాసనాన్ని అధిష్టించినప్పుడు, హేమును డిల్లీలోని వ్యాపార లావాదేవీలకు సంబదిత అధికారిగా నియమించాడు. క్రమంగా హేము నిఘా అధికారిగా కూడా ఎదిగాడు. ఇస్లాం షా మరియు ఫిరోజ్ ఖాన్ ల మరణం తరువాత, ఆదిల్ షా దగ్గర హేము ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆఫ్ఘన్ తిరుగుబాటులకు వ్యతిరేకంగా ఆదిల్ షా సూరి, హేము అనేక యుద్ధాలు చేసారు మరియు వాటిలో 22 గెలిచారు.

మరోవైపు ఆదిల్ షా యొక్క బావ సికందర్ షా సూరిని కూడా ఓడించిన హ్యూమన్యున్ నాయకత్వంలో మొఘలుల ఆధిపత్యం మొదలయ్యింది. 1555 లో అదే సమయంలో హ్యూమన్యున్ మరణించినప్పుడు హేము మొఘలులను తరిమి కొట్టాలని ఆలోచన చేశాడు. హేము బెంగాల్ నుండి సేనలతో బయలుదేరి బయానా, ఎటావా, సంభాల్, కల్పి మరియు నార్నాల్ నుండి మొఘలులను తరిమికొట్టాడు.

తుగ్లకాబాద్‌లో మొఘలులపై హేము పెద్ద విజయం సాధించాడు. ఆగ్రాను స్వాధీనం చేసుకున్న తరువాత అక్కడ అతను తార్డి బేగ్ ఖాన్ ను ఓడించాడు. మొఘలులకు వ్యతిరేకంగా హేముకు ఉన్న సైనిక బలగాల్లో ఒకటి అల్వార్ నుండి వచ్చిన సైన్యం. 1556 అక్టోబర్ 7 న హేము ఒక రోజు యుద్ధం తరువాత డిల్లీని స్వాధీనం చేసుకుని విక్రమాదిత్య బిరుదును పొందాడు. తుగ్లకాబాద్ లో ఓడినవెంటనే అక్బర్ తన సైనిక దళాలతో డిల్లీకి బయలుదేరాడు. అక్బర్ దళాలకు 10,000 మంది అశ్వికదళంతో కూడిన అలీ కులీ ఖాన్ షైబానీ నాయకత్వం వహించారు.

ఆ తరువాత నవంబర్ 5, 1556 న ప్రసిద్ధ పానిపట్ యుద్ధభూమిలో హేము యొక్క దళాలు అక్బర్‌ దళాలతో యుద్దం చేశాయి. హేము ఏనుగును నడుపుతూ సైన్యాన్ని స్వయంగా నడిపిస్తున్నాడు. అక్బర్ యొక్క దళాలకు అక్బర్ తో సహా అతని అత్యుత్తమ సైనికులు నాయకత్వం వహించారు. ఇది భారతదేశ చరిత్రలో పెద్ద యుద్దాలలో ఒకటి మరియు హేము యొక్క సైనిక దళాలు మొఘల్ సైన్యానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి.

ఇంకేముంది హేము అక్బర్ ని ఓడించాడు అని అనుకునే సమయంలోనే ఒక బాణం హేము కుడి కంటికి తగిలి, తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు. నాయకుడు కుప్పకూలడంతో సైన్యం భయపడి చివరికి యుద్ధంలో ఓడిపోయింది. మొఘలులు హేమును తాను నడుపుతున్న ఏనుగుతో పాటు పట్టుకున్నారు. అక్బర్‌ హేమును శిరచ్ఛేదం చేయమని  బైరామ్ ఖాన్ ను ఆదేశించాడు, కాని చనిపోతున్న వ్యక్తిని చంపడాన్ని అతను ఖండించాడు. చివరికి అక్బర్ ఆదేశంతో బైరామ్ ఖాన్ హేమును చిత్రహింసలు చేస్తూ చివరకు శిరచ్ఛేదనం చేశారు.

అఖండ భారతదేశపు చివరి హిందూ చక్రవర్తి మరియు సామ్రాట్ గా తన స్వల్పకాలిక కీర్తి తరువాత యుద్దభూమి లో అమరుడయ్యాడు. ఇలాంటి వీరుల గురించి మన చరిత్రలో ఎక్కడా ప్రస్తావన చేయరు అలాగే కీర్తించరు.. కానీ అక్బర్ ది గ్రేట్ అనే పాటాలతో మన చరిత్రనిండి పోయింది, ఒక గొప్ప చరిత్రకు వారసులమని గర్విద్దాం ఇకనైన మన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. హేము చంద్ర విక్రమాదిత్య కి జై, భారత్ మాతాకీ జై.. రాజశేఖర్ నన్నపనేని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments