Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర - About Sardar Vallabhbhai Patel in Telugu - MegaMinds

సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు ఉక్్కు మనిషి 1875 అక్టోబర్ 31 న నాడియాడ్ లోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి జావర్‌భాయ్ పటేల...

సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు ఉక్్కు మనిషి 1875 అక్టోబర్ 31 న నాడియాడ్ లోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి జావర్‌భాయ్ పటేల్ ఒక సాధారణ రైతు మరియు తల్లి లాడ్ బాయి ఒక సాధారణ మహిళ.
భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖపాత్ర పోషించిన సామాజిక, రాజకీయ నాయకుడు వల్లభభాయి పటేల్‌. స్వతంత్ర భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు మార్గనిర్దేశం చేసిన మహానీయుడు. ఆయనను ‘భారత దేశ ఉక్కు మనిషి’, ‘సర్దార్‌’ అని పిలుస్తారు. ‘సర్దార్‌’ అంటే నాయకుడని అర్థం.
మహాత్మాగాంధీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయే నాటికే వల్లభభాయి పటేల్‌ న్యాయవాదిగా పేరు గడించాడు. ఆ తరువాతి కాలంలో పటేల్‌ గుజరాత్‌ లోని ఖేడా, బొర్సాద్‌, బార్డొలిల రైతులను బ్రిటిష్‌ పాలకుల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా అహింసాపూర్వక శాసనోల్లంఘన ఉద్యమంతో సంఘటితం చేశారు. దీంతో ఆయన గుజరాత్‌లోని అత్యంత ప్రభావశీల నాయకులలో ఒకడయ్యారు.
పటేల్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకత్వానికి ఎదిగి 1934, 1937లో జరిగిన పార్టీ ఎన్నికలలో పార్టీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. క్విట్‌ ఇండియా ఉద్యమ ప్రోత్సాహం వంటి కార్యక్రమాలలో తిరుగుబాట్లు, రాజకీయ కార్యక్రమాలలో ముందంజలో ఉన్నారు.
భారతదేశ మొదటి గృహమంత్రి, ఉపప్రధానిగా పటేల్‌ శరణార్థుల కొరకు పంజాబ్‌, ఢిల్లీలలో సహాయ కార్యక్రమాలు నిర్వహించి దేశవ్యాప్తంగా శాంతి నెలకొల్పారు. 565కు పైగా సంస్థానాలను, బ్రిటిష్‌ వలస రాష్ట్రాలను కలిపి సమైక్య భారతదేశంగా మార్చే బాధ్యతలను ఆయన తీసుకున్నారు.
సైనిక బలాన్ని ఉపయోగించే స్వేచ్ఛతో దాదాపు అన్ని సంస్థానాలు భారత్‌ యూనియన్‌లో విలీనం అయ్యాయి. అప్పుడే ఆయనను అందరూ ‘ఉక్కుమనిషి’ అని కీర్తించారు. భారతదేశంలో ఆస్తి హక్కులు, స్వతంత్ర సంస్థల ప్రతిపాదకులలో పటేల్‌ ఒకరు.
భారతదేశ సమైక్యతకు మార్గం చూపినది సర్దార్‌ వల్లభభాయి పటేల్‌ బహుముఖ నాయకత్వం. ఆయన సుపరిపాలన భావనే ‘సురాజ్‌’. ఆ భావన స్వాతంత్య్రానంతర భారతదేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించింది. ఎప్పుడూ సమైక్య మంత్రమే జపించే ఆయన భారతదేశ రైతులను సమీకరించడం లోను, స్వాతంత్య్ర పోరాటంలోకి వివిధ కులాలను చేర్చడంలోను సాధనంగా మారారు.
పటేల్‌ చిన్నప్పటి నుండీ ఉక్కుమనిషే. మొదట్లో తాను బారిష్టర్‌ కావాలని కోరుకున్నాడు. కాని ఆ కల నెరవేరాలంటే ఇంగ్లండు వెళ్ళాలి. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన పటేల్‌ స్థితిగతులు ఇక్కడ కళాశాలలో చేరడానికే సరిపడవు. ఇక ఇంగ్లండ్‌ గురించి చెప్పే దేముంటుంది?
దృఢ సంకల్పం కలవారికి అడ్డంకులు అడ్డురావు. తన కలల సాకారానికి ఆయన ఒక మార్గం కనుగొన్నాడు. తనకు తానే బోధించుకున్నాడు. ఒక న్యాయవాద మిత్రుని దగ్గర పుస్తకాలు తెచ్చుకొని ఇంటివద్దనే చదివేవారు. వ్యవహార శిక్షణ కొరకు ప్రతివాదనలు జాగ్రత్తగా పరిశీలించడానికి న్యాయస్థానానికి వెళ్ళేవాడు. పరిక్షలలో విజయం సాధించి గోద్రాలో న్యాయవాద వృత్తి ప్రారంభించారు పటేల్‌. తదుపరి కాలంలో తనకు తగిన సామర్థ్యం ఉన్నప్పటికీ న్యాయవాద వృత్తిలోనే ఉన్న తన అన్న విఠల్‌భాయి మొదటగా ఇంగ్లాండ్‌ వెళ్ళేందుకు సహకరించడంలో ఆయన శీలం, కరుణ గమనించ వచ్చు. ఆ తదుపరి ఇంగ్లండ్‌ వెళ్ళిన వల్లభభాయి అక్కడ బారిస్టర్‌ ఎట్‌ లా పరీక్షలో ప్రథముడిగా నిలిచాడు.
సర్దార్‌పటేల్‌ స్వాతంత్య్ర పోరాటంలోకి రావడానికి స్ఫూర్తి మహాత్మా గాంధీ. ఆయనను పటేల్‌ గోధ్రాలో ఒక సమావేశంలో కలిశారు. అప్పటి నుండి పటేల్‌ గాంధీజీ కార్యక్రమాలను అనుసరించేవారు. వాటిలో చంపారన్‌ సత్యాగ్రహం ఒకటి.
1918లో ఖేడా వరదల్లో మునిగిపోయి, విధ్వంసం జరిగినపుడు పంటలు నష్టపోయిన రైతులు భారీ పన్నుల నుండి తమకు ఉపశమనం కల్పించాలని బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఫలితం దక్కలేదు. గాంధీజీ ఆ పోరాటంలో పాల్గొన్నప్పటికీ పూర్తి దృష్టి పెట్టలేకపోయారు. తన స్థానంలో రైతుల కొరకు పోరాడే వ్యక్తికోసం గాంధీజీ అన్వేషిస్తుండగా సర్ధార్‌ ముందుకు వచ్చారు. ఆయన ఎప్పుడూ ఏ పనీ అర్థమనస్కంగా చేయలేదు. అందుకే మొదటగా తనకు అత్యధిక ఆదాయం ఇస్తున్న న్యాయవాద వృత్తిని కూడా త్యజించి ఖాదీ ధరించి సహాయ నిరాకరణోద్యమంలోకి పాల్గొన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం సర్ధార్‌తో చర్చలకు అంగీకరించి పన్నులను తగ్గించడంతో పోరాటం ఘన విజయం సాధించింది. అప్పటి నుండి ఈ భారత భూపుత్రుడు వెనుకకు తిరిగి చూడలేదు.
అహ్మదాబాద్‌కు పరిశుభ్రమైన, ప్రణాళికాబద్ధమైన పరిపాలనకు మార్గం వేసిన సర్దార్‌ నగరంలో పెద్ద కార్యనిర్వాహక పాత్ర పోషించారు. స్వాతంత్య్రోద్యమంలోకి రాకముందు, న్యాయవాద వృత్తిలో ఉండగానే 1917లో ఆయన అహ్మదాబాద్‌ పారిశుద్ధ్య కమిషనర్‌గా ఎంపికయ్యారు. ఆ తరువాత 1922, 1924, 1927లలో అహ్మదాబాద్‌ మున్సిపల్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో అహ్మదాబాద్‌కు విద్యుత్‌ సౌకర్యం తీసుకొచ్చారు. కొన్ని ప్రముఖమైన విద్యాసంస్కరణలు కూడా జరిపారు.
1928లో ఖేడా సత్యాగ్రహం విజయవంతమైన తరువాత గుజరాత్‌ లోని బార్టొలి తాలూకా తీవ్ర ప్రకృతి వైపరీత్యాలకు గురైంది. అపుడు పటేల్‌ మరల రైతుల పక్షాన నిలిచారు. రైతులను సంఘటితం చేసి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా పన్ను చెల్లించవద్దని చెప్పి బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి వారి కఠిన పన్ను విధానంపై ఘన విజయం సాధించారు. ఆ తరువాత 1930 నాటి సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా ఆయన అరెస్టు అయ్యారు. విడుదల అయిన తరువాత 1931 కరాచి సభలో సర్దార్‌పటేల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆగష్టు 1942 కాంగ్రెస్‌ ప్రారంభించిన క్విట్‌ ఇండియా ఉద్యమం సందర్భంగా, అనేకమంది ఇతర స్వాతంత్య్ర నాయకులతోపాటు సర్దార్‌పటేల్‌ మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే అప్పటిదాకా మహారాజులు, నవాబుల పాలనలో ఉన్న 565 సంస్థానాలు తాము తమ రాజ్యాలకు బ్రిటిష్‌ పాలనకు ముందు లాగే స్వతంత్ర పాలకుల మవుతా మని భావించారు. భారత ప్రభుత్వం తమకు సమాన ¬దా ఇవ్వాలని వారు వాదించారు. కానీ సర్దార్‌ పటేల్‌ అంతర్‌ దృష్టి, వివేకము, దౌత్యనీతి కారణంగా ఆ చక్ర వర్తుల మనసు మారి భారత రిపబ్లిక్‌లో విలీనం కావడానికి అంగీకరించారు.
ముఖ్యాంశాలు
  • ఖేడా సత్యాగ్రహం, బార్డొలి తిరుగు బాటులలో బ్రిటిష్‌వారి మెడలు వంచారు.
  • 1922, 1924, 1927లలో అహ్మదాబాద్‌ మునిసిపల్‌ అధ్యక్షునిగా ఎన్నిక.
  • భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఎన్నిక
  • స్వతంత్ర భారత తొలి ఉపప్రధాని, హోంశాఖ మంత్రి.
  • స్వాతంత్య్రానంతర సమైక్య భారత నిర్మాత.
పటేల్ గాంధీజీతో చాలా అనుబంధం కలిగి ఉన్నాడు మరియు అతనిని, అతని అన్నయ్యగా గురువుగా భావించాడు. మహాత్మా గాంధీ తన అన్ని పనులలో ఆయనను ప్రోత్సహించారు. గాంధీజీ మరణం అతన్ని విచ్ఛిన్నం చేసింది. 1950 డిసెంబర్ 15 న అతను గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణ వార్త ప్రపంచమంతటా వ్యాపించింది. దేశం మొత్తం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది, రోజువారీ జీవితం నిలిచిపోయింది. కృతజ్ఞతగల దేశం ప్రియమైన నాయకుడికి కన్నీటి నివాళులర్పించింది. 1991 లో భారత ప్రభుత్వం భారత రత్న గౌరవాన్ని ప్రదానం చేసింది. ఒక ముఖ్యమైన విషయం సర్ద్దార్ కి గుబురైన్ మీసం ఉండేది స్వదేశీ ఉద్యమం లో జైలులో ఉన్నప్పుడు విదేశీ కత్తితో తన మీసం ను ట్రిమ్ చేయాల్సి వస్తుంది విదేశీ వస్తువు తన దేహాన్ని తాకరాదని స్వదేశీ కత్తితో తనకు ఎంతో ఇష్టమైన మీసాన్ని గీకేసారు అప్పటి నుండి మరలా ఎప్పుడూ మీసం పెంచలేదు ఇప్పుడు మనమంతా స్వదేశీ విషయం లో సర్దార్ ని ప్రేరణ గా తీసుకొని సాధ్యమైనంత స్వదేశీ వస్తువులే కొనే ప్రయత్నం చేద్దాం... జై హింద్...

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ
MegaMindsIndia

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..