Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సుశ్రుతుడి జీవితం - sushruta life story in telugu

సుశ్రుతుడు : ప్లాస్టిక్ సర్జరీకి పితామహుడు. శస్త్ర చికిత్స ఇతనితోనే ప్రారంభమైంది. ఇతడు క్రీ.పూ. 1000-600 సంవత్సరాల మధ్యకాలంలో జీవించి...



సుశ్రుతుడు : ప్లాస్టిక్ సర్జరీకి పితామహుడు. శస్త్ర చికిత్స ఇతనితోనే ప్రారంభమైంది. ఇతడు క్రీ.పూ. 1000-600 సంవత్సరాల మధ్యకాలంలో జీవించి ఉండవచ్చని ప్రముఖ చరిత్రకారులు హెనీవెర్, ముఖ్యోపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. సుశ్రుతుడు వ్రాసిన “సుశ్రుత సంహిత" క్రీ.శ. 800 సంవత్సరంలో “కితాబ్-షాఘాన్-ఎ- హింది”, కోలాట్-ఐ-సుశ్రుద్ అనే పేర్లతో అరబిక్ భాషలోకి అనువదింపబడింది. 101 రకాల శస్త్రచికిత్స పరికరాలను ఆరోగ్యకరమైన ప్రమాణాలతో ఉపయోగించాడు. తల వెంట్రుకను నిలువుగా కోయగల సూక్ష్మపరికరాన్ని కూడ ఇతడు ఉపయోగించాడు.
ఇప్పటి స్ప్రింగ్ ఫోర్ సెప్స్ తదితర ఆపరేషన్ పరికరాలకు అవే నాంది. మూత్ర నాళాలలో పేరుకున్న రాళ్లను తొలగించడంలో, కంటి శుక్లాలను అతి సున్నితంగ తీసివేయడంలో(operation) సుశ్రుతుడు మార్గదర్శకుడు. చెడు రక్తాన్ని తొలగించడంలో ఇతడు జలగను ఉపయోగించాడు. శస్త్రచికిత్సకు ముందు ఇతడు మత్తుపానీయాన్ని తాగించేవాడు. అదే ఈనాటి అనస్తటిక్స్ఆధారమైంది.
ఇతడు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ చనిపోయిన మానవ శరీరాన్నితెచ్చి దానిని కోసి అతడు ఏ కారణంగా చనిపోయాడో ఎన్నిగంటల క్రితం చనిపోయాడో కూడ చెప్పేవాడుట. దానినే ఈనాడు పోస్ట్ మార్టమ్ అంటున్నాము. సిజేరియన్ ఆపరేషన్ ను అతడు ఆనాడే కనిపెట్టాడు. కిడ్నీలలోని రాళ్ళను తొలగించడంలో విరిగిన శరీర భాగాలను అతికించడంలో, కంటి ఆపరేషన్ చేసి శుక్లాలను తొలగించడంలో దిట్ట, వాటికితడే ఆద్యుడు కూడ.

జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236

సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

No comments