Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గోపబంధు దాస్ - about gopa bandhu das biography in telugu

గోపబంధు దాస్: ఉత్కళ ప్రాంతంలో (నేటి ఒరిస్సా) పురీ జిల్లాలో క్రీ.శ. 1872వ|| సం.లో జన్మించారు. వీరు గొప్ప కవి, రచయిత, ప్రముఖ పాత్రికేయు...



గోపబంధు దాస్: ఉత్కళ ప్రాంతంలో (నేటి ఒరిస్సా) పురీ జిల్లాలో క్రీ.శ. 1872వ||సం.లో జన్మించారు. వీరు గొప్ప కవి, రచయిత, ప్రముఖ పాత్రికేయుడు. దార్శనికుడు. సంఘసంస్కర్త. సమాజ సంఘటనా కుశలుడు. ప్రసిద్ద రాజకీయవేత్త. వీటినన్నిటినీ మించి ప్రఖర హిందుత్వవాదిగా, హిందూ సమాజహిత చింతకునిగా ఖ్యాతినార్జించాడు.
దేశస్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మాగాంధీ కంటే ముందు కాలంలో గాని అలాగే తరువాతికాలంలో కూడా ఒరిస్సాలోని నాయకులలో అగ్రస్థానంలో ఉండేవాడు. ఆయన అస్పృశ్యతా నివారణకు ఉద్యమాన్ని నిర్వహించడమే కాకుండా మహాత్మాగాంధీ హరిజనోద్దరణ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రేరణ నిచ్చారు. వారిరువురు కలిసి 'పురి' జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో గాంధీజీ అంగవస్త్ర ధారణ సంకల్పాన్ని తీసుకున్నారు.
గోపబంధుదాసుకు దీనజన పీడితజన సేవ చేయడం ప్రధానమైనది. తన కుటుంబంలో సంభవించే కష్టనష్టాలు అప్రధానమైనవిగా భావించేవారు.ఉత్కళ ప్రాంతంలోనే ఎంతో మంది ప్రజల అభిమానానికి ప్రశంసలకు పాత్రమైన గొప్పనైన సమాజ్ అనే పత్రికను ప్రారంభించింది గోపబంధు దాసే. వీరు ఆర్తజన సంరక్షణ కొరకు ప్రారంభించిన అఖిల భారతీయ లోక్ సేవక్ మండల్ యొక్క ప్రముఖ నిర్వాహకులు కూడా ఉన్నారు. 'ఉత్కళమణి'గా కీర్తిని, ప్రతిష్ఠను ఆర్జించారు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

No comments