సాయణాచార్యుడు మరియు మాధవాచార్యుడు (విద్యారణ్యస్వామి) - about vidyaranya swami

1

సాయణాచార్యుడు మరియు మాధవాచార్యుడు: వీరు క్రీ.శ. 13, 14 శతాబ్దాల కాలము వారు. సాయణ మాధవులిద్దరూ సొంత అన్నదమ్ములు. తండ్రి మాయనుడు తల్లి శ్రీమతి. వీరిద్దరూ బహు శాస్త్రములో నిష్ణాతులు. శస్త్ర నిష్ణాతులు కూడా. సాయణ మాధవులిద్దరూ విద్యారంగము నందు, పాండిత్యము నందు మాత్రమే గాక రాజనీతి క్షేత్రమునందు కూడా అపూర్వము అనుపమానమైన రీతిలో కార్యాంకితం స్వధర్మము, స్వరాష్ట్రంలో రక్షణా కార్యమును వహించారు. సాయణాచార్యుడు నాలుగు వేదములు భాష్యమును వ్రాశాడు. వారు రాసిన భాష్యము వేదాధ్యయనం పరంపర పరిరక్షణకు ఎంతో దోహదం చేసిందనడంలో సందేహమేమాత్రము లేదు.
మాధవాచార్యులు, పంచదశి, ఉపనిషద్దీపిక, గీతాభాష్యం, సంగీత సారం,శంకర దిగ్విజయం మొదలగు పందొమ్మిది గ్రంథాలను రచించాడు. వీటిలో పంచదశి వేదాంత శాస్త్రంలో మిక్కిలి గౌరవస్థానాన్ని ఆక్రమించిన గ్రంథం శిరోధార్యమైన గ్రంథం. హంపిలో భువనేశ్వర్ మందిరం లో తపస్సు చేసాడు. తదనంతరం భగవదాజ్ఞయా అన్నట్లు స్వధర్మ సంరక్షణ కార్యాన్ని ప్రారంభించాడు.
ముస్లిముల దురాక్రమణ నుంచి హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని రక్షించడం కోసం హరిహర రాయలు, బుక్క రాయలు అనే పరాక్రమవంతులైన ఇద్దరు క్షత్రియ వీరులు మార్గదర్శనం చేసి దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్య స్థాపన చేయించాడు. కొంత కాలంపాటు మాధవాచార్యులు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. హరిహరుడు రాజ్యాన్ని విధ్వంసం చేయడానికి మహమ్మద్ బీన్ తుగ్లక్ ఢిల్లీ నుండి దండెత్తి వచ్చాడు, హరిహరుడు సైన్యం ఎంత వీరోచితంగా పోరాడి శత్రువులను ఓడించింది. క్రీ.శ. 1365 లో హరిహర రాయులు స్వరస్తుడైనాడు. వెంటనే బుక్క రాయలు విజయనగర సామ్రాజ్యానికి రాజైనాడు.
మాధవాచార్యులు బుక్క రాయనికి అతి తక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉండి ఆ బాధ్యతలు తన సోదరుడైన సాయన్నకప్పగించి తాను సన్యాసం స్వీకరించాలి. దీక్ష స్వీకరించిన మాధవాచార్యులు విద్యారణ్యస్వామి అయినాడు. జగద్గురు శంకరాచార్యులు స్థాపించిన శాస్త్రం శారదా పీఠానికి విద్యారణ్యస్వామి పీఠాధిపతి యైనాడు.
తరువాతి కాలంలో విదారణ్యులే కడప జిల్లాలోని పుష్పగిరి లో శారదా పీఠాన్ని స్థాపించారు. వేదభాష్యకారుడైన సాయణాచార్యుడు మహాపండితుడే కాక మహావీరుడు కూడా. హిందూ ధర్మ సంస్కృతి రక్షణ కొరకు సాయణ మాధవ .సోదరులు చేసిన కఠోర తపస్సు, కృషి, పరిశ్రమ వారి జీవన యజ్ఞమైంది. వారి విశిశ్టమైన వ్యక్తిత్వాలు భారతదేశ చరిత్ర లో మరపురానివి.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment
To Top