Page Nav

HIDE

Classic Header

{fbt_classic_header}

Top Ad

Popular Posts

Latest Posts

latest

మన్యం యోధుడు - మర్రి కామయ్య -Tribal Marri kamayya biography

భారత స్వాతంత్ర్య సమరంలో నిప్పురవ్వలై ఎగసి వడుతున్న పోరుబాటలో నేలకొరిగిన ఎందరో అగ్ని కెరటాలు న్నారు ఆ వీర చరిత్రలో విస్మరించబడిన గిరిజన వ...

భారత స్వాతంత్ర్య సమరంలో నిప్పురవ్వలై ఎగసి వడుతున్న పోరుబాటలో నేలకొరిగిన ఎందరో అగ్ని కెరటాలు న్నారు ఆ వీర చరిత్రలో విస్మరించబడిన గిరిజన వీరయోధులెందరో స్వాతంత్ర్యానంతరం కూడా పోరాటాలు కొనసాగించిన ఘన చరిత్ర లో మరొక గిరిజన పోరు బిడ్డ మర్రికామయ్య.
విశాఖ మన్యంలో సాగిన తెల్లదొరలదాడిలో అమరుడైన అల్లూరి సీతారామరాజు (1924) తర్వాత రెండవ మన్నెం వీరుడు గా ప్రసిద్ధికెక్కింది మరి కామయే. వీరి పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. కొండతెగకు చెందిన కామయ్య విశాఖపట్నం జిల్లా, పాడేరు రెవెన్యూ డివిజన్ లోని హుకుంపేట మండలంలో గరుడాపల్లిలో జన్మించారు. తీగలవలస పంచాయతీ లోని గరిడేపల్లి పరిసర గ్రామాల్లో భగత, కొండదొర, వాల్మీకి, సూకదొర, కొండకుమ్మరి తెగ గిరిజనులు నివసిస్తున్నారు. కామయ్య మోతుబరి రైతు స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఏజెన్సీ ప్రాంతాలలో కొనసాగుతున్న ఉద్యమాలే కామయ్యను ఉద్యమకారుడిగా మార్చాయి.
గిరిజనుల్లో అజ్ఞానం, దారిద్ర్యాన్ని తొలగించేందుకు మాడుగుల, అనంతగిరి మండలంలోని గ్రామాలు కొండజాతివారి సంఘాలు ఏర్పాటు చేసి బదులు నిర్వహించారు. జీవనోపాధి పనులు కల్పించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు కామయ్య చేసారు. ప్రజలు వ్యసనాలకు దూరంగా ఉండి, అణచివేతల నుండి విముక్తి చెందాలని కామయ్య బౌద్ధ మతాన్ని అనుసరించాడు. అది సహించలేని ప్రభుత్వం ముఠాదారులు ఏకమై గరిడేపల్లి గ్రామాన్ని తగులబెట్టారు. కామయ్య భూములను, పశువులను, ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి చాలా ఇబ్బందులు గురి చేశారు.
అప్పటినుండి అజ్ఞాతంలోకి వెళ్లిన కామయ్య కొండకోనల్లో తల దాచుకుంటూ ఉద్యమాన్ని కొనసాగించారు. తనను నమ్ముకున్న 360 కుటుంబాలను చేరదీసి గరిడేపల్లి. పరిసరాలలోని బీటుగరువు వద్ద వీరికి నివాసాలు ఏర్పాటు చేశారు. ఆ ఊరు కామయ్య పేటగా మారింది. కానీ బ్రిటీష్ పోలీసులు వారిని ఎలాగైనా అణచివేయాలని కుట్రపన్నిన ముఠాదారులతో కలిసి కామయ్య కుటుంబ సభ్యుల పై, అతని అనుచరులపై దాడులు చేసే వారు. చివరికి వారి గుడిసెలనుకూడా తగులబెట్టారు. కామయ్య కుటుంబం తో పాటు ప్రజలందరూ చెల్లాచెదురైపోయారు.
ప్రభుత్వ ముసుగులో ముఠా దారులు చేస్తున్న పాశవిక చర్యలను సహించలేని ప్రజలు కామయ్య నాయకత్వంలో మద్దతు దారులు గా చేరడంతో 50 దళాలు ఏర్పడ్డాయి. ఉబ్బేట్ రంగయ్య, డుంబేరి వీరన్న, జర్సింగి మంగన్న, కులబిర మోదును, బొడ్డు కొండలరావు, కంబిడి బాలన్న, గుల్లేనిపెద్దబ్బాయి 11 రోజులు జైలు జీవితం గడిపారు మర్రి దన్ను(కామయ్య కుమారుడు), రేగం భీంరావు, కొర్ర బాలన్న కంఠమచ్చ లు మొదలగు వారు కామయ్య కు ప్రధాన అనుచరుడు. ఎన్ని కుయుక్తులు పన్నినా కామయ్య అరెస్టు కాకపోవడం ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోయింది. అటవీ అధికారులు, పోలీసులు,ముఠాదారులు కలిసి 1940లో కామయ్యను బంధించారు.
విడుదలయ్యాక గ్రామాల్లోని వనవాసుల్లో ఆశించిన మార్పు రాలేదు. ప్రజలు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక షావుకారు వద్ద మోసపోవడం వారి సామాజిక వెనుకబాటు చూసి, తప్పనిసరిగా మళ్ళీ ఉద్యమించాల్సి వచ్చింది. ప్రభుత్వ నిర్భంధం పెరగడంతో మళ్ళీ కామయ్య అజ్ఞాతంలోకి వెళ్ళాను. నాటి తెల్లదొరల నుంచి పెత్తందార్లు వరకు అటవీ సంపదను కొల్లగొట్టడాన్ని జమిందారీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ అడవి పై అధికారం గిరిజనులు చెందాలని ఉద్యమించిన మన్నెం యోధుడు మర్రి కామయ్య. 1959 మే 5 న ఈయన మరణించాడు. గిరిజనులు ప్రతియేటా ఆయన వర్ధంతిని జాతర గా జరుపుకోవడం వారి వారసత్వ హక్కుల సంఘీభావానికి సంకేతం.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndiaజాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..