గోపాలక్రిష్ణ గోఖలే జీవితం - gopala krishna gokhale biography in telugu

జననం: మే 9, 1866
భారతదేశానికి లభించిన వజ్రం, మహారాష్ట్ర ఆణిముత్యం గోఖలే అన్న బాలగంగాధర తిలక్ మాటలు అక్షర సత్యాలు. స్వాతంత్ర్య సమరయోధునిగా, నాయకునిగా, ఆర్థికవేత్తగా పలువురిని ప్రభావితం చేశారు గోఖలే. అంతటి ఉన్నత వ్యక్తిత్వం కలవారు కనుకనే మహాత్మాగాంధీ వంటివారు గోఖలే గారిని తమ రాజకీయ 'గురువు' గా పేర్కొన్నారు.
రత్నగిరి జిల్లాలోని (మహారాష్ట్ర) కోట్లుక్లో 9 మే 1886 వ సం||న గోఖలేగారు ఒక సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇంగ్లండ్ వెళ్ళి ICS (Indian Civil Services) చేయాలన్న సోదరుని మాటను కాదని జస్టిస్ రణడే శిష్యరికంలో భారతీయ అర్ధశాస్త్రాన్ని అభ్యసించారు గోపాలకృష్ణ గోఖలే, 1900 వ సం||లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన గోఖలేజీకి అక్కడ ఫిరోజ్షా మెహతా సహచర్యం లభించింది. 1902 వ సం||లో వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడైన గోఖలే భారత ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తతపై ఉపన్యసించిన తీరు పలువురిని ఆకట్టుకోవడమే కాక, ఆయనలోని ఆర్ధికవేత్తను పరిచయం చేసింది.
1905 వ సం||లో బెనారస్లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన గోఖలేనాటి ప్రసంగం నేటికీ అత్యుత్తమ ప్రసంగాలలో ఒకటిగా కీర్తించబడుతోంది. విదేశాలలో వున్న భారతీయ హక్కుల సాధన పట్ల గోఖలేగారు శ్రద్ద చూపేవారు. అటువంటి సమయంలో గోఖలేకి దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించిన గాంధీ పరిచయం అయ్యారు. వారి ఉద్యమానికి ఆయన పరిపూర్ణ మద్దతునిచ్చారు. తరువాత వారిద్దరి పరిచయం నిలబడి, గురుశిష్యుల బంధం కావడం జరిగింది.
భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్రపోషించిన గోపాలకృష్ణ గోఖలేగారు ఫిబ్రవరి-19-1915వ సంవత్సరంలో పరమపదించారు. బ్రిటిష్ భారత (ఆంగ్లేయ) ప్రభుత్వాలు గోపాలకృష్ణ గోఖలేని భారతదేశ తరపు ప్రతినిధిగా భావించాయి. భారతీయ, పాశ్చాత్య సంస్కృతుల మధ్య సమన్వయకర్తగా నిలిచిన గోపాలకృష్ణ గోఖలే తన తరంలోని యితర నాయకులకంటే భిన్నంగా వుండేవారు. ఆ విభిన్నా వ్యక్తిత్వమే గాంధీలాంటి వారిని ఆకట్టుకొని, వారిని 'తమ గురువు' గా భావించేలా చేసింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

Post a Comment

0 Comments