Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మహా భక్తురాలు అక్క మహదేవి - About Akka Mahadevi in Telugu - akka mahadevi biography in telugu

అక్కా మహాదేవి పన్నెండవ శతాబ్దపు శివ భక్తురాలు, కన్నడ కవి, సాధువు మరియు ఆధ్యాత్మికం (మ .1130-1160), వీరశైవ భక్తి సంప్రదాయాన్ని...

అక్కా మహాదేవి పన్నెండవ శతాబ్దపు శివ భక్తురాలు, కన్నడ కవి, సాధువు మరియు ఆధ్యాత్మికం (మ .1130-1160), వీరశైవ భక్తి సంప్రదాయాన్ని అనుసరించారు. ఆమె కర్ణాటకలోని ఉడుటాడిలో నిమల్శెట్టి మరియు సుమతి దంపతులకు జన్మించింది. అక్కా మహాదేవి యొక్క బాల్య జీవితం గురించి ఈ రోజు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఆమె కవితలు మరియు వచన, లయబద్ధమైన రచనల నుండి కలిసి ఉన్నాయి.
అక్క మహదేవి శివ భక్తురాలు. శివుడే తన భర్తగా భావించేది. చిన్నతనం నుండి తనని తాను పూర్తిగా శివునికి అంకిత మిచ్చింది. యుక్త వయస్సులో ఉన్న ”అక్క”ను ఒక రోజు ఒక రాజు చూశాడు. ఆమె చాలా అందంగా ఉండటం వల్ల పెళ్ళి చేసుకొవాలని భావించాడు. కాని అక్క అంగీకరించక పోవటం వలన, ఆ రాజు ”నీవు వివాహానికి అంగీకరించనిచో నీ తల్లి తండ్రులను చంపుతానని బెదిరించాడు”. అందువలన ఆమె రాజుని పెండ్లి చేసుకున్నా, అతనిని దూరంగా ఉంచేది. రాజు ఆమెను లోబరుచుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినా, ఆమె, ”నేను శివుడిని ఎప్పుడో పెండ్లాడాను, నిన్ను కాదు” అని తప్పించుకునేది. కొంతకాలానికి రాజుకి సహనం నశించింది. ఆమెను వశపరుచుకోటానికి ప్రయత్నించినా, ఆమె అతనిని తిరస్కరించి, ”నాకు వేరే చోట మరో భర్త ఉన్నాడు, అతను నా దగ్గరకు వస్తూ ఉంటాడు. నేను అతనితోనే ఉంటాను, నీతో ఉండలేను” అని చెప్పేది.
దీనిని రాజు సహించలేక, "ఇలాంటి భార్యతో ఉండి ఏం ప్రయోజనం? కనిపించని వేరే అతనిని పెళ్ళి చేసుకున్న భార్యతో ఎలా ఉండటం?" అని అనుకొన్నాడు. ఆ రోజుల్లో విడాకులు లాంటివి లేవు. అతనికి ఏమి చెయ్యాలో తోచలేదు. అందువలన ఆమెను రాజ సభకి తీసుకుని వచ్చి, సభను నిర్ణయించమన్నాడు. సభలో ఆమెను ప్రశ్నించగా, ఆమె వేరొకచోట ఉన్న తన భర్త గురించి మాత్రమే మాట్లాడింది. ఆమెకు ఇది 100% ఫూర్తి వాస్తవం, ఇదంతా భ్రమ కాదు.
సభలో ఉన్న ప్రజలందరి ముందు, ఆమె తన భర్త మరొక చోట ఉన్నాడని చెప్పటంతో, రాజు చాలా కోపగించుకున్నాడు. 800 సంవత్సరాల క్రితం, భారతదేశంలో ఉన్న రాజుకి ఈ విషయాన్ని తేలికగా అంగీకరించటం అసాధ్యం. ఆమె మనసులో ఏముందో కాని, సాంఘికంగా అది చిన్న విషయం కాదు. అప్పుడు రాజు "నీవు ఇంతకు ముందే వేరొకరిని పెండ్లాడినచో, నాతో ఏమి పని? వెళ్ళిపో!" అన్నాడు. "సరే!" అని ఆమె బయటకు నడవటం మొదలు పెట్టింది. ఆ రోజుల్లో, భారతదేశంలో ఒక స్త్రీ కి, తన భర్తను, ఇంటినీ వదిలి వెళ్ళాలనే ఆలోచనకు తావు ఇవ్వడమే చాలా కష్టం. కాని ఆమె అలా చేసింది. ఆమె అలా ప్రశాంతతతో, తేలికగా తనను వదిలి వెళ్ళగలగడం చూసిన రాజు తనలోని కోపం వల్ల హీనంగా, "నీవు ధరించిన వస్త్రాలు, నగలు నావే. వాటిని కూడా విడిచి వెళ్ళు" అన్నాడు. నిండు సభలో, 17, 18 సం.ల యుక్త వయస్సులో ఉన్న ఆమె, అన్నింటిని విసర్జించి, నగ్నంగా బయటకు వెళ్ళింది.
ఆ రోజు నుండి ఆమె బట్టలు ధరించటానికి నిరాకరించింది. దీనివలన సమస్యలు రావచ్చని, చాలామంది ఆమెను బట్టలు ధరించమని నచ్చచెప్పినా, జీవితాంతం ఆమె వివస్త్రగానే జీవించి, ఒక ఋషిగా గుర్తింబడింది. ఆమె చిన్నతనంలోనే మరణించినా, ఆ కొద్ది కాలంలోనే తన భక్తితో శివుని మీద కొన్ని వందల అద్భుత పద్యాలను రచించింది.
ఆమె భక్తి ఎలాంటిదంటే, ప్రతిరోజూ శివుడిని "శివా! నాకు ఎలాంటి ఆహారం అందకుండా చేయి. నేను ఆహారం తీసుకుంటే, నా శరీరం తృప్తి చెందుతుంది. నా వేదన ఏమిటో నా ఈ శరీరానికి తెలియదు. నేను నీలో ఐక్యం అవ్వాలని పడే ఈ తపన నా శరీరాన్ని కూడా పడనీ. అందువలన, ఏ ఆహారం నా వద్దకు రానీకు. ఎప్పుడైనా ఒకవేళ నా చేతిలోకి ఆహారం వస్తే, అది నా నోటిలోకి చేరేలోపే దానిని మట్టిలో పడవేయి. ఆ మట్టిలో పడినదానిని అవివేకినైనా నేను తీసుకునేలోపే, ఒక శునకము వచ్చి తీసుకుపోయేట్లు చేయి” అని అర్ధించేది. ఇదీ ఆమె ప్రతిరోజూ చేసే ప్రార్ధన!
ఇది ఆమె శివ భక్తి అయితే ఆమె  కర్ణాటక నుండి శ్రీశైలం వచ్చినట్లు అలాగే శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో మరణించినట్లు తెలుస్తుంది. శ్రీశైలంలో అక్క మహాదేవి గుహలు ఉన్నవి. ఇలాంటి భక్తులు భారతదేశంలో కోకొల్లలు..     భారతదేశం ఆధ్యాత్మిక సాదనా భూమి దేవతలు సైతం ఇక్కడ జన్మించాలని కోరుకున్న ఒకే ఒక భూమి భారతదేశం. జై హింద్ జై భారత్.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. I want information on following topics
    Talli aasiissulato deshabaktulinavaru
    Talli premato prapancha netalinavaru
    Biddalakosam tyagalu chesina tallulu
    Talli kosam txyagalu chesina pillali
    I want stories on these topics

    ReplyDelete