కుంభ మేళా స్నానం పాపలను హరించివేస్తుందా? - Kumbh Mela Bathing can cure sins? - Megaminds

0

కుంభ మేళా స్నానం పాపలను హరించివేస్తుందా?
గంగానది లో స్నానల హోరు. ప్రయాగలో కుంభమేళ. తమ పాపాలన్నీ పోతాయని ఓ నమ్మిక. ఒక కుష్టు రోగిని తన ఒళ్ళో తల పెట్టుకుని పడుకోబెట్టుకుంది ఓ ఇల్లాలు. స్నానానికి వెళ్ళిన వాళ్ళందరినీ ప్రాధేయపడుతున్నది. పాపం లేని ధర్మాత్ముడెవరైనా ఒక చెంబుడు నీళ్ళు గంగ నుండి తెచ్చి మా ఆయనపై పోయండి. ఆయన ఆరోగ్యవంతుడవుతాడు అంటూ మొర పెట్టుకుంటున్నది.
ఆవిడ మాటలు విన్న అందరూ స్నానం చేసి వెళ్తున్నారు. కానీ ఎవ్వరూ నీరు పోయటం లేదు. ఆమె హాతాశు రాలైంది. పాపాలు లేని ధర్మాత్ములు ఎవరూ లేరా? అంటూ విస్తు పోయింది. ఓ సామాన్య పౌరుడు ఆమె ఆవేదన చూసాడు. తాను సంగమం లో స్నానం చేసి వెంట తచ్చిన చెంబు నిండా నీళ్ళు తెచ్చి ఆ కుష్టు రోగిపై పోసారు. క్షణాలలో రోగం మాయమై ఆరోగ్యవంతుడయ్యాడు.
అది చూసినవారంతా ఈయనరా ధర్మాత్ముడని పొగడటం ప్రారంభం చేసారు. ఎందుకలా అంటున్నారని వారిని ఈ సామాన్యుడు అడిగాడు. పాపాలు లేని ధర్మాత్ముడవు కాబట్టి మీరు పోసిన నీటివల్ల ఆ రోగి బాగయ్యాడు, అన్నారు. ఆ సామాన్యుడు ఆశ్చర్యంగా మనం ఈ కుంబమేళా సంగమంలో మునిగితే పాపాలన్నీ దూరమవు తాయని పంతులు గారు చెప్పారు. అందుకే గంగలో మునిగిన నేను నీరు పోయటానికి సాహసించాను. మీరూ చేసారుగా మీకు అలా మీ పాపాలన్నీ ప్రక్షాలన అయ్యాయని మీకనిపించలేదా? అని అడిగాడు.
బుద్ది పరంగా పాటించటానికి, విశ్వాసానికి మధ్య ఇంత వ్యత్యాసం ఉంటుంది. కుంభమేళా స్నానం పాపహరణం అని చెబితే పరుగున వచ్చిన‌మనకు నిజంగా పాప రహితులం అవుతామనే విశ్వాసం మనకు లేదు. ఆ సామన్యడికి ఉంది. అందుకే వాడి చెంబులోని నీటికి ఆ శక్తి వచ్చింది. - మీ నరసింహ మూర్తి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top