ఎవరెస్ట్ పైన కాషాయ జెండాని ఎగరేసిన స్వయంసేవక్


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త ఎవరెస్ట్ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ఎగురవేశాడు. మురాదాబాద్ పట్టణ సహ కార్యవాహ్ విపిన్ చౌదరి ఈ ఘనత సాధించాడు. చదువుతో పాటు పర్వతారోహణ పట్ల ఆసక్తి కలిగిన విపిన్ తన బృందంతో కలిసి మురాదాబాద్ నుండి ఏప్రిల్ 2న ఎవరెస్టు శిఖరారోహణ కోసం బయలుదేరి వెళ్ళాడు.
ఏప్రిల్ 3న ఖాట్మండు చేరాడు అదేరోజు విపిన్ మే 3న ఎవరెస్టు పర్వతారోహకుల కోసం ఏర్పాటు చేసిన తమ మొదటి స్థావరాన్ని చేరుకున్నాడు. తరువాత రోజు మే 4న తన మూడవ మజిలీ చేరుకున్న విపిన్, వివిధ ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని, అనేక అవాంతరాలు ఎదుర్కొని చివరికి మే 22న ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించాడు. ప్రపంచ ఎత్తైన ఎవరెస్టు శిఖరాగ్రాన కాషాయ ధ్వజంతో పాటు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఆర్ ఎస్ ఎస్ ప్రణాం చేశాడు.
Source: VSKTelangana

Post a Comment

0 Comments