Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

విశ్వకర్మ- about vishwakarma jayanti

విశ్వకర్మ : ఋగ్వేదంలో విశ్వకర్మ దేవస్వరూపుడుగా వర్ణించబడ్డాడు. ఇతడు సర్వకళలకు, శిల్పశాస్త్రములకు ఆదిగురువు. విశ్వకర్మ తన పాదాలతో స్వ...



విశ్వకర్మ : ఋగ్వేదంలో విశ్వకర్మ దేవస్వరూపుడుగా వర్ణించబడ్డాడు. ఇతడు సర్వకళలకు, శిల్పశాస్త్రములకు ఆదిగురువు. విశ్వకర్మ తన పాదాలతో స్వర్గాన్ని చేతులతో పృథ్విని నిర్మించాడు. ఇతడు దేవశిల్పి. సృష్టి కళానైపుణ్యానికి మూలవిరాట్, ప్రభాసుడను వసువు యొక్క పుత్రుడు. యోగసిద్ధి అతని తల్లి. ఇతని భార్య ప్రహ్లాదిని. సూర్యుని భార్య సంజ్ఞాదేవి ఇతని కుమార్తె. సుగ్రీవుని సైన్యంలోని నలుడను వానరుడు, విశ్వరూపుడను వారలు ఇతని కుమారులు.
విశ్వకర్మ దేవతలకు కావలసిన హర్యములను నగరములను, రథములను, ఆయుధములను, వివిధ వృత్తులు చేసుకొనుటకు పనిముట్లను సృష్టించిన విశ్వబ్రహ్మఇంద్రుని కోరికపై పాండవుల కొరకు ఇంద్రప్రస్థాన్ని, శ్రీకృష్ణుని ప్రార్థనపై డ్వారకా బృందావనాలను నిర్మించాడు.
విశ్వకర్మ కుమార్తె సంజ్ఞాదేవి సూర్యకాంతిని భరింపలేకుండుటచే ఆమె ప్రార్థన మేరకు సూర్యుణ్ణి సానబట్టాడు. ఆసమయంలో రాలిన చూర్ణంతో సుదర్శన చక్రమును తయారుచేశాడు. దధీచి వెన్నెముకతో వజ్రాయుధాన్ని రూపొందించాడు. శివుని త్రిశూలాన్ని తయారుచేశాడు. త్రిపురాసుర సంహారంలో శివుడుపయోగించిన రథం విశ్వకర్మ నిర్మితమైనదే.
గొప్ప హస్తకళా నెపుణ్యం గలవాడు. భూలోకవాసుల వృత్తి పనిముట్ల నిర్మాణస్రష్ట, విశ్వకర్మ ఘృతాచిల సంతానమే కంచరులు, వడ్రంగులు, కంసాలులుగా పిలువబడుతున్నారు. భారతదేశం లోని కార్మికులంతా విశ్వకర్మను ఇష్టదైవంగా పూజిస్తారు. భారతీయత భూమికగా పనిచేస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్ సెప్టెంబరు 17వ తేదీ విశ్వకర్మ జయంతిగా ప్రకటించి ఏటేటా భారత జాతీయ కార్మిక దినోత్సవం నిర్వహిస్తున్నది.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

No comments