ఆధునిక ఒత్తిళ్లకు కారణాలు:
టివి చూస్తూ భోజనము చేయడము, నీళ్ళు త్రాగడం
ఉదయాన్నే స్నానము చేయకపోవడం.
అసభ్యకరంగా బట్టలు వేయడము, మాట్లాడడం
నడవడిక లో "ఏం, మహాగా', ‘"చేస్తే తప్పేమి" అనే నిర్లక్ష్య ధోరణి పొగరుబోతు ధోరణి.
ఎప్పుడూ డబ్బు, సినిమాలు, రాజకీయాల గురించి మాట్లాడడము.
మన ఇంట్లో ఉన్న పెద్దలను సరిగా పట్టించుకోకపోవడం లేదా ఇంట్లో పెద్దవాళ్లు లేకపోవడం.
మన నడవడిక సక్రమంగా లేకపోవడం.
నడుస్తూ లేదా పరుగెత్తుతూ తినడం, తినడం కంటే ఎక్కువగా క్రిందపారేయడం అనవసరంగా ఖర్చు చేయడం.
ప్రకృతి నియమాలు విరుద్ధంగా పగలు నిద్ర పోయి రాత్రి పనిచేయడం గొప్ప అని భావించడం.
డబ్బు సంపాదించడం, ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం.
పాపము చేయకూడదు అనే భయము పోయి, నా ఇష్టం నేను ఎలా ఉంటే మీకేమిటి? చూడండి మేము ఉండేదే ఈ విధంగా అనే ధోరణి పెరగడం .
త్యాగము, సంయమనము (ఇంద్రియనిగ్రహము) లేకపోవడం.
భోగము విశృంఖలత్వమే ఉదాత్త సంస్కృతి అనుకోవడం.
వ్యక్తి స్వాతంత్ర్యము పేరుతో తప్పులను, వికృతులను సమర్థించే కోర్టులు, అవే సరియైనవని తీర్పు చెప్పడము.
స్వలింగ వివాహము, విడాకులివ్వడము లాంటివి.
అధికారంలోనున్నవారే సర్వజ్ఞులు, సర్వశక్తిమంతులు అనే భావమువల్ల మంది మాగధుల చెంచాగిరి అందరిలో వస్తుంది.
అనుభవము వలన తప్పు అని తెలిసినా, నేనొక్కడినే వేరుగా ఎందుకు కన్పడాలి? అని ఆలోచించడం.
అనవసరమైన విషయాలకు ప్రాధాన్యమివ్వటం ఉదా (విలాసాలకు సమావేశాలకు, SEZ లను ఒప్పుకోవడం)
BRAND లకు ఖర్చుచేయడం.
దుబారా ఖర్చులు, అప్పులు చేయడం గౌరవమని భ్రమించడం.
ప్రపంచముండేది నా కొరకే, నా సుఖం కొరకే అనే ధోరణి.
విదేశీ వస్తువులన్నీ మంచివి అనే భ్రమ.
ప్రచారం పై ఆసక్తి జన్మదిన, వివాహము, చావులు వీటిని
ఆర్భాటంగా చేయడం.
Flex - Hoarding ల ద్వారా బహిరంగ ప్రచారము.
ఇషము లేకున్నా, ప్రముఖుల చిత్రమువేసే నెపముతో తమ చిత్రాన్ని ముద్రించుకోవడం.
ఎలాగైనా సరే నా పేరు పత్రికల్లోను, టీవిల్లోనూ వస్తే సార్ధక్యము అనే భావన పెరుగుతుండడం.
అందరినీ వారి ముందరే అనవసరంగా పొగడడము.
ఇతరుల లోటుపాట్లను ఎత్తి చూపించడము, దోషాలను ప్రచారముచేసే చెడు ప్రవృత్తి.
అందరికంటే ముందు నాకే తెలిసింది. నేనే ఇతరులకు సహాయము చేశాను' అనే భ్రమలో తిరుగుట.
పెద్దలకు, రాజకీయ నాయకులకు, సన్యాసులకు పెద్దహారము వేసి నిష్టాపరుడనని చూపించుకొనడం.
ఇతర కులాలవారిపై తిరస్కారము, కోపం, ద్వేషం ప్రదర్శించడం.
రాజకీయంగా అభిప్రాయభేదమున్నవారిని శత్రువులుగా భావించుట.
తమ ఆడపిల్లలు ఆధునికంగా ప్రవర్తించినా, కనిపించినా తాము శ్రేష్ఠులమనే భావము తల్లులలో కనపడటం.
ఇంట్లో మాతృభాషలో మాట్లాడక పోవడం టివి.సీరియల్ చూడడం. వృద్ధులు కూడా టివి. చూడటానికి అలవాటు పడడం వల్ల ఇంట్లో వాతావరణం చెడిపోతూంటుంది.