Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భాసురాచార్యుడు - bhaskaracharya biography in telugu

భాసురాచార్యుడు : జీవితాన్ని గణితశాస్త్రానికే సమర్పించుకున్న శాస్త్రవేత్త. ఇతడు కర్ణాటక లోని 'బిజ్జదబిడ' గ్రామంలో జన్మించాడు. ...



భాసురాచార్యుడు : జీవితాన్ని గణితశాస్త్రానికే సమర్పించుకున్న శాస్త్రవేత్త. ఇతడు కర్ణాటక లోని 'బిజ్జదబిడ' గ్రామంలో జన్మించాడు. క్రీ.శ.1114వ సంవత్సరంలో జన్మించాడు. అసాధారణ ప్రజ్ఞాపాటవాలు గల గణితశాస్త్రవేత్త. జ్యోతిషశాస్త్రంలో కూడ కాపు వైదుష్యం కలవాడు. ఈయన 30యేళ్ళ వయస్సులోనే “సిద్దాంత శిరోమణి" అనే గణితశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. దీనిని రెండుసార్లు పర్షియన్ భాషలోకి అనువదించారు.
ఆ తరువాత ప్రపంచంలోని ఎన్నో భాషల్లోకి అనువదింపబడింది. సిద్దాంత శిరోమణిలో అంకగణితము, బీజగణితము, గోళాధ్యాయము, గ్రహగణితము అనే నాలుగు అధ్యాయాలున్నాయి. అంకగణిత అధ్యాయమునకే కుమార్తె పేరు మీద “లీలావతి” అని పేరు పెట్టాడు. స్పియర్లు, హెమిస్పియర్లు అని చెప్పుకునే నేటి గణితశాస్త్ర విశేషాలు, గ్రహ గమనాలకు సంబంధించిన విషయాలు ఈ గ్రంథంలోని అధ్యాయాలలో వివరించబడ్డాయి.
ఏ అంకెనైనా సున్నతో విభాగిస్తే ఫలితం అనంతంగా ఉంటుందని మొదటిసారిగా ఈయనే చెప్పాడు. దశాంశ పద్దతిని కూడ ఈయనే తెలియజెప్పాడు. పాశ్చాత్యులు రూపొందించినవిగా చెప్పబడుతున్న డిఫరెన్షియల్ కాలిక్యూలస్ గురించి భాస్కరాచార్యుడు తన గ్రంథంలో ముందే చెప్పాడు.
ఇప్పుడు రోల్డెన్ ధీరమ్గా పిలవబడుతున్న “డిఫరెన్షియల్ కోషెంట్'గా పిలిచే విలువను ఆయన అప్పుడే ప్రస్తావించాడు. గ్రహ గమనాల గణనంలో ఈయనకు గల పరిజ్ఞానానికి ఈయన వ్రాసిన “తాత్కాలిక గతి” అనే గ్రంథమే తార్కాణం. సున్న విలువను ప్రపంచానికి మొట్టమొదటగా తెలిపిన బ్రహ్మగుప్తుని ఇతడు గురువుగా భావించేవాడు. ఈయన సున్న విలువను గురించి వివరిస్తూ ఒక సంఖ్య నుండి సున్నను కలిపినా, తీసివేసినా దాని విలువలో మార్పు ఉండదు. సున్నను సున్ననే గుణించినా భాగించినా సున్నయే వస్తుందని వివరించాడు.

జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236

సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

No comments