Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

sant dnyaneshwar biography in telugu - సంత్ జ్ఞానేశ్వర్

జ్ఞానేశ్వర్ : ఈయన క్రీ.శ. 1275 వ సంవత్సరం లో మహారాష్ట్రలో ఆవె గ్రామం లో విఠలపంత్ కులకర్ణి, రుక్మాబాయి (రుక్మిణీ బాయి) దంపతులు కు జన్మించ...

జ్ఞానేశ్వర్ : ఈయన క్రీ.శ. 1275 వ సంవత్సరం లో మహారాష్ట్రలో ఆవె గ్రామంలో విఠలపంత్ కులకర్ణి, రుక్మాబాయి (రుక్మిణీ బాయి) దంపతులుకు జన్మించాడు. వివాహం అయిన కొలది కాలానికే విఠలపంత్ సన్యాసాన్ని స్వీకరించారు. అయితే విఠలపంతకు దీక్షనిచ్చిన రామానంద స్వామియే శాస్త్ర విరుద్దంగా సన్యాసాన్ని స్వీకరించావు.కాబట్టి మళ్లి గృహస్థాశ్రమాన్ని స్వీకరించమని విఠలపంత్ ని ఆదేశించాడు. తరువాత వీరికి వరుసగా నివృత్తి నాథుడు, జ్ఞాన దేవుడు, సోపాన దేవుడు అనే ముగ్గురు కుమారులు ముక్తాబాయి అనే కుమార్తె జన్మించారు.
సన్యాసం స్వీకరించి తిరిగి గృహస్థాశ్రమం లోకి వచ్చాక కలిగిన సంతానం కాబట్టి ఆ కుటుంబ స్నంతటినీ వెలివేశారు. కుల బహిష్కరణ చేశారు. వారికి ఉపనయనాదులు కూడా జరగలేదు. అయినా వీరందరూ పారమార్థిక చింతన కలిగినవారైనారు. విఠలపంత్, రుక్మిణీబాయి దంపతులు తాము ఆశ్రమ ధర్మాన్ని ఉల్లంఘించినందుకు ప్రాయశ్చిత్తంగా తమదేహాలను ప్రయాగ వద్ద త్రివేణీ సంగమంలో సమర్పించుకున్నారు.
నాథ సంప్రదాయ సిద్ధుడైన గహనీ నాథుని వద్ద నివృత్తి నాథుడు దీక్ష స్వీకరించి తరువాత అతడు జ్ఞానేశ్వరునకు ఉపదేశం చేసి దీక్ష ఇచ్చాడు. జ్ఞానదేవుడు వేదాధ్యయనం కోసం బ్రాహ్మణుల నాశ్రయిస్తే వారిని చూసి దున్నపోతు నీకు భేదం లేదని పరిహాసాలాడారు. అప్పుడు జ్ఞాన దేవుడు అవును నాకు దానికి తేడా లేదని చెపుతూ దున్నపోతు తగిలిన దెబ్బలు తనకు తగిలాయని, దున్నపోతు కూడా నా వల్లే వేదాలు వల్లిస్తుందని దాని చేత వేదాలు పలికించి భగవంతుడిని జీవరాశులు సమానం గానే సృష్టించాడు చెప్పాడు.
జ్ఞానదేవుడు అసామాన్య శక్తిమంతుడని లోకవిదితమైంది. జ్ఞానదేవుడు సోదరుల మహిమలు సంబంధించిన అనేక గాథలు మహారాష్ట్ర మంతటా బహుళ ప్రచారంలో ఉన్నాయి. జ్ఞానేశ్వరుడు సాధించిన యోగసిద్ధి వలన సమాజం అంతా జ్ఞానేశ్వరునివైపు ఆకర్షితమైంది. సంత్ జ్ఞానేశ్వరుడు భగవద్గీతలో 770 శ్లోకాలు సరళమైన మరాఠీ భాష లో వ్యాఖ్యానం వ్రాశాడు.
మరాఠీ భాషలో గానానుకూలమైన ఓవీ ఛందస్సు 2000 ఓవీలలో మృదుమధురము సర్వసులభమైన భాషలో రచించాడు. ప్రసన్న, గంభీరభావాలతో ఇది భావార్థదీపిక గా వెలుగొందిన ది. భగవద్గీత పై దేశ భాషలలో వ్రాసిన వ్యాఖ్యానాలు ఇదే మొట్టమొదటిది. ఇది జ్ఞానేశ్వరి గా లోకి పొందింది. తర్వాత సర్వోపనిషత్సారంతో స్ఫూర్తివాదాన్ని ప్రతిపాదిస్తూ అనుభావామృతం (అమృతానుభప్) హరిపాఠ కె అభంగ్, చాంగదేవపైసఠ మొదలగు గ్రంథాలను రాసి తన జ్ఞానాన్ని సమాజానికి సమర్పించుకున్నారు. అవేగాక వేలాది అభంగాలు కూడా రచించారు. జ్ఞానేశ్వరుడు ఈ రచనలు భారతీయ సంస్కృతి, ధర్మములందేగాక, భక్తి సాహిత్యం లో అద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది.
సంత్ జ్ఞానేశ్వరుని ప్రయత్న ఫలితంగా హిందూసమాజంలోని వర్ణాశ్రమ వ్యవస్థ లో ప్రవేశించిన దోషాలు, గుర్తులు ప్రక్షాళన చేయబడి సమరసత ప్రతిష్టి పించబడింది. 'సమత'' అనేది ఉచ్చస్వరమైంది. ప్రజలందరూ మృదువైన భక్తి సూత్రంలో బంధింపబడి మతాంతీకరణల ప్రమాదం నుండి రక్షింపబడ్డారు. దుర్గతిలో చిక్కుకుపోతున్న హిందువులకు తాను రాసిన గీత లో కర్మ యోగము ద్వారా చికిత్స విధానాన్ని సూచించాడు.
మహారాష్ట్ర ప్రాంతం లో వీరు చూపిన భాగవత ధర్మము లేదా భక్తి సంప్రదాయ మార్గాన్ని వరకరి సంప్రదాయమంటారు. దాన్ని సుదృఢం చేసి అవైదిక శక్తులను పరాజితులు గావించారు. ఇంతటి మహత్తర కార్యాన్ని సాధించిన సంత్ జ్ఞానేశ్వర్ కేవలం 22 సంవత్సరాల వయస్సులో పూనా వద్ద ఆలంది అనే ప్రదేశం లో సదేహ సమాధిని పొందారు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

1 comment

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..