ముసునూరి నాయకుల గురించి మీకు తెలుసా ? - musunuuri nayakulu life


ముసునూరి నాయకులు : ముసునూరి ప్రోలయనాయకుడు ముసునూరి కాపయ నాయకుడు అనే ఇద్దరు మహావీరులను ముసునూరి నాయకులు అంటారు. ప్రస్తుతం కృష్ణాజిల్లా నూజివీడు దగ్గరలో ముసునూరు అని ఒక గ్రామం ఉంది అదే అయి వుండవచ్చు. చాలా కాలంవరకు వెలుగులోకి రాని చారిత్రక మహాపురుషులు వీరు. వీరు క్రీ.శ.14వ శతాబ్దమునకు చెందినవారు. వీరు ఆంధ్రప్రదేశ్ లోని కాకతీయ సామ్రాజ్యంలో సేనా నాయకులుగా ఉండేవారు. వీరు ఆంధ్రప్రాంతంలోని ముస్లిం పారిపాలనను కూకటివేళ్ళతో సహా పెకిలించి ఆవలపారేశారు.
మహమ్మద్ బీన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దాడి చేసి ప్రతాపరుద్రుణ్ణి యుద్ధంలో ఓడించి రాజధానీ నగరమైన ఓరుగల్లు (వరంగల్లు)ను తన హస్తగతం చేసుకుని దానిని సుల్తాన్ పూర్గా మార్చివేశాడు. యుద్ధంలో ప్రతాపరుద్రుడు ఆకస్మికంగా మరణించినందువల్ల హిందూ సమాజం నాయకత్వ విహీనమైంది. దిక్కుతోచక అంధకారంలో కొట్టుమిట్టాడుకుపోయింది. ఆ సమయంలో సేనాపతి ప్రోలయ ఆయన అన్న కుమారుడైన కాపయ సేనాని ఇద్దరూ కలసి సామంతరాజులను సంప్రదించి సామాన్య ప్రజానీకాన్ని కలసి ఒక సంఘటిత శక్తిని నిర్మాణం చేసి ఆ శక్తితో ముస్లిం పరిపాలకుల నెదిరించి రాజ్యం నుండి తరిమిగొట్టారు.
ముసునూరి నాయకుల ప్రయత్న ఫలితంగా భద్రాచలం సమీపంలోని రేకపల్లి రాజధానిగా హిందురాజ్యం రూపుదిద్దుకొంది. అక్కడ మళ్ళీ భగవాపతాక రెపరెపలాడింది. ముస్లింలు దక్షిణ భారతంలో ఇంకా ముందుకు సాగి వెళ్ళలేక పోయారు. అక్కడనే వాళ్ళకు అడ్డంకి ఏర్పడింది. అవరోధం కలిగింది. ముసునూరి సోదరులకు ఆంధ్రజాతీయ సంఘాన్ని స్థాపించడంలో వివిధ వర్గాలనుండి వివిధ వర్గాల నుండి సహాయం లభించింది. హిందువుల హృదయాలలో ఆత్మవిశ్వాసోదయమైంది.
ఆ రాజ్యంలో హిందూ ధర్మము పునః ప్రతిష్ఠింపబడింది. ప్రోలయ మరణానంతరం కాపయ ఓరుగల్లును కూడా విముక్తం చేశాడు. వీరి ప్రయత్నాల ఫలితంగానే అద్దంకి కేంద్రంగా మరో హిందూరాజ్యం నిలదొక్కుకుంది. అద్దంకి రెడ్డిరాజుల పోషణలో మహాభారతం ఆంద్రీకరణం సంపూర్ణమైంది.

పూర్తి వివరాల కోసం క్రింద లింకులు చూడండి.

హైందవ ధర్మ పరిరక్షకులు ముసునూరి నాయకులు – 1

జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌, గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348

Post a Comment

0 Comments