పిల్లలని ఎలా పెంచాలి? స్వేచ్చ ఇవ్వాలా? How much freedom should be given to the child? - Hinduism

megaminds
0

పిల్లల పెంపకం విషయంలో, పిల్లల్ని మనం పెంచాలి అనే దృక్పథం పూర్తిగా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది. మనం కేవలం పిల్లలని ఎదిగేలా చూడాలి గాని మనం పెంచకూడదు. మనం పశువుల్ని పెంచుతాం కాని మనుషుల్ని పెంచం.

మనం వారికి కేవలం ప్రేమ, ఆనందం ఇంకా భాద్యతలతో కూడిన వాతావరణాన్ని సృష్టించాలి. పిల్లలకి వారి బాగోగులు, ఆరోగ్యం, ఎదుగుదల ఇంకా జీవితంలో ప్రతీ పరిమాణానికి స్పందించే విధముగా మనం బాధ్యతగా వ్యవహరించాలి. ఇది వారి జీవితంలోకి తీసుకురావాలి. ఎప్పుడైతే అవసరమైన వాతావరణం కల్పించామో, స్వేచ్ఛ అనేది అదే వస్తుంది.
 
మనం ఇప్పుడు goal-oriented అయిపోయాం, ఇప్పుడు ప్రపంచంలో ప్రధాన సమస్య,. మనకి ఫలితం మీదే ఆసక్తి గానీ పద్ధతి మీద కాదు. మనకు తోటలో పువ్వులు పుయ్యాలంటే, మనం పువ్వుల గురుంచి మాట్లాడకూడదు. మనం ఒక మంచి తోటమాలి అయితే , మనం పువ్వుల గురుంచి మాట్లాడము. మనం మట్టి, ఎరువు, నీళ్ళు, సూర్య కాంతి గురించి మాట్లాడతాము. మనం వీటిని నిర్వహిస్తే చాలు అందమైన పువ్వులు అవే పూస్తాయి.
 
అదేవిధంగా మనం పిల్లల వికాసానికి అవసరమైన వాతావరణం కల్పిస్తే, వారు అధ్బుతంగా వికసిస్తారు. కాని మనం పిల్లల్ని మన మనస్సులో మనం ఏర్పరచుకున్న ఒక (పద్ధతిలో) మూసలో ఒదిగేలాగా పెంచుదామనుకుంటే మాత్రం ప్రతీ పిల్లవాడు ఎదురు తిరుగుతాడు, ఎందుకంటే మనం మనస్సులో ఏర్పరచుకున్న ఆకారంలోకి ఎవ్వరూ ఒదగలేరు. జీవం మన మనస్సులో ఏర్పరచుకున్న చట్ర పరిధిలో ఒదగదు. మనస్సే జీవితంలో ఒదగాలి. ఇది అర్థంచేసుకోండి. కాబట్టి పిల్లల్ని పెంచటానికి పెద్ద పెద్ద ఐడియాలు పెట్టుకోకండి.

ప్రేమ, ఆనందం ఇంకా భాద్యత కలిగిన ఒక వాతావరణాన్ని create చెయ్యటమే మనం పని. ఇంకా ముఖ్యముగా తల్లితండ్రులలో కలిగే అసహనం, అసూయ, చిరాకు, ఒత్తిడి ఇంకా కోపం లాంటివి పిల్లలు చూడకూడదు. అప్పుడు పిల్లలు అధ్బుతంగా వికసించడం, మనం చూస్తాము ఎందుకంటే మనం ఈ పద్ధతికి ప్రాముఖ్యం ఇస్తే, ఫలితాలు అవే వస్తాయి. ఒకవేళ మనం ఫలితం మీద దృష్టి పెట్టి, పద్ధతిని పక్కన పెడితే, మనం కోరుకుంటున్న ఫలితం ఒక కలలాగే మిగిలిపోతుంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top