చరకుడి జీవితం - charaka biography in telugu

0


చరకుడు: ప్రపంచంలోనే జెనెటిక్స్ తెలిసిన మొట్టమొదటి వైద్యుడు, చరకసంహిత అనే 120 అధ్యాయాల ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు. దీనిలో సూత్రస్థాన, నిదానస్థాన, విమానస్థాన, శరీరస్థాన, ఇంద్రియస్థాన, చికిత్సాస్థాన, కల్పస్థాన, సిద్దిస్థాన అనే శీర్షికలతో ఎనిమిది విభాగాలున్నాయి.
కాలు విరిగిపోతే ఇనుపకాలు వేసి వైకల్యాన్ని తొలగించవచ్చని నిరూపించాడు. గుడ్డితనం, పక్షవాతం, కుష్టు, మూర్చ, రాచపుండు. (కాన్సర్) మొదలైన జబ్బులకు నివారణోపాయాలను తెలిపాడు. ఈ గ్రంథంలో ఇతడు తెలిపిన అనేక విషయాలు ఈనాటికీ ప్రామాణికాలుగా నిలుస్తున్నాయి. ఆహారం జీర్ణమై శక్తిగా మారే విధానాన్ని ఈయనే సూత్రీకరించాడు. వాయు, పిత్త, కఫ దోషాలు. అనారోగ్యానికి మూల హేతువులని చెప్పాడు. త్రిదోషాలలో సమతుల్యత లోపించినపుడు రోగాలు ఏర్పడతాయని సిద్ధాంతీకరించాడు.
ఇప్పటి వైద్యులు సైతం అంగీకరించే రోగనిర్ధారణ (డయాగ్నోసిస్) వంటి విషయాన్ని ఇతడు ముందే తెలియజేస్తూ వైద్యుడు రోగి శరీరంలోకి జ్ఞానజ్యోతితో చూడగలగాలి. అప్పుడే వాయు, పిత్త, శ్లేష్మదోషాలపరంగా రోగనిర్ధారణ చేయగలుగుతాడు.రోగి జీవనపరిసరాలు, అనారోగ్య హేతువులు, ఇతర ప్రభావిత అంశాలను అవగాహన చేసుకోవాలి. చికిత్స కంటే రోగనివారణ ముఖ్యమైనది అని తెలియజెప్పాడు.
ఆధునిక వైద్యవిజ్ఞానమైన జెనెటిక్స్ కు సంబంధించిన ప్రాథమిక విషయాలను చరకుడు తెలియజెప్పాడు. శిశువులింగ జేదానికి కారణాలు. మానవ శరీరంలో 360 ఎముకలుంటాయని శరీర అంతర్భాగాల విధులను గురించి చెప్పాడు. ఇతడు చిన చరకసంహిత అరబిక్, లాటిన్ భాషలతోపాటు అనేక ఇతర విదేశీ భాషల్లోకి అనువదింపబడింది. ఇతడు క్రీ.పూ. 800 సంవత్సరాల కాలమునాటివాడు.

జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236

సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top