నరేంద్ర మోడీ గారికి ఎందుకు వోట్ వేయాలి? Why We Should Vote For Modi?

megaminds
2

రైతుల పంటలకు మద్దతు ధర స్కీమ్ (Price Support Scheem) పెట్టారు మోడీ, మరియు Price Deficiency Scheem ద్వారా రైతులు నూనె గింజల పంటను మద్దతు ధరకన్నా తక్కువకు అమ్మితే, మిగిలిన సొమ్మును కేంద్రం నేరుగా రైతుకు చెల్లిస్తుంది
దేశవ్యాప్తంగా 22,000 గ్రామ సంతలను, వ్యవసాయ వ్యవసాయ మార్కెట్లుగా అభివృద్ధి చేసేందుకు, అక్కడి సదుపాయాలకు 2,000 కోట్లు కేటాయించారు మోడీ.
రైతులకు ట్రాక్టర్ల పంపిణీ, నిరుద్యోగులకు Thanq CM sir కార్లు, గేదెలు, గొర్రెలు పంపిణీ పధకాలకు సబ్సిడీ నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వానివే!
యూరియాకు వేప కోటింగ్ వలన యూరియా బ్లాక్ మార్కెట్ అరికట్టబడినది.
మత్స్య, పాడి పరిశ్రమలకు 2% వడ్డీ రాయితీ + గడువులోగా చెల్లిస్తే అదనంగా 3% వడ్డీ రాయితీ ఇస్తుంది కేంద్రం. అంటే వీరికి 5% పోగా 4% (పావలా వడ్డీ)కే రుణం దక్కినట్లవుతుంది. రీ షెడ్యూలుకు ఇదే రాయితీ వర్తిస్తుంది.
అధిక ఫలసాయం కొరకు 15 కోట్ల మంది రైతులకు Soil Health Cards ఇవ్వడం జరిగింది.
ఐదు ఎకరాలు లోపు ఉన్న రైతులకు సంవత్సరానికి ₹ 6,000 పెట్టుబడి సహాయం ప్రకటించారు నరేంద్రమోడీ.12 కోట్ల మంది చిన్న రైతులకు ఉపయోగం. ఇది 2018 డిసెంబర్ నుండి అమలవుతుంది.

ఉచితంగా ₹5 లక్షల ఆరోగ్య భీమా 50 కోట్ల మంది ప్రజలు "ఆయుష్మాన్ భారత్" ద్వారా అందుకుంటున్నారు!
ప్రధానమంత్రి జన ఔషది కేంద్రాలు 3,000 పైగా ఇచ్చింది కేంద్రం. వీటిలోని మందుల ధరలు 50% పైగా తక్కువ ధరకే లభిస్తున్నాయి. AMRIT ఫార్మసీల ద్వారా కేన్సర్, గుండె జబ్బులకు మందులు 60-90% తక్కువ ధరల్లో లభిస్తున్నాయి మోడీ ప్రభుత్వం వచ్చాకా!
 కిడ్నీ పాడయిన రోగులకు ప్రధానమంత్రి డయాలిసిస్ పధకం ద్వారా దేశంలో సుమారు 500 పైగా డయాలసిస్ యూనిట్లు డయాలిసిస్ రోగులకు సేవలందిస్తున్నాయి.
దేశంలో కొత్తగా అత్యంత అధునాతనమైన 20 AIIMS హాస్పటళ్ళను నిర్మిస్తున్నారు
 దేశంలో కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజీల్లో + పాత కాలేజీల్లో కలిపి మొత్తం 15,354 MBBS సీట్లను పెంచడం జరిగింది. అలాగే 12,646 P.G సీట్లను పెంచింది కేంద్ర ప్రభుత్వం.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నాణ్యమైన వైద్య సేవలకు వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటుకు 1600 కోట్లు కేటాయించారు. 2022 కల్లా 1.5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్ధాయి పెంచి, క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా చికిత్సలు అందచేస్తారు
ఐదున్నర కోట్ల మందికి రెండు లక్షల జీవిత భీమా ప్రయోజనం.
 గుండె జబ్బులతో బాధపడే సామాన్యులకు మేలు చేకూరేలా స్టంట్ ధరలను తగ్గించిన మోదీ ప్రభుత్వం.
సంవత్సరానికి 80 లక్షల మంది గర్భిణులకు వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారు.
రు.1,21,000 గా ఉన్న సగటు గరిష్ట స్టంట్ ధరప్రస్తుతం  రు.27,890. మోకాళ్ళ మార్పిడి చికిత్సలో ఉపయోగించే ఇంప్లాంట్ లు పరికరాల ధరల తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.
బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్లపై వడ్డీ పదివేలు దాటితే పన్ను కట్టాలి. ఇప్పుడు వడ్డీ 40,000 వరకూ పన్ను లేదు.
ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయడం.
7 PAY కమిషన్ ద్వారా గ్రామీణ్ ఢాక్ సేవాక్ పనిమంతుల జీతం పెంచడం.
గత 65 ఏళ్ళలో 12 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఇస్తే, నరేంద్ర మోడీ హయాంలో గత నాలుగున్నర సంవత్సరాలలోనే 13 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. వీటిలో 6 కోట్ల కనెక్షన్లు పేద మహిళలకు ఉచితంగా ఇచ్చారు. బడ్జెట్లో మరో 8 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు! మీ సోదరీమణులకు వచ్చిన ఉచిత గ్యాస్ కనెక్షన్ నరేంద్ర మోడీ గారు ఇచ్చినదే!
30 మిలియన్ల (30,000,000) నకిలీ గ్యాస్ కనెక్షన్ ఖాతాదారులు తొలగించబడ్డారు!
 కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోలు అమ్మే దేశాలకు పెట్టిన చమురు అప్పు 1,30,000 కోట్లు + వడ్డీ 40,000 కోట్లు = మొత్తం 1,70,000 కోట్ల రూపాయలు తీర్చినది మోడీ ప్రభుత్వమే! కాంగ్రెస్ ప్రభుత్వం Oil Bonds పేరుతో చేసిన అప్పు 2 లక్షల14 వేల కోట్ల రూపాయలు తీర్చినది మోడీ ప్రభుత్వమే! ఆయిల్ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలసిన సబ్సిడీలు 4,34,000 కోట్ల రూపాయలను ఇచ్చినది మోడీ ప్రభుత్వమే
దేశవ్యాప్తంగా 5,000 బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు. పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం కోసం వాహనాలకు కంప్రెస్డ్ బయోగ్యాస్.
ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా దేశంలోని పేదలకు 1 కోటీ 53 లక్షల ఇళ్ళు నిర్మాణం. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ కు 9 లక్షల 66 వేల ఇళ్ళు కేటాయింపు! మీ మిత్రులకు, బంధువులకు వచ్చిన ప్రతీ ఇల్లూ నరేంద్ర మోడీ గారు ఇచ్చినదే అంతేకాకుండా మధ్యతరగతి వారు 9 లక్షల గృహ రుణం తీసుకుంటే 4% వడ్డీ రాయితీ, 12 లక్షలు గృహ రుణం తీసుకుంటే 3% వడ్డీ రాయితీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం.
ఆదాయ పన్ను పరిమితి 5 లక్షలకు పెంచారు. [ 80c కింద 1,50,000, 80D, ప్రామాణిక తగ్గింపు (ఇది 50 వేలు), గృహరుణ వడ్డీ మొ.నవి అన్నీ కలిపితే 10 లక్షల ఆదాయం ఉన్నా పన్ను ఉండదు]
ఇకపై రెండు ఇళ్ళను సొంతంగా నివాసం ఉంటున్నట్లుగా చూపించుకోవచ్చును. ఇప్పటి వరకు ఒక ఇల్లే చూపించాలి. దానివల్ల మరింత పన్ను ఆదా!
ఇంటిని వ్యాపారాలు కోసం అద్దెకు ఇస్తే, అద్దె 1,80,00 దాటితే పన్ను కట్టాలి. అది ఇప్పుడు 2,40,000 కు పెంచారు. నెలకు 20 వేలు అద్దె వచ్చినా పన్ను లేదు.
OBC లకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఆదాయం అర్హత రూ .44,500 నుంచి రూ. 2.5 లక్షలకు పెంచబడింది.  SC విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఆదాయ అర్హత రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు పెంచబడినది
నెలకు ₹ 100 కడితే, వ్యక్తికి 60 సం. దాటాక ప్రతి నెలా ₹ 3,000 పెన్షన్ చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
SC, ST సంక్షేమానికి ₹ 76,800 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.
కార్మికుల ప్రమాదభీమా ₹ 1.5 లక్షలు నుండి 6,00,000 పెంచబడింది.
మాల్యా ఆస్తులను వేలం వేస్తున్నారు. ఇప్పటి వరకు 13,000 కోట్ల రూపాయల మాల్యా ఆస్తులను కేంద్రం జప్తు చేసింది. దావూద్ ఇబ్రహీం విదేశాల్లో ఉంచుకున్న దొంగ సొమ్ము, మన దేశంలోని అతని ఆస్తులను కూడా జప్తు చేస్తున్నారు! జాకీర్ నాయక్ అస్తులను కూడా కేంద్రం జప్తు చేస్తుంది.
భారతమాల-1 పధకం క్రింద 5,35,000  కోట్ల రూపాయలతో హైవేలను నిర్మిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
కాంగ్రెస్ పాలనలో 2013-2014 లో రోజుకు 12 కి.మీ. హైవేను నిర్మిస్తే, మోడీ పాలనలో 2017-18 లో రోజుకు 27 కి.మీ. హైవే ను నిర్మించారు.
సేతుభారతం ప్రాజెక్టు క్రింద 20,800 కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జిలను, వంతెనలు నిర్మిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం క్రింద 1,60,000 కి.మి గ్రామీణ రోడ్లను నిర్మించడం జరిగింది. 2013-14 లో 69 km/day అయితే, 2017-18 లో 134 km/day.
గత 30 సం.లలో 5 జాతీయ పోర్టులను నిర్మిస్తే, నాలుగు సంవత్సరాలలో 30 కొత్త పోర్టులను నిర్మించడం జరిగింది.
ఉద్యోగులకు 10 లక్షలుగా ఉన్న గ్రాట్యుటీని 20 లక్షలకు పెంచారు. ఒక సంస్థలో 5 సంవత్సరాలు పనిచేసి, రిటైరయినా, ఉద్యోగం వదిలివేసినా ఉద్యోగికి గ్రాట్యుటీ చెల్లించాలి.
ఇల్లు అమ్మినప్పుడు 2 కోట్లలోపు లాభం ఉంటే, దానితో రెండు ఇళ్ళలో పెట్టుబడి పెట్టి పన్ను మినహాయింపు పొందవచ్చు.
కేంద్రం పట్టణ స్మార్ట్ సిటీలను గుర్తించి, వాటి అభివృద్ధికి 2,01,979 కోట్లను అందచేస్తుంది. దీనివలన 10 కోట్ల పైచిలుకు ప్రజలకు ఉపయోగం.
దేశంలోని Start Up ప్రోత్సాహానికి  10,000 కోట్ల నిధిని కేటాయించడం జరిగింది. వారికి మూడు సంవత్సరాలు ఆదాయపు పన్ను లేదు మరియు అనేక ఇతర ప్రోత్సాహకాలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం.
జపాన్ సహాయంతో హై స్పీడ్ రైలు మనదేశంలో తయారవుతుంది. ప్రాజెక్టు ప్రారంభదశలోనే 20,000 మందికి ఉద్యోగాలు లభించాయి.
నోట్లు రద్దు వలన మూడు లక్షల కోట్ల నల్లధనం బ్యాంకులకు వచ్చి చేరింది. కొందరు ఏమి చేయాలో తెలియక 500, 1000 నోట్లు కాల్చిపారేసారు! తీవ్రవాదులు, నక్సలైట్ల వద్ద ఉన్న సొమ్ములు చిత్తు కాగితాలుగా మారిపోయాయి.
నలబై వేల నకిలీ NGO లను మూతబడ్డాయి. క్రైస్తవ మిషనరీలకు వచ్చిన సొమ్ముకు లెక్కలు అడిగి, లెక్కలు చెప్పని సంస్థలు అనుమతి రద్దు చేసారు!
మూడు లక్షల అరవై వేల డొల్ల కంపెనీల అనుమతి రద్దు చేసారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా పెంచొద్దన్న ఫైనాన్స్ కమీషన్ సిఫార్సులను కూడా పక్కన పెట్టి, రాష్ట్రాలకు పన్నుల్లో వాటాను 32% నుండి 42% కు పెంచారు మోడీ.
ప్రపంచ బ్యాంకు ప్రకటించిన Ease of Doing Business ర్యాంకుల్లో భారత్ కాంగ్రెస్ హయాంలో 142 స్ధానంలో ఉంటే, అది మోడీ హయాంలో 77 కు చేరుకుంది!
రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్ల కేటాయింపు. అవసరమనిపిస్తే అదనపు నిధుల కేటాయింపుకు సిద్ధం.
చైనా వాడు డోక్లాం నుండి దౌడు తీసాడు, ఎవరి వలన?
పాకిస్తాన్ వాళ్ళను, బర్మాలో ఉన్న తీవ్రవాదులను  "సర్జికల్ స్ట్రైక్" తో తెల్లారిగట్ల చప్పుడు లేకుండా మట్టు పెట్టారు. పుల్వామాలో సైనికులపై దాడికి బదులుగా పాకిస్తాన్ తీవ్రవాద స్ధావరాలపై దాడిచేసి సుమారు 350 మందిని హతమార్చారు.
పేద ప్రజలకు పది కోట్ల టాయిలెట్స్ (మరుగుదొడ్లు)
ఇరవై ఆరు రాష్ట్రాలలో, ఇరవై నాలుగు గంటలూ కరెంటు ఇస్తున్నారు మన మోడీజీ !
అంగన్వాడీ కార్యకర్తలకు మోడీ రాకముందు 2014లో జీతం: 4,200,  ఇప్పుడు (2018) : Rs.10,500. సహాయకులకు 2014 లో: 2,400, ఇప్పుడు: Rs.6,000
మెగా ఫుడ్ పార్కులు -- ఆంధ్ర.. తెలంగాణ.. పంజాబ్..హర్యానా..మహారాష్ట్ర.. తమిళనాడు రైతులకు ఉపయోగం..
దేశంలో పప్పుధాన్యాలు 2014 ముందు 1.5 లక్షల  టన్నులు నిల్వ ఉంటే, మోడీ వచ్చాక అది నిల్వ 20 లక్షల టన్నులకు పెరిగింది.
మోడీ ప్రధాని కాకముందు దేశంలో రెండే మొబైల్ తయారీ కంపెనీలు ఉండేవి. ఇప్పుడు ‌268 మొబైల్ తయారీ కంపెనీలు ఉన్నాయి. వీటివలన 3 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆదా! కంపెనీలలో సుమారు 10 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు.
ప్రధాన మంత్రి ముద్ర యోజన పధకం కింద దేశమంతటా 12 కోట్ల మంది చిన్నవ్యాపారులకు 7 లక్షల 23 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చాయి బ్యాంకులు. ఆంధ్రరాష్ట్రంలో “22,58,473“ మంది #ముద్రలోన్ పథకం ద్వారా #చిరువ్యాపారులు_లోన్ తీసుకున్నారు. (మే 2018 నాటికి).
స్టాండ్-అప్ ఇండియా : పధకం మహిళా/ ఎస్సీ / ఎస్టీ / ఒబిసి వ్యాపారవేత్తలకు రూ 1 కోటి వరకు రుణాలను అందిస్తుంది. ముద్ర & స్టాండ్-అప్-ఇండియా నుండి సంయుక్తంగా 9 కోట్లమంది మహిళలు లబ్ది పొందారు.
ఇప్పటి వరకూ దేశంలో కరెంటు లేని 18,000 గ్రామాలకు కరెంటు సదుపాయం కల్పించారు.
దేశంలోని పంచాయతీలకు నవంబర్ 2018 వరకూ సుమారు 43 కోట్ల LED బల్బులు ఉచితంగా ఇచ్చారు. మీ వీధిలో వెలిగే ప్రతి LED బల్బ్ మోడీ ఇచ్చినదే. 
2004- 2014 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భారత్ లో 52 ఉగ్రవాద దాడులు జరిగాయి. గత నాలుగున్నర సంవత్సరాలలో ఉగ్రవాదులు కాశ్మీరులో తప్ప, ఎక్కడా ఒక్క బాంబు దాడి కూడా జరగలేదు. 2018లో కాశ్మీరులో 260 మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చడం జరిగింది.
బాలికలపై అత్యాచారాలకు మరణశిక్ష సైతం విధించగల POSCO చట్టం చేసారు.
ప్రధానమంత్రి మాతృవందనం పధకం ద్వారా సంవత్సరానికి 50 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు Rs.6000 ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం.
మోడీ తెచ్చిన బ్యాంకు చట్టం వలన 2100 కంపెనీల నుండి 3,00,000 కోట్ల రూపాయల మొండి బకాయిలు బ్యాంకులకు వసూలయ్యాయి.
గత 4 సంవత్సరాల్లో 2,12,360 కోట్ల రూపాయల నల్లధనం కేంద్రం స్వాధీనం చేసుకుంది.
ఆడపిల్లలకు చదువు, ఆర్దిక స్వావలంబన కోసం పెట్టిన సుకన్య యోజన, పెన్షన్ రానటువంటి పేదల కోసం అటల్ పెన్షన్ యోజన వంటి పధకాలు కేంద్రానివే.
కాంగ్రెస్ 60 ఏళ్ళ పాలనలో సగటు ఎక్సైజ్ పన్ను 31 శాతం నుంచి 31.5% (ఎక్సైజ్ 12.5% + వాట్ 14.5% + సి.యెస్.టి 2%). ఇప్పుడు మొత్తం పన్నును 18% జి.యెస్.టి పరిధిలోకి తీసుకు వచ్చారు.
గత మూడేళ్లలో అక్రమాస్తులు కలిగి ఉన్న వారిపై ఐటీ శాఖ దాదాపు 30,000 దాడులు నిర్వహించింది. దాడుల్లో దాదాపు రూ.33,000 కోట్ల అక్రమ సొమ్ము పట్టుబడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇండియన్ ఆర్మీ కోసం ఇజ్రాయిల్ పద్ధతులను ఉపయోగించడం, అనేక అధునాతన ఆయుదాలను అందచేస్తుంది కేంద్ర ప్రభుత్వం.
సైన్యంలో వన్ రాంక్, వన్ పెన్షన్ క్రింద సవరణలు చేపట్టడం జరిగింది.
బిఎస్ఎన్ఎల్ విస్తరించడం మరియు ఆధునీకరించడం. ఎయిర్ ఇండియా కంపెనీని లాభాల బాట పట్టించడం.
ఎవరూ వినని విధంగా రష్యా, జపాన్, కెనడా, ఫ్రాన్స్ దేశాలతో విడి విడిగా న్యూక్లియర్ విధానాలల్లో ఒప్పందాలు చేసుకోవడం.
భారతదేశపు రైల్వేలను ఆధునీకరించి, లాభాల బాటలో నడపడం. రైళ్ళలో భద్రత కోసం CC Tv కెమెరాలు.
ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లు ఇచ్చారు మోడీ గారు.
గర్భిణి మహిళలకు చెల్లింపుతో కూడిన ప్రసూతి సెలవు 26 వారాల వరకు పొడిగించబడినది. ప్రపంచంలో అత్యధిక కాల వ్యవధిలో ప్రసూతి సెలవులను ఇస్తున్న దేశాల్లో భారత్ ఒకటి.
PMFBY పధకం ద్వారా 2017 సంవత్సరంలో 5 కోట్ల 71 లక్షల మంది రైతులకు రబీ & ఖరీఫ్ సీజన్లకు పంటలకు భీమా కల్పించడం జరిగింది.
దయాళ్ ఉపాధ్యయ  గ్రామ జ్యోత్ పథకం.
ఆస్ట్రేలియాతో యురేనియం ఒప్పందం.
ఇండొ-పాక్ సరిహద్దులలో సైనిక బంకర్ల నిర్మాణాలను పెంచడం.
ప్రపంచ దేశాలతో న్యూక్లియర్ వ్యతిరేక కవచపు ఛత్రం సృష్టించేందుకు ఒప్పందాలు.
2014లో 10 స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2017కు 6 స్థానానికి..
నాలుగు సంవత్సరాల క్రితం హోం లోన్లుకు వడ్డీ రేటు : 10.3%, ఇప్పుడు 8.65%.
మోడీ గారు మొదలుపెట్టిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశం రైల్వే ఇంజన్లు తయారుచేస్తుంది. ఇరాన్ మన దగ్గర 300 రైల్వే ఇంజన్లు కొంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో సరాసరి ద్రవ్యోల్బణం : 10.65%, మోడీ గారి పరిపాలనలో : 4.67%.
93 ప్రాజెక్టులకు 65 వేల కోట్ల రుణం: నాబార్డు.
ప్రధాన మంత్రి కృషి సించయి యోజన (పీఎంకేఎస్వై) కింద వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న 93 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులకు 65,634.93 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చేందుకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఆమోదం తెలిపింది.
గతంలో ప్రపంచ వ్యాప్తంగా కరెంటు కోతలు లేని దేశాల్లో 2014కి ముందు 99 స్థానంలో ఉన్న భారత్ నేడు 26 స్థానానికి ఎగబాకింది.
కాంగ్రెస్ హయాంలో LED బల్బు Rs.350 రూపాయలకు కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అదే కంపెనీ నుండి, అదే క్వాలిటీతో కేవలం Rs.40 కు LED బల్బులు కొంటున్నారు.
దేశంలోని పేదలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు 4 కోట్ల మంది ప్రజలకు ఇచ్చింది మోడీ ప్రభుత్వం.
కాంగ్రెస్ హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్ కు రూ12- 15. ఇప్పుడు బీజేపీ హయాంలో యూనిట్ కు రూ. 2/-.
జన ధన్ యోజన క్రింద దేశంలో 35 కోట్ల మంది ప్రజలకు బ్యాంకు అకౌంట్లు వచ్చాయి. ఖాతాల్లో 87,033 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు వచ్చాయి. దీనివల్ల మధ్యవర్తులు లేకుండా 431 పధకాల లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు నేరుగా జమ అవుతాయి.
ఛార్ ధామ్ పుణ్యక్షేత్రాలకు 900 కి.మీ. హైవేను నిర్మిస్తున్నారు.
ప్రపంచ ఆయుధ ఎగుమతిదారుల కూటమిలో భారతదేశానికి స్ధానం లభించింది. దానివలన మనదేశం ఆయుధాలను ఎగుమతి చేయవచ్చును.
ఆధార్ అనుసంధానం చేయడం వలన ప్రభుత్వ పధకాలలో నకిలీ లబ్ధిదారులను తొలగించారు. దానివలన 90,000 కోట్ల రూపాయలను ఆదా చేయడం జరిగింది.
ముస్లిం సోదరిలకు తలాక్ దారుణాలు నుండి విముక్తి కలిగించారు. ముస్లిం స్త్రీలు ఇప్పుడు పురుష సంరక్షకుడు లేకుండా హజ్ చేయగల అవకాశం కల్పించారు.
గత నాలుగున్నర సంవత్సరాలలో ప్రపంచ బ్యాంకు వద్ద ఒక్క రూపాయి కూడా అప్పు చేయని మోడీ ప్రభుత్వం.
నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఒక్క అవినీతి ఆరోపణా లేకుండా పాలన చేస్తున్నందుకు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


అందుకే ఇన్ని ఫలాలిచ్చిన భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకే నా వోటు. 

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

2 Comments
  1. Excellent Rooling and Administration of our BELOVED PRIME MINISTER Narendra Modi ji... Narendra Modi ji is ONLY ONE SOURCE to Develop our Nation Very Well..

    ReplyDelete
Post a Comment
To Top