Type Here to Get Search Results !

అల్లమ మహాప్రభు గొప్ప శివ భక్తుడు - allama maha prabhu in telugu

యోగ శాస్త్రంలో కర్ణాటకలోజరిగిన ఒక అద్భుతమైన కథ ఉంది. దక్షిణ భారత దేశంలో డెక్కన్ పీటభూమిలోని కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో సిద్ధలింగయోగి అనే ఒక గొప్ప యోగి ఉండేవారు. ఆయన ఈ ప్రాంతంలోని ప్రతి చోటకు వెళ్లి ప్రతివారికీ తాను ఎంతో గొప్ప యోగినని నిరూపించేవారు. ఆయన కాయకల్ప మార్గంలో ఉన్నారు. కాయ అంటే “శరీరం” అని , కల్ప అంటే శరీరాన్ని పూర్తిగా వేరే పార్శ్వంలోకి తీసుకువెళ్ళటమని అర్ధము. వీరు పంచభూతాలపై నైపుణ్యం ఉన్న యోగులు. ఈ రకమైన సాధనతో వారు వారి శరీరాన్ని స్ధిరంగా, ధృడంగా చేసుకున్నారు. ఈ యోగులు మానవ ఆయుర్ధాయాన్ని మించి, 300-400 సంవత్సరాల వరకు జీవించి ఉండగలరు ఎందుకంటే వీరు పంచభూతాల మీద  నైపుణ్యంతో వారి శరీరాన్ని స్ధిరంగా చేసుకుంటారు.

ఈ కథ జరిగే సమయంలో, సిద్ధలింగ యోగికి 280సంవత్సరాల పైనే ఉన్నట్లుగా చెప్పబడుతోంది.  ఆయన తన శరీరాన్ని వజ్రం వలే ధృఢంగా చేసుకున్నారు. ఆ రోజులలో ఆయుధాలన్నిటినీ స్టీలు, ఇత్తడి , రాగి లేదా అటువంటి లోహాలతో తయారుచేసేవారు. కాబట్టి ఎవరూ కూడా అందుబాటులో ఉన్న ఆయుధాలతో ఆయన శరీరాన్ని ఛేదించ లేకపోయేవారు. అది ఆయన గర్వం. ఆయన ఎక్కడికి వెళ్ళినా , అందరితో తాను ఒక గొప్ప యోగినని నిరూపించుకోవటానికి సవాలు చేసేవారు.

సిద్ధలింగయోగి,అల్లమ అనే మరొక గొప్ప యోగి గురించి విన్నారు. అల్లమ ఒక యోగిలా జీవించే వారు కాదు. అల్లమ మహాప్రభు అని పిలువబడే అల్లమ ఒక గొప్ప శివ భక్తుడు,  ఒక మంచి సాధువు. దక్షిణ భారతదేశంలో నేటికీ గౌరవించబడే యోగులలో ఆయన ఒకరు. అక్క మహాదేవి వంటి భక్తులు అల్లమతో సన్నిహితంగా ఉండేవారు. ఆ సమయంలో  షరతులులేని భక్తి, ఇంకా ఇతర రకాల సాధనల గురించి అల్లమ ప్రజలకు ఇస్తున్న సందేశం బాగా వ్యాప్తి చెందుతోంది.

వాస్తవానికి అల్లమ ఒక రాజు. లౌకిక విధులను నిర్వర్తించటానికి ఒక రాజులా వస్త్రాలు ధరించి జీవించినా కూడా ఆయన ఒక యోగి. సిద్ధలింగ ఒక యోగిలా వస్త్రాలు ధరించి ఒక యోగిలా జీవించేవారు. ఆయన ముఖం మీది యోగి అని రాసి కనిపించేది. ఆయనకి చాలా మంచి వస్త్రాలు ధరిస్తూ , ఒక రాజ మహలులో నివసిస్తూ , బాగా అనుభవిస్తూ కూడా, తనను తాను ఒక యోగి అని పిలుచుకునే ఈ వ్యక్తి అంటే అల్లమ నచ్చలేదు. ఆయన అల్లమ వద్దకు వెళ్లి, “ నిన్ను నువ్వు యోగి అని ఎలా అనుకుంటున్నావు? నువ్వు శివ భక్తుడివి ఎలా అవుతావు? నీ వద్ద ఏమున్నదో నాకు చూపించు.” అని అన్నారు.

అల్లమ మహాప్రభు, “మీరు ఒక మహాయోగి కాబట్టి మీ వద్ద ఏమి ఉన్నదో మీరు చూపించడం మంచిది.” అన్నారు. సిద్ధలింగ ఒక వజ్రపు కొన ఉన్న ఖడ్గాన్ని అల్లమకి ఇచ్చి, “ఈ ఖడ్గంతో నా తల మీద మీ బలాన్నంతా ఉపయోగించి గట్టిగా కొట్టండి. నాకు ఏమీ అవ్వదు.” అన్నారు.

అల్లమ ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన ఖడ్గాన్ని తీసుకుని, రెండు చేతులతో బలాన్నంతా ఉపయోగించి సిద్ధలింగయోగి తల మీద గట్టిగా కొట్టారు. ఆ ఖడ్గం వెనక్కి వచ్చింది. ఎందుకంటే ఆయన శరీరం అంత ధృడంగా ఉంది. సిద్ధలింగ అక్కడ ఒక రాయిలా నుంచుని ఉన్నారు. సిద్ధలింగయోగి నవ్వి , “ చూశావా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నువ్వు దీనిని నా మీద ఉపయోగించినట్లే నేను దీనిని నీ మీద ఉపయోగిస్తాను” అని అన్నారు, అల్లమ సరే అన్నారు.

సిద్ధలింగ ఆ ఖడ్గం తీసుకుని అల్లమని వేటు వేశారు. ఆ ఖడ్గమ అతని నుండి గాలి గుండా వెళ్ళినట్లుగా వెళ్ళిపోయింది. అది అతని గుండా వెళ్ళిపోయింది. సిద్ధలింగ దానిని ఇటు తిప్పారు అటు తిప్పారు కాని అది అల్లమను తగలకుండగా వెళిపోయింది. సిద్ధలింగ వొంగి నమస్కరించి, “ నాకు శక్తివంతమైన యోగా మాత్రమే తెలుసు కానీ కోమలమైన యోగా తెలియదు.” అన్నారు . అప్పటి నుండి ఆయన అల్లమ శిష్యుడయిపోయారు. అల్లమ వీరశైవులనే సాధువులకు ప్రేరణనిచ్చి సృష్టించారు. వీరశైవులు వీర భక్తులు. వారు శివ భక్తులు కానీ ఆయుధాలను ధరిస్తారు. అల్లమ సౌమ్యుడు. ఆయన వేల కొద్దీ   ద్విపదాలను రాసారు. ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.