Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పిల్లల్లో పుస్తకాలు చదవటం అలవాటు చేయండిలా - how to guide a child reading books - megaminds

నేడున్న పరిస్థితుల్లో ఇంటర్నెట్‌లు, టీవీల వల్ల పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటే లేకుండా పోతోంది. టీవిలు, కంప్యూటర్లు, అంతర్జాలం వల్ల వి...


నేడున్న పరిస్థితుల్లో ఇంటర్నెట్‌లు, టీవీల వల్ల పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటే లేకుండా పోతోంది. టీవిలు, కంప్యూటర్లు, అంతర్జాలం వల్ల విషయాలు తెలుస్తాయేమోగానీ జ్ఞానం పెరగదు. అందుకు పుస్తకాలు చదవడం ఒక్కటే మార్గం. పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే ఉంది.
 
పుస్తక పఠనం అన్నది మంచి అలవాటు. ఈ రోజుల్లో బాల సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పిల్లల కోసం విజ్ఞానపరమయిన, వినోద ప్రదమయిన ఎన్నెన్నో పుస్తకాలు వెలువడుతున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా మాస పత్రికలు ముద్రితమవుతున్నాయి. దినపత్రికలు, వారపత్రికలలో కూడా పిల్లలకంటూ ప్రత్యేకంగా ఒక శీర్షికను నిర్వహిస్తున్నారు. మంచి సాహిత్యాన్ని చదవడం వల్ల పిల్లలకు మానసిక వికాసమేకాక, నూతన విషయాలు తెలుస్తాయి. బాల్యం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు పుస్తకాలను చదివే అలవాటు చేయాలి. పుస్తకాలు చదువుతూ కాలాన్ని సద్వినియోగం చేయడం అలవాటు చేయాలి. పుస్తకాలు చదవడం వల్ల ఎంత ప్రయోజన ముంటుందో పెద్దలు బోధించాలి.
 
పఠనాసక్తి పెరగాలంటే: వీలైనంతవరకు పిల్లలకు అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచుతుంటే, వాటిని చూడాలన్న, చదవాలన్న కుతూహలం వారికి కలుగుతుంది. మొదట్లో ఎక్కువగా బొమ్మలుండే పుస్తకాలయితే వారికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. బొమ్మల్ని చూపించి, కొద్దిగా కథ చెప్పి వదిలేస్తే, ఆపైన వారే వాటిని చదవటం ప్రారంభిస్తారు. కథలు, కామిక్స్‌ పుస్తకాల్ని పెద్దవాళ్లే పెద్దగా చదివి, పిల్లలకు వినిపిస్తుంటే వారికి ఆసక్తి పెరుగుతుంది. పిల్లలు నిద్రపోయే ముందు కథలు వినేందుకు ఇష్టపడతారు. అలా కథలు చదివి వినిపిస్తూ ఉంటే, కొన్నాళ్లకు వారికీ అది అలవాటై పోతుంది. ఆ తర్వాత వాళ్ళే స్వయంగా చదవటం మొదలు పెడతారు.
 
ఎదిగే వయసులో: ఎదిగే పిల్లలకు ఒక్కో వయస్సులో ఒక్కో రకం పుస్తకం అవసరం. ప్రారంభంలో బొమ్మలున్న కథల పుస్తకాలతో మొదలుపెట్టి, ప్రపంచ నాగరికతలు, వింతలు, శాస్త్రవేత్తలు, పరికరాలు, సాహసగాథలు ఇలా ఒక్కోరోజు ఒక్కో కొత్త విషయాన్ని తెలిపే పుస్తకాలను చదివించాలి. అలా చదివించి, పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. వారి మనసులకు ప్రపంచాన్ని అర్థంచేసుకునే విధంగా ఆసక్తి కలిగించాలి. సమాజం పట్ల, మానవ సంబంధాల పట్ల తగిన విషయ పరిజ్ఞానం, సృజనాత్మకత పెంచాలి. పిల్లల కోసం ప్రస్తుతం అనేకరకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది అవసరమో? ఏది అవసరం లేనిదో? ఎంపికచేసి పిల్లలకు ఇచ్చి, వాటిని చదివించేలా చూసే బాధ్యత పెద్దవాళ్లదే. ఎందుకంటే వారు చెడు పుస్తకాల వైపుకు మళ్ళే అవకాశం కూడా ఉంటుంది.
 
పిల్లలతో చర్చించాలి: పిల్లలు చదివే పత్రికలు, కథలు, బొమ్మల పుస్తకాల గురించి వీలైనంతవరకు వారితో చర్చించి, వాటి గురించి వివరించాలి. చదివే అలవాటును నెమ్మదిగా వారిలో కొనసాగించాలి. వారి పుట్టిన రోజులకు, ఇతర సందర్భాల్లో మంచి పుస్తకాలను కానుకలుగా ఇవ్వాలి.
 
పిల్లలు చదువదగిన, విజ్ఞానాన్ని, మేధనూ, ఆలోచననూ, సృజనాత్మకతనూ పెంపొందించే పుస్తకాలను పిల్లలకు ఇవ్వాలి. పిల్లలకు ఏ విషయంలో అభిరుచి, ఆసక్తి ఉందో ఆ రకమయిన పుస్తకాలను వారి చేత చదివించాలి. కొన్ని పత్రికల్లో క్విజ్‌లు, వినోదం, విజ్ఞానం, తెలివితేటలకు సంబంధించిన విషయాలు ప్రచురిస్తున్నారు. ఆ విషయాలను చదివి, మనసులో పదిల పరచుకోవడమన్నది వారి అభ్యుదయానికి తొలిమెట్టు.
 
పాఠశాలలో పిల్లల కోసం లైబ్రరీ ఉంటుంది. అందులో పిల్లలకు ఉపయోగపడే ఎన్నెన్నో పుస్తకా లుంటాయి. విషయ పరిజ్ఞానాన్ని పెంచే, ప్రముఖుల ఆదర్శ జీవితగాథలను తెలిపే అటువంటి పుస్తకాలను చదివి, వారిని ఆదర్శంగా తీసుకునే పిల్లలు భవిష్యత్తులో ఇతరులకు మార్గదర్శకులవుతారు.
 
బాలభారతం, బాలరామాయణం లాంటి రంగు రంగుల బొమ్మలతో ముద్రించిన పుస్తకాలు పిల్లలలో భక్తిభావాన్ని ఏర్పరుస్తాయి. అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్‌, వల్లభభాయ్‌ పటేల్‌, సుభాస్‌చంద్రబోస్‌, మహ్మాతాగాంధీ లాంటి ఎందరో దేశభక్తులను గురించిన పుస్తకాలు చదవటం వల్ల పిల్లల మనస్సులో దేశభక్తి పటిష్టమవుతుంది. మాత్రదేశం పట్ల మమతను పెంచుకుని, దేశ పౌరులుగా తమ వంతు కర్తవ్యాన్ని చక్కగా నేరవేర్చగలుగుతారు. ప్రముఖులు, ప్రసిద్ధ వ్యక్తులను గురించి తెలుసుకున్నప్పుడు వారు ఆ స్థితికి చేరుకోవటానికి ఎంతగా కృషి చేసినదీ, ఓటమిని గెలుపుగా మార్చుకోవటానికి ఎంత పట్టుదలగా వ్యవహరించి తమ గమ్యాన్ని చేరినదీ గ్రహించగలుగుతారు. అటువంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని, వారిని మార్గ దర్శనంగా తీసుకొని, ఆ స్ఫూర్తితో తాము అనుకున్నవి సాధించగలుగుతారు. తామూ ఉన్నత స్థితికి చేరుకోవా24న్న సంకల్పం, ఆ తపన వారి మనస్సులో బాల్యంలోనే ఏర్పడుతుంది.
 
పుస్తక పఠనంతో జీవిత లక్ష్యం ఏర్పడుతుంది. తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థితికి చేరుకోవ టానికి పట్టుదలగా కృషి చేయగలుగుతారు. పిల్లలు చదివే పుస్తకాలు వారికి మార్గదర్శకం కావాలి. ఒక కలం ఎంతటి బలాన్నయినా, మానసిక శక్తినయినా, ప్రోత్సాహాన్నయినా ఇవ్వగలుగుతుంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


No comments