Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మీ‌ మనసులో మాటను నాకు తెలియజేయండి- నరేంద్ర మోడి -Narendra Modi Letter

ప్రియమైన నా తోటి పౌరులకి. ఈ లేఖ రాయడం నాకు ప్రత్యేకమైన, పవిత్రమైన అవకాశం.. 2014లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అన్ని రాష్ట్రాల్లో సమస...


ప్రియమైన నా తోటి పౌరులకి.
ఈ లేఖ రాయడం నాకు ప్రత్యేకమైన, పవిత్రమైన అవకాశం..
2014లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అన్ని రాష్ట్రాల్లో సమస్యలు ఉన్నాయి. వాటి నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడానికి ప్రధాన సేవకుడిగా నన్ను గుర్తించి, గౌరవించి గొప్ప బాధ్యతను మీరందరూ అప్పగించారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా నీతి, నిజాయితీతో మీ అంచనాలను అందుకోడానికి కష్టపడి పని చేశాను.
సమాజంలోని దళితులు, పేదలు, అట్టడుగు, వెనుకబడిన వర్గాల కోసం నా ప్రభుత్వం ఆహార్నిశలు శ్రమించింది. మహిళలు, యువతకోసం, వారి ఆకాంక్షల కోసం పనిచేశాం. నేడు దేశంలో ఎక్కడ చూసినా స్వీయవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది.
గత నాలుగున్నరేళ్లలో 1.48 కోట్ల ఇళ్లు నిర్మించాం. దాదాపు 10 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేశాం. ప్రతి గ్రామానికి కరెంట్
అందించాము. ఇలా ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టాం. 2.5 కోట్ల కుటుంబాలకు మొదటి విద్యుత్
అనుసంధానం. 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా, యువతకు మంచి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాం. పొగ రహిత వాతావరణాన్ని కల్పించడం కోసం మహిళలకు గ్యాస్ కనెక్షన్లను ఇచ్చాం. అలాగే రైతన్నకు అండగా నిలిచి.. 15 రెట్లు కనీస మద్దతు ధర పెంచాం.
సంవత్సరానికి 12 కోట్ల చిన్న రైతులకు 6 వేలు. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ కింద 3 వేలు ఆర్థిక సాయం
ఆందించేందుకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. పతనమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి భారత్ ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మార్చాం . ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేశాం. ఈ ఆపూర్వ ఘన విజయం దేశంలోని ప్రతి భారతీయుడు గుండెను తాకింది.
ఆయుష్మాన్ భారత్, స్వచ్చ భారత్, డిజిటల్ ఇండియా, జన్ ధన్ యోజన వంటి అద్బుతమైన కార్యక్రమాలను ప్రారంభించాం. అందరి మన్ననలు పొందాం, మన సంక్షేమ పథకాలను ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకున్నాయి. ఎన్నో దేశాలు మన పధకాలను వారి దేశాల్లో అమలు చేయాలని చూస్తున్నాయి.
నాలుగున్నర సంవత్సరాలుగా ప్రపంచ వేదికపై భారత్ దాని ప్రతిబింబపు పురోగతిని చూసింది. భారతీయ సంస్కృతి
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. నేటి భారతదేశం కొత్త మార్గాలు, విధానాల దేశమని ప్రపంచం మొత్తం గ్రహిస్తోంది. ఇది బలమైన, నిర్ణయాత్మకమైన ఈ ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. ఇప్పటిదాకా చేసిన సంక్షేమం మీ అంచనాలను పెంచిందని నేను నమ్ముతున్నా ఇది నా అదృష్టం. దేశం కోసం ప్రతి వ్యక్తి అంచనాలు, ఆకాంక్షలను నెరవేర్చడం కోసం నేను ఎల్లప్పుడూ కొత్త శక్తితో ముందుకు వెళ్తుంటాను. భవిష్యత్తులో కూడా మీ ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇప్పటికంటే ఇంకా బాగా కష్ట పడాలని భావిస్తున్నా.
ప్రస్తుతం మనదేశం దిశను నిర్ణయించే సమయం వచ్చింది. మీ అంచనాలు, ఆకాంక్షలు, మీ సలహాలు సమస్యల్ని
పరిష్కరించే సమయంలో నా నిర్ణయాలని బలపరుస్తాయి. 2019కి నవ భారతదేశ మార్గం కీలక దశకు చేరుకుంది. అందుకే మీ నిరంతర మద్దతు కోరుతున్నా మీ మనసులోని మాటను తెలుసుకోవాలని భావిస్తున్నా మనం ఇంకా ఏం సాధించాలో నాతో మీ ఆలోచనలను పంచుకోండి. ముఖ్యంగా మొదటగా ఓటు వేయబోతున్న యువ స్నేహితుల మనసుల్లో ఏముందో తెలుసుకోవాలని
ఆసక్తిగా ఉన్నాను.
నమో యాప్ 6357171717 నెంబర్ కు కాల్ చేయడం, www.bharatkemanakibaat.com లో
లాగిన్ అవ్వడం ద్వారా నన్ను సంప్రదించవచ్చు. మీ ఆలోచనలు నూతన భారతదేశం
కలలను నెరవేర్చడంలో, మన ప్రభుత్వ ప్రణాళికలను రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

ఇట్లు,
మీ నరేంద్ర మోడీ

1 comment