Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పచ్చబొట్ల సృష్టి కర్తలు మన వన వాసులు - tribal tattoos

బిల్లు జాతిలో స్త్రీలు పెళ్ళికిముందు పక్షి ఆకారపు పచ్చబొట్లు పొడిపించుకోవాలి. కళ్ళదగ్గర కణితి ప్రాంతంలో దీని పొడిపించుకుంటారు. ఇలా చేయటం...

బిల్లు జాతిలో స్త్రీలు పెళ్ళికిముందు పక్షి ఆకారపు పచ్చబొట్లు పొడిపించుకోవాలి. కళ్ళదగ్గర కణితి ప్రాంతంలో దీని పొడిపించుకుంటారు. ఇలా చేయటం వలన వారిలో ఒక విధమైన భద్రతా భావం పెరగడమే కాక శుభసూచకంగా కూడా భావిస్తారు. ఈ తేగ వారు మాత్రమే కటి వద్ద తేలు బొమ్మలు పొడిపించుకుంటారు. తాము చేసే మంచి పనులకు గుర్తుగా చనిపోయిన తర్వాత కూడా ఇవి ఉంటాయని వరి నమ్మకం. గోండు జాతి పురుషులు మోకాళ్ళ, మోచేతుల పైన పచ్చబొట్టు పొడిపించుకుంటారు. స్త్రీలు అయితే అన్ని అవయవాలు పొడిపించుకుంటారు. వీరికి జంతువులు, మనిషి బొమ్మలు వేయించుకోవడం ఇష్టం.
ఛత్తీస్గఢ్ ప్రాంత వనవాసి స్త్రీలకు పచ్చబొట్లు అంటేమక్కువ. వీటిని పొడిపించుకోవడంవల్ల అందమే కాకుండా ఆరోగ్య పదం అని భావిస్తారు. మోకాళ్ళ, మోచేతులు నొప్పులు తలనొప్పి తో పాటు నరాల సంబంధమైన వ్యాధులు కూడా పచ్చబొట్టు దివ్యమైన ఔషధంగా వారి భావిస్తారు. పక్షవాతం వంటి భయంకర వ్యాధుల బారిన పడకుండా పచ్చబొట్లు రక్షిస్తాయని వారు అనుభవ పూర్వకంగా చెబుతారు.
బుందేల్ ఖండ్ తెగ వారి నమ్మకం ప్రకారం స్త్రీ చనిపొయినప్పుడు ఆమె వద్ద మిగిలే ఏకైక ఆస్తి పచ్చబొట్టేనట. వారాంతం లో జరిగే సంతలు గ్రామ దేవతల పండుగలు, ఉత్సవాలలో ఈ పచ్చబొట్లు పొడిపించుకునే ఏర్పాట్లు ఎక్కువగా కనిపిస్తాయి. చిత్రమాల ఆకుల రసంతో మొదలైన ఈ పచ్చబొట్ల ప్రక్రియలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో వేరు వేరు పద్ధతులు తయారు చేసుకుంటారు. పాము చర్మం కాల్చి బూడిద చేసి దాన్ని అవిసె నూనె లో కలిపి పచ్చబొట్లు తయారు చేయడం ఒక పద్ధతి కాగా, పచ్చని ఆకులు, దొండాకు రసాన్ని తీసి దీపపుమసి లేదా కర్ర కాల్చగా వచ్చిన బొగ్గుమసిని కలిపేది మరో పద్ధతి.
సాధారణంగా స్త్రీలు ఈ పచ్చబొట్లు పొడవడంలో తర్ఫీదు పొంది, వీరే ఒకరికొకరు వేసుకుంటారు. ఈ పచ్చబొట్ల సాంప్రదాయం విదేశాలలో ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో గిరిజనులు అధికంగా కనిపిస్తుంది.
కేవలం గిరిజనులు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని తెగల్లో ఈ పచ్చబొట్లు పొడిపించుకోవడం సర్వసాధారణం అయిపోయినా నేటి ఆధునిక కాలంలో నొప్పి లేని కృత్రిమ పచ్చబొట్లు (టాటూస్) కూడా అందుబాటులో ఉన్న, మొత్తం మీద పచ్చబొట్ల సృష్టి కర్తలు మన వన వాసులు అన్నది చరిత్ర చెబుతున్న సాంస్కృతిక సత్యం.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia



జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

No comments