sant tukaram biography in telugu - సంత్ తుకారాం

1
సంత్ తుకారాం : తన ఆరాధ్య దైవమైన విఠలేశ్వరుని కోసం జీవించిన మహాత్ముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా చెక్కుచెదరని ధైర్యశాలి. శివాజీ మహారాజు పంపిన మణులను, మాణిక్యాలు సైతం తృణీకరించిన మోహరహితుడు. అతడు వ్రాసిన అభంగాలు భారతీయ వాజ్మయానికే అమూల్య సంపద.
పూనా సమీపంలోని దేహు అనే గ్రామంలో క్రీ.శ. 1607 వ సం.లో బాల్లో, కనకాయీ అనే దంపతులు తుకారాం జన్మించాడు. తుకారాం బాల్యం నుండి దైవరాధనలో పాల్గొంటూ ఉండే వాడు. ఒకసారి మహారాష్ట్ర ప్రాంతంలో కరువు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు ఆకలి చావులు గురయ్యారు. తుకారాం కి జీవితం మీద విరక్తి కలిగి తనను తాను విఠలుని పాదపద్మాలకు సమర్పించుకున్నాడు. ఈయన దగ్గర ఉన్న ఏ వస్తువు నైనా అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే స్వభావం కలవాడు. ఒక రోజు తమ ఊరిలోని భండారీ గుట్టమీద గుహలో ఉన్న గుడిలో ధాలో నిమగ్నుడై కూర్చున్నాడు. భగవత్సాక్షాత్కారం కలిగింది.
మాఘ శుద్ధ దశమి రోజున స్వప్నంలో బాడాజీ చైతన్య అను సిద్ధపురుషుడొకడు దర్శనమిచ్చి రామకృష్ణహరి మంత్రాన్నుపదేశించాడు. అవకాశం దొరికినప్పుడల్లా ధ్యాన నిమగ్నమై కూర్చుంటున్నాడు తుకారాం, జ్ఞానేశ్వర్, నామ దేవ్ ఏకనాథ్ మొదలైన సాధుసంతులు రచించిన భజన కీర్తనలు అధ్యయనం చేస్తున్నాడు. అంతరాత్మకు ఎంతో శాంతి లభిస్తోంది. భండారీ గట్టు లోని గుహ లో నివసిస్తున్నారు. స్వయంగా కీర్తనలు వ్రాసి మధురంగా గానం చేస్తుండే వాగ్గేయకారుడు.
గురుకృప కోసం తల్లడిల్లిపోయేవాడు. ఒకసారి సాక్షాత్తు పండరినాథుడే స్వప్నంలో సాక్షాత్కరించిన తుకారాం తలపై చేయి పెట్టి నిమురుతూ సముదాయించేవాడు. ఒకరోజు సంత్ నామదేవ్ స్వప్నం లో కనిపించి అభంగ కావ్యము రచించాలని ప్రేరేపించారు. ఆ ప్రేరణతో తుకారాం ఏడెనిమిది వేల అభంగాలు రచించాడు. అంతరాత్మ నుండి పెల్లుబికిన భక్తిగీతాల వెల్లువ అది. ఆ విధంగా మరాఠీ భాష, దాని సాహిత్యం కూడా ఒక పెన్నిధిని సమకూర్చుకుంది.
ముంబాజీ అనే మంత్రతంత్ర గాడు, ధర్మాధికారి రామేశ్వర భట్టులు ఆదర్శ జీవితం గడుపుతున్న తుకారాం ను చూచి ఈర్ష్యపడి సర్పంచ్ దగ్గర లేనిపోని చాడీలు చెప్పి పంచాయితీ పెట్టి ఆ అభంగాలు నన్నిటి నీ ఇంద్రాయణీ నదిలో వేయించారు. దుఃఖంతో పరితపించాడు తుకారాం. అది ఆయన వస్తువు. ఆయనకు సమర్పించుకున్నాను అని సమాధానం పడ్డాడు. తర్వాత అభంగాలు రాసి ఉన్న తాళ పత్రాలు ఒక దాని వెంట ఒకటి తేలుతూ ఒడ్డుకు వచ్చాయి.
ఛత్రపతి శివాజీ మహారాజుకు గురువైన సమర్గరామదాసును చూపించిన మహా పురుషుడు. 'హిందూ సమాజం యొక్క నైతిక పతనాన్ని ఆపగలిగే లా ఉండాలి, భారత దేశం సర్వతోముఖ వికాసం చెందడానికి ఆలోచించాలి, అదే నా కోరిక-అది నాకు కానుక గా సమర్పించి' అని శివాజీని అడిగారు. వైరాగ్యం పొంది సన్యాస ప్రవృత్తి పెరిగిన శివాజీ కర్తవ్య పాలన కావించిన వ్యక్తి తుకారాం. తపస్సు కంటే కూడా కర్తవ్యం గొప్పది. కర్తవ్య పాలన సూచించని వ్యక్తికి మరణానంతరం కూడా సద్గతి లభించదు. కనుక నీరాజ్యాన్ని శక్తియుక్తులతో నేర్పుతో, నిర్వహించమంటూ కర్తవ్య బోద చేశారు.
తాను రాసిన అభంగాలు మధురంగా గానం చేస్తూ ప్రజల భక్తిభావాలను పెంపొందించారు. సంత్ జ్ఞానేశ్వరుడు రూపొందించిన భాగవత ధర్మ మందిరానికి తుకారాం కలశస్వరూపులు. వీరు తమ 41 వ ఏట ఇంద్రాయణీ నది తీరంలో భజన చేస్తూ చేస్తూ దేహంతో స్వర్గానికెళ్లారని ‘వరకరి' సంప్రదాయస్థుల నమ్మకం.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment
To Top