మదన మోహన మాలవీయ జీవితం - about madan mohan malaviya biography in telugu


మదన మోహన మాలవీయ: కాశీలో గంగానదీ తీరాన హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. మాలవీయగారి విస్తృత కార్యదక్షతకిది తార్కాణమని చెప్పవచ్చు. చేతిలో చిల్లిగవ్వ లేని ఒక సాధారణ వ్యక్తి కేవలం తన తపోశక్తి త్యాగశీలతలో, ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని నిర్మించగలిగాడు. వేలాది మంది యువకులైన విద్యార్థులలో జూతీయ భావాలు నాటుకునేలా చేశాడు.
పండిత మాలవీయ భారతీయులు ఆంగ్లేయులకు బానిసలై బ్రతుకుతున్న కారణాన స్వదేశ ప్రజలలో హిందూధర్మము, పరంపరాగతంగా వస్తున్న దేశ స్వాభిమానాన్ని జాగృతపరచే కార్యాన్ని స్వీకరించాడు. ఆయన జాతీయోద్యమ వాహినిలో కలవడంకోసం కాంగ్రెసు మరియు హిందూ మహాసభ అనే సంస్థల మాధ్యమంగా పనిచేసి తన సమయాన్ని సద్వినియోగము చేసుకున్నాడు. రాజకీయాలలో కూడా ప్రముఖస్థానాన్ని వహించారు. నేషనల్ కాంగ్రెసుకు రెండు పర్యాయములు అధ్యక్షులుగా కూడా ఉన్నారు.
తన చిత్తశుద్ది, నిజజీవితంలోని పవిత్రత, శ్రేష్ఠమైన నడవడిక, సాధుచరిత్ర, శ్రేష్టము, యోగ్యములైన వ్యక్తిత్వముతో ధనాన్ని సంగ్రహించి లోకోపకరమైన కార్యక్రమాలను ఆలోచించి ఆచరణలోకి ఉంచారు. అలా నిర్మించిందే కాశీ హిందూ విశ్వవిద్యాలయం, హైదరాబాదు నిజాం నవాబు దగ్గరకు వెళ్లి విరాళం అడిగినప్పుడు నిజాం రాజు "హిందూ విశ్వ విద్యాలయం నిర్మాణం కోసం నన్నే విరాళం అడుగుతావా?" అని చెప్పు విసిరాడు. మదన్ మోహన్ మాలవీయ ఆ చెప్పు ను చార్మినార్ దగ్గర ఇది నిజాం చెప్పు అని వేలం పెట్టారు.తన చెప్పు తక్కువ ధర పలికితే తనకే అవమానం అని నిజాం రాజే దానిని ఎక్కువ ధర చెల్లించి కొనుక్కున్నాడు.
కాశీ హిందూ విశ్వవిద్యాలయం
బాల్యం నుండి ధార్మికుడు భగవద్భక్తుడైన మాలవీయ ఒకసారిగా మంత్రాన్ని జపిస్తున్న సమయంలో విశ్వవిద్యాలయం నిర్మాణ సంకల్పం స్పురించి ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికే ఆవిధంగా యావచ్ఛక్తిని ధారవోసి సిగ్గు విడియాచన చేస్తూ విద్యాలయ నిర్మాణం తల పెట్టాడు. అందుకే అందరూ ఆయనను యూనివర్సల్ బెగ్గర్' మరియు MONEY MAKING MACHINE అని అనేవారు.
ఆధునిక పాశ్చాత్య విద్యావిజ్ఞానాలు, హిందూధర్మ సంస్కృతీ విజ్ఞానము స్వాభిమానము కలిగిన హిందూ యువకుల నిర్మాణానికి హిందూ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడానికి మాలవ్యాజీ సంకల్పించారు. దేశంలోని అనేక మంది రాజులవద్ద, జమిందారుల వద్ద, లక్షలు, కోట్లు, విరాళాలు సేకరించారు. గంగాజలం వలె పవిత్రము, నిర్మలమునైన శీలసంపన్నులు కావడం వల్ల వారి యాచన విఫలం కాలేదు. హిందూ సమాజపు సుఖదుఃఖాలతో వారు తాదాత్మ్యం చెంది హిందూ సమాజోన్నతికి, సముద్ధరణకు కృషి చేశారు.
1909లో లాహోరులోను, 1912లో ఢిల్లీలోను జరిగిన కాంగ్రెసు మహాసభలకు అధ్యక్షత వహించారు. వీరు స్థాపించిన హిందూ విశ్వవిద్యాలయంలోనే రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి ద్వితీయ సరసంఘచాలకులుగా బాధ్యతలు నిర్వహించిన ప.పూ. గురూజీ గోళవల్కర్ కొంతకాలం ఆచార్యులుగా పనిచేశారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మాలవీయ ఒక శిలాఫలకాన్ని ఏర్పాటుచేసి దానిమీద దేశహితం కోసం తాను ఆశిస్తున్న విషయాన్ని 89 శ్లోకాలలో చెక్కించారు. అందులో
గ్రామే గ్రామే సభాకార్యా | గ్రామే గ్రామే కథాసుధా |
పాఠశాలా మల్లశాలా | ప్రతిపర్వ సమాశ్రయాః ||
అనే ఈ శ్లోకం వారి ఆదర్శాలకు అద్దం పడుతుంది. భారతదేశం ముక్కలవడం ఆ సమయంలో హిందువులు హత్యలకు గురికావడం సింధునది హిందువుల రక్తంతో ప్రవహించడం వారిని ఎంతగానో కలవరపరిచింది. ఆ దుఃఖసాగరంలో వారు 1947లో స్వర్గస్తులైనారు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

Post a Comment

0 Comments