Type Here to Get Search Results !

రమణ మహర్షి జీవితం - ramana maharshi life history in telugu


రమణ మహర్షి ఆధునికయుగంలో ఆత్మసాక్షాత్కారం పొందిన మహాపురుషులలో ప్రముఖుడు. వీరు తమిళనాడులో మధురైకి  40 కి.మీ. దూరంలో గల తిరుచులి అనే గ్రామంలో సుందరం అయ్యర్,   అలగమ్మాళ్ అనే దంపతులకు 30-12-1879 న జన్మించారు. తల్లిదండ్రులు ఇతనికి వెంకట రమణ అని పేరు పెట్టారు. బాల్యం అంతా సోమరితనం తోనే పూర్తయింది. ఒకరోజు సుబ్బారావు అయ్యర్ అనే అతిథి ద్వారా "అరుణాచలం" అనే ఊరు పేరు వినగానే అతనిపై సమ్మోహనశక్తి ప్రసరించినట్లయి ఆకర్షింపబడ్డాడు. అరుణాచలాన్నే తిరువణ్ణామలై అంటారు.
తమిళంలోని పెరియపురాణంలోని కులోత్తుంగ కవితలు ఇతని పై గాఢమైన ప్రభావాన్ని చూష లోతైన ఆలోచనల్లో మునిగిపోతుండేవాడు. “ఈదేహంలో ఉన్న నేను శరీరంలో ఉన్నాను. ఆ నేను అనేది ఆత్మ. అది శాశ్వతమైనది. దానికి నాశనం లేదు అనే అనుభూతి మెరుపుతీగలా మెరిసింది. ఆత్మసాక్షాత్కార జ్ఞానం లభించింది సాధనతోనే దేహాత్మభావం పూర్తిగా తొలగిపోయింది. కళాశాలలో రుసుము చెల్లించడానికిచ్చిన అయిదు రూపాయల్లో మూడు రూపాయలు తీసుకుని నేను ఈ అన్వేషణలో ఇల్లు విడిచి వెడుతున్నాను అని ఉత్తరం వ్రాసి మిగిలిన డబ్బులు కూడ అక్కడ పెట్టి 1896 ఆగస్టు 29న ఇల్లు విడిచి వెళ్లాడు. మధ్యలో విల్లుపురం. మాం.పట్, హరాయిణి నల్లూరు, కిలూరు గ్రామాల్లో మజిలీలు పూర్తి చేసుకుని తిరువణామలైలోని అరుణాచలేశ్వర మందిరానికి చేరుకున్నాడు. సన్యాసం స్వీకరించాడు.
అశాశ్వతమైన ఈ దేహాన్ని ఆడంబరంగా ఉంచడం ఎందుకు? అని కౌపీన దారణ చేసి సాధనలో మునిగిపోయాడు. మౌనవ్రతం పాటించేవాడు. ఈ యువసన్యాసి పలువురిని ఆకర్షించాడు. క్రమంగా ఆధ్యాత్మ జిజ్ఞాసువులు ఆయన చెంతచేర నారంభించారు. ప్రఖ్యాత పండితుడైన వాసిష్ఠ గణపతిముని వీరి అలౌకిక గుణగణాలను చూసి “భగవాన్” అని, “మహర్షి" అని సంబోధించారు. అప్పటినుంచి రమణమహర్షిగ లోక ప్రసిద్ధులైనారు. మహర్షి ఉపదేశాలు చేస్తుండేవారు.
ఒకసారి తల్లియైన అలగమ్మాళ్ పుత్రుని గురించి విని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడానికి వస్తే మౌనంలో ఉన్న రమణుడు కాగితం మీద ".... చాల విషయాలు మీరనుకున్నట్లుగా నెరవేరవు. మానవులందరికీ శ్రేయస్కర మార్గమేమిటంటే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవడమే" అని వ్రాసి ఇచ్చాడు. బాధలతో వచ్చిన అనేకమంది భక్తులకు రమణుల వద్ద శాంతి లభించేది. రమణులు తమ సాధనలో అన్నపానాలు, విశ్రాంతిని కూడా పట్టించుకునేవారు కాదు. వీరి శిష్యులు భక్తులు చొరవతీసుకొని తిరువణ్ణామలై కొండ పైన ఒక ఆశ్రమాన్ని నిర్మించి రమణాశ్రమమని పేరు పెట్టారు. దేశ, విదేశీ భక్తులతో రమణాశ్రమం ఒక సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
ఎఫ్. హెబ్, హంఫ్రీ పాల్ బ్రంటన్ మొదలగు విదేశీయులు కూడ వీరికి శిష్యులయ్యారు. మహర్షి ఇచ్చిన సందేశాలను గణపతిముని సమీకరించి సంస్కృతంలో "రమణవ్రాశారు. స్కృతంలో “రమణగీత"గా ఎవరు తప్పు చేస్తారో వారు క్షమాపణ అడగడం, క్షమాపణ అడిగిన క్షమించడం అనే ఈ రెండు మహరి దృష్టిలో అమూల్వగుణాలు. కరుణ మూర్తిభివించిన వ్యక్తి రమణమహర్షి, మనుషులతోపాటు పశుపక్షాదులు కూడా భారీ ఓడకు, పాత్రమయ్యేవి. ప్రతిరోజు స్వహసాలలో ఆశ్రమంలోని జీవరాసులకు భోజనము, మేత పెట్టేవారు. వాటికీ మనుషుల్లాగే కష్టసుఖాల అనుభూతులుంటాయని భగవాన్ దేశం డేవారు.
ఆశ్రమంలోని ప్రతి పనిలో స్వయం పాల్గొంటూ ప్రత్యేక వ్యవస్థ, నేడు పొయాల వంటివి లేకుండా అందరితో కలిసి సహపంక్తి భోజనం చేసేపోరు. కోకి సుశ్రూష చేయడం, ఆవుకు దహనసంస్కారం చేయడం పొరీ భూతదయకు పరిష. ఈశ్వర సందర్శనాభిలాషులై వచ్చిన భక్తులకు కొందరికి ఆ అనుభూతిని కలిగించాడు. ఆదిశంకరులు వ్రాసిన వివేక చూడాముడిని వీరు తమిళభాషలోకి అనువదించారు, కర్మ మరియు జ్ఞానం పరస్పరం వ్యతిరేకం కావు అని చెప్పిన వీరు ఆత్మ శాశ్వతం కాబట్టి అశాశ్వతమైన దేహం కోసం దుఃఖించడం తగదు అని శిష్యులకు భక్తులకు చెప్పి 1950వ సం.లో ఇహలోక యాత్ర చాలించారు. రమణాశ్రమం దక్షిణ భారత దేశంలో ఆధునిక తీర్థక్షేత్రంగా పేరుపొందింది. ప్రముఖ రచయిత, నాస్తికుడు,స్త్రీవాదియైన గుడిపాటి వెంకటాచలం కూడా వారి అవసాన కాలం రమణాశ్రమంలోనే గడిపి ధన్యుతననుభవించాడు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.