సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు - sri krishnadevaraya biography in telugu

megaminds
1
సామ్రాట్ శ్రీకృష్ణ దేవరాయలు



శ్రీకృష్ణదేవరాయలు :
విజయనగర సామ్రాజ్యానికి సామ్రాట్టు. క్రీ.శ. 16వశతాబ్దమువాడు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన తుళువ నరసరాజు పుత్రుడు. తల్లిపేరు నాగాంబిక, మహామంత్రి తిమ్మరుసు శిక్షణలో యుద్దవిద్యలలో ప్రావీణ్యతను సంపాదించాడు. బలమైన శత్రు సైన్యాలను ఓడించి రాజ్యాన్ని రథ, గజ, తురగ, పదాతి దళముల చతుర్విధ సైన్యాలతో పటిష్టం చేశాడు. యోగ్యుడైన పరిపాలకుడు. ప్రజారంజకుడు.
 
రాయల కాలంలో హంపిలోని వీధుల్లో జొన్నలు, బియ్యంలాగా రత్నాలు, వజ్రాలు, రాసులు పోసి అమ్ముతుండేవారని ప్రతీతి. రాయలయుగం స్వర్ణయుగంగా భాసిల్లింది. లలితకళలను పరిపోషించిన మహారాజు. సహజంగానే కవి, పండితుడు.సమరాంగణ సార్వభౌముడు కూడా.
అల్లసాని పెద్దన ఆసీనుడైన పల్లకిని మోసి కవిపండితులపట్ల గల గౌరవభావాన్ని ప్రదర్శించుకున్నాడు. స్వయంగా గండపెండేరాన్ని తొడిగి ధన్యుడయ్యాడు. 

శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం హంపిలోని విరూపాక్ష మందిరంలో జరిగింది.సాధుపురుషుడైన వ్యాసరాయలు విద్యానగరంలోనే ఉండి కృష్ణదేవరాయలకి మార్గదర్శనంచేస్తుండేవాడు. నాలుగు సంవత్సరాల వ్యవధిలో మూడు విజయయాత్రలు సాగించి సమయానుకూలంగా యుద్ధవ్యూహాన్ని అమలుపరుస్తూ విజయవాడ మొదలు తూర్పుతీరం వరకు గల కోటలనన్నిటినీ ఒకే ఛత్రచాడు క్రిందకు తీసుకువచ్చిన సార్వభౌముడు, గణపతులను ఓడించి వారితో బంధుత్వం పొంది రాజ్యాన్ని పటిష్టం చేయడం దేశరక్షణా ప్యూహంలో భాగమే.
 
రాయలు తాను చేసిన అనేక యుద్ధాలకు, ప్రజలు సంఘటితశక్తిగా రూపొందదానికి ప్రధానకారణం ధార్మికశక్తియే అని గ్రహించాడు. ధార్మిక సంస్థల సంరక్షణ కొరకు రాజ్యమంతటా వేలాది మందిరాలకు, ధర్మశాలలకు పెద్దమొత్తంలో దానం చేశాడు. రాజ్యమంతటా ధార్మిక జాగృతిని కల్గించాడు. రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించాడు, భువనవిజయమనే సభాభవనాన్ని నిర్మించి అష్టదిగ్గజకవులను పరిపోషించి సారస్వత వికాసాన్ని కలిగించాడు. పెద్దన వ్రాసిన మనుచరిత్రను అంకితం తీసుకుని స్వయంగా ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించాడు.
  
21సం.రాల పాటు రాజ్యపరిపాలన చేసి దక్షిణభారతదేశ చరిత్రలో అత్యంత క్లిష్టసమయంలో హిందూధర్మ సంస్కృతులను రక్షించి అభివృద్ధి చేసి సామాజిక జనజీవనం సుఖంగా సాగేలా పరిపాలించి జీవితాన్ని సార్ధకం చేసుకున్నాడు. మిగతా విషయాలు అందరికీ తెలిసినవే.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



Post a Comment

1 Comments
Post a Comment
To Top